
భారత అథ్లెట్ సిద్ధాంత్ తింగాలయ
బర్మింగ్‌హమ్: ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ సిద్ధాంత్ తింగాలయకు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్‌లో పురుషుల 60 మీటర్ల హర్డిల్స్‌లో పోటీ పడ్డ సిద్ధాంత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. మూడో హీట్‌లో బరిలోకి దిగిన 27 ఏళ్ల సిద్ధాంత్ 7.93 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మొత్తం నాలుగు హీట్స్ నుంచి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు సెమీఫైనల్‌కు అర్హత పొందుతారు. అమెరికాలో శిక్షణ పొందే సిద్ధాంత్ ఎనిమిది మంది పాల్గొన్న తన హీట్స్‌లో ఆరో స్థానంలో నిలిచి ఆ అవకాశాన్ని కోల్పోయాడు.
Comments
Please login to add a commentAdd a comment