disappointment
-
జాడ లేని పెళ్లికూతురు.. నిరాశతో తిరిగొచ్చిన పెళ్లికొడుకు
లక్నో: పాపం ఓ పెళ్లికొడుకు పెళ్లి చేసుకోవడం కోసం బంధుమిత్రులు, బాజా భజంత్రీలతో పెళ్లి కూతురు ఇంటికి బయలుదేరాడు. ఇక్కడే అతడికి పెద్ద షాక్ తగిలింది. వెళ్లినచోట ఎంత వెతికినా పెళ్లికూతురు ఇల్లు దొరకలేదు. పెళ్లి కూతురు, ఆమె అమ్మానాన్నలకు ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ వచ్చింది.అక్కడ ఇరుగుపొరుగు వాళ్లను అడిగితే అసలు మీరు చెబుతున్నవారెవరు ఇక్కడ ఉండరు అని సమాధానం వచ్చింది. ఇంకేముంది పోలీసులకు ఫిర్యాదు చేసిన పెళ్లికొడుకు నిరాశతో వెనుదిరిగాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో లక్నోలోని రహీమామాబాద్ ప్రాంతంలో ఆదివారం(జులై 14) జరిగింది. ఉన్నావోకు చెందిన సోనూ అనే యువకుడికి కాజల్ అనే అమ్మాయికి చండీగఢ్‌లో పరిచయమైంది. వారిద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యారు. భాజాభజంత్రీలు అన్నీ రెడీ చేసుకుని వస్తే పెళ్లి చేసుకుందాం అని కాజల్ సోనూకు ఫోన్లో చెప్పింది. పెళ్లి ఏర్పాట్లు మొత్తం చేసేశామని కాజల్ తండ్రి కూడా సోనూకు ఫోన్లో చెప్పాడు. ఈ మాటలు నిజమని నమ్మిన సోనూ పెళ్లి చేసుకుందామని వెళ్లి పెళ్లికూతురు ఇల్లు దొరకక షాక్‌లో వెనుదిరిగి వచ్చాడు. -
రాష్ట్రవ్యాప్తంగా ఆగుతున్న YSRCP అభిమానుల గుండెలు
-
పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్.. అనుకున్నదొకటి.. అయ్యిందొకటి..
హస్తినలో జనసేనాని పవన్ టూర్ తుస్ మందా.. పొత్తులపై ముందడుగు వేయాలనుకున్న పవన్‌కి ఆశాభంగమే ఎదురైందా.. ఎన్డీఏ సమావేశంలో అసలు రాష్ట్ర రాజకీయాలే చర్చకి రాకపోవడం.. మోదీ, అమిత్ షా లాంటి అగ్రనేతలని కలిసే అవకాశం రాకపోవడంతో పవన్ నిరాశతో తిరుగుముఖం పట్టారా.. ఇపుడు పవన్ దారెటు. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనపై ఆశలు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీకి నిరాశే ఎదురైంది. బీజేపీతో కలవడానికి వేసిన ఎత్తుగడ ఫలించలేదు. ఇక టీడీపీని బీజేపీకి దగ్గర చేసేందుకు ఎన్డీఏ సమావేశాన్ని ఉపయోగించుకోవాలన్న పవన్ ఆశలు కూడా నెరవేరలేదు.. ఫలితంగా పవన్ ఢిల్లీ టూర్ మొత్తానికి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాని కలవటం.. ఆ కొద్ది రోజులకి ఎన్డీఏ సమావేశం ప్రకటన రావడంపై ఏపీ రాజకీయాలలో పెద్ద చర్చే సాగింది. ఒకానొక దశలో ఎన్డీఏ సమావేశానికి బీజేపీ నుంచి టీడీపీకి ఆహ్వానమందిందనే లీకులని తెలుగుదేశం పార్టీ మీడియాకి అందించింది. ఒకట్రెండు పచ్చపత్రికలు అడుగు ముందుకు వేసి ఎన్డీఏ సమావేశానికి టీడీపీకి ఆహ్వానం అందిందంటూ ఊదరగొట్టాయి. అసలు టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కానప్పుడు ఎలా పిలుస్తామని టీడీపీకి ఆహ్వానం లేదని ఆ తర్చాత బీజేపీ నేతలు కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టం చేశారు.. దీంతో కంగుతిన్న టీడీపీ నేతలు దత్తపుత్రుడిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక గత దశాబ్దకాలంలో ఏనాడూ ఎన్డీఏ భాగస్వామ్య పక్ష సమావేశానికి పిలవని బీజేపీ తొలిసారి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కి ఆహ్వానం పంపారు. ఇంకేం.. తమకి ఆహ్వానం అందకపోయినా తమ దత్తపుత్రుడికి ఆహ్వానం అందిందని టీడీపీ నేతలు సంకలు గుద్దుకున్నారు.. ఎలాగైనా పవన్ ఢిల్లీ టూర్లో పొత్తుల ప్రస్తావన వస్తుందని కూడా ఆశలు పెట్టుకున్నారు.. మరో వైపు ఎలాగైనా ఢిల్లీ టూర్‌ని తమపొత్తులకి అనుకూలంగా మార్చుకోవాలని పవన్ భావించారు.. తీరా చూస్తే అంతా తుస్ మంది. ఎన్డీఎ సమావేశంలో ఏపీ రాజకీయాలపై చర్చకి వస్తాయని భావించిన పవన్ కళ్యాణకి ఆశాభంగమే ఎదురైంది. ఏపీలో వైఎస్సార్సీపీని ఎదుర్కోవాలంటే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్లాలని సమావేశంలో చెప్పాలనుకున్న పవన్‌కి ఆ అవకాశమే రాలేదు.. దేశ రాజకీయాలపైనే చర్చ జరగడంతో పవన్ ఆశలపై నీళ్లు జల్లినట్లైంది...ఇక టీడీపీని ఎలాగైనా బీజేపీతో కలపాలని పవన్ ఢిల్లీలో పిల్లి మొగ్గలు వేసినా ఫలితం దక్కలేదు.. ఇక ఎన్డిఏ సమావేశం తర్వాతైనా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా లాంటి అగ్రనేతలతో భేటీ ఉంటుందనుకున్నా అదీ జరగలేదు...కానీ ఈ రోజు ఉదయం ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి మురళీధరన్ ఇంటికి వెళ్లి కలిసే అవకాశం మాత్రమే దక్కింది. ఇక ఇతర బీజేపీ అగ్రనేతలతోనైనా భేటికి అవకాశం దక్కుతుందేమో అనుకున్నప్పటికీ అదీ నెరవేరలేదు. ఎన్డిఏ భేటీకి ముందు.. తర్వాత కూడా పవన్ మీడియాతో మాట్లాడి తన మనసులో మాట మరోసారి బయటపెట్టారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వెళ్తాయని చెప్పడం ద్వారా బీజేపీ నాయకత్వానికి తన ఆలోచనని మరోసారి స్పష్టం చేసినట్లైంది.. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ అజ్ఞానాన్ని బట్టబయలు చేసుకున్నారు. సమావేశంలో దేశ రాజకీయాలు గురించి తప్పితే ఎక్కడా రాష్డ్ర రాజకీయాల గురింవి ప్రస్తావనే రాలేదని స్వయంగా పవన్ కళ్యాణే మీడియాకి తేల్చి చెప్పేశారు. అదే చంద్రబాబు లాంటి నేత అయితే రెండు, మూడు రోజుల పాటు హైడ్రామానే నడిపించేవారని.. పవన్ కల్యాణ్‌కి రాజకీయ పరిపక్వత లేకే ఈ విధంగా మాట్లాడారని జనసేన నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.. మరో వైపు పవన్ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం పొత్తులపై ఎక్కడా స్పందించలేదు.. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్తాయన్న పవన్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు స్పందించారు. పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పడం ద్వారా తమ చేతులలో ఏమీ ఉండదని చెప్పకనే చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూరు అనుకున్నదొకటి.. అయ్యిందొకటి.. అన్నట్లుగా జరిగింది. -వినాయక్, ఛీఫ్ రిపోర్టర్, సాక్షి టివి, విజయవాడ -
ఆమె ధైర్యం ముందు నిరాశ నిలబడలేకపోయింది!
పెల్లెట్ గన్‌లో నుంచి పెల్లెట్స్ గంటకి 1100 కి.మీ వేగంతో ఇన్షా రెండు కళ్లలోకి దూసుకెళ్లాయి. అప్పుడా అమ్మాయి 9 చదువుతోంది. 2016లో కశ్మీర్లో గుంపును అదుపు చేయడానికివాడిన పెల్లెట్ గన్స్ అమాయకులకు కూడా శాపంగా మారాయి. ఇన్షా ఓడిపోలేదు. నిరాశ పడలేదు. అంచెలంచెలుగా శ్రమ చేసి చదువుకుంది.మొన్న సీనియర్ ఇంటర్ పరీక్షలలో 500కి 315 మార్కులు సాధించింది. ‘నేను ఐ.ఏ.ఎస్ అవుతాను. అంధులకు ఆత్మవిశ్వాసం ఇస్తాను’ అంటోంది. అంధులేంటి.. ఓటమి భయంతో ఉన్నవారందరూ ఆత్మవిశ్వాసం పొందగలరు ఇన్షాను చూస్తే. దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్ ప్రాంతంలో సెదౌ అనే చిన్న పల్లె. వేసవి కాలం. అల్లర్లు చెలరేగాయి. భద్రతా దళాలు వారిని అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇంట్లో మొదటి అంతస్తు కిటికీలో నుంచి ఏం జరుగుతున్నదో చూద్దామని 16 ఏళ్ల ఇన్షా ముష్టాక్ కిటికీ తెరిచింది. ఆ తర్వాత ఏమైంది అర్థం కాలేదు. క్షణపాటులో ఆమె రెండు కళ్ల నుంచి రక్తం దౌడు తీసింది. విపరీతమైన నొప్పితో ఇన్సా ఆర్తనాదాలు చేసింది. 2016, 2017... రెండు సంవత్సరాల పాటు భద్రతాదళాలు కశ్మీర్లో ప్రయోగించిన పెల్లెట్ గన్స్ వల్ల శాశ్వతంగా అంధులైన వారు 139 మంది. వారిలో ఇన్షా ఒకమ్మాయి. విఫలమైన డాక్టర్లు పెల్లెట్లు కళ్లల్లోకి దూసుకెళ్లగానే ఇన్షా చూపు పోయింది. కాని మానవీయ సంస్థలు, ప్రభుత్వం కూడా ఇన్షా చికిత్స కోసం ముందుకు వచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో డాక్టర్లు కూడా ప్రయత్నించి ఆమెకు ఎప్పటికీ చూపు రాదని తేల్చారు. పెల్లెట్లు జీవితాంతం శరీరంలో ఉండిపోతాయి. అవి చాలా ప్రమాదం. ‘అయితే అంతకన్నా ప్రమాదం నిరాశలో కూరుకుపోవడం అని నాకు తెలుసు. నేను చదువుకోవాలనుకున్నాను. నా కంటే ముందు మా అమ్మ అఫ్రోజా, డ్రైవర్‌గా జీవితం గడిపే మా నాన్న ముష్టాక్ అహ్మద్ లోన్ నేను చదువుకోవాలని భావించారు. మరో రెండేళ్ల తర్వాత ఒక లేఖకుని సహాయంతో నేను టెన్త్ పాసయ్యాను’ అని తెలిపింది ఇన్హా. బ్రెయిలీ నేర్చుకుని... అయితే ఇంటర్ మాత్రం బ్రెయిలీ నేర్చుకుని పరీక్షలు రాసి పాసవ్వాలని నిశ్చయించుకుంది ఇన్షా. ఇందుకోసం శ్రీనగర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయ్యింది. ఇంటర్‌తో పాటు కంప్యూటర్ కోర్సు, ఇంగ్లిష్ స్పీకింగ్ కోర్సు కూడా నేర్చుకుంది. బ్రెయిలీ ద్వారా పాఠాలు నేర్చుకుని పరీక్షలు రాయడం చాలా కష్టమయ్యేది. అయినా సరే ఇన్షా ఆగలేదు. 2011లో ఫస్ట్ ఇయర్ ఇంటర్ పూర్తి చేసింది. ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ ఇంటర్ ఏ గ్రేడ్‌లో పాసయ్యింది. ‘చదువు ఒక్కటే నాకు స్వేచ్ఛ, స్వతంత్రం ఇవ్వగలదు. అది నాకు తెలుసు. ఐ.ఏ.ఏస్ చేయాలనుకుంటున్నాను. అంధులకు మన దేశంలో తగినన్ని ప్రత్యేకమైన స్కూల్స్ లేవు. ఆ విషయంలో నేను కృషి చేస్తాను’ అని తెలిపింది ఇన్షా. సానుభూతి ఇష్టపడదు ఇంటర్ పాసయ్యిందని తెలిశాక ఆమె తల్లిదండ్రులు ఉద్వేగంతో కన్నీరు కార్చారు. తండ్రి, తల్లి తమ కూతురి పట్టుదలకు గర్వపడ్డారు. ఇన్షా కూడా తన విజయంతో సంతోషంగా ఉంది. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, హోమ్ మినిస్ట్రీ అధికారులు ఆమెను మెచ్చుకున్నారు. మంచి కాలేజ్‌లో చదువు కొనసాగడానికి హామీలు దొరికాయి. ఉత్సాహపరిచే వాళ్లను తప్ప సానుభూతి చూపించేవాళ్లను ఇన్షా ఇష్టపడదు. ‘నేను అందరితో సమానంగా జీవించగలను. నాకు సానుభూతి చూపకండి. వీలైతే నా ప్రయాణంలో తోడు నిలవండి’ అంటోందామె. (చదవండి: ప్రాణం నిలిపే రక్తపు బొట్టు ) -
SS Rajamouli: ప్రసంశల గురించి పెద్దగా ఆలోచించను నాకు కావాల్సింది అదే!
‘ఆర్ఆర్ఆర్’ చిత్రం 95వ ఆస్కార్ అవార్డ్స్‌కు ఇండియా తరఫున అఫీషియల్ ఎంట్రీగా ఎంపిక కాకపోవడం అనేది కాస్త నిరుత్సహపరిచిందని దర్శకుడు రాజమౌళి పేర్కొన్నారు. ఓ ఆంగ్ల ఆన్లైన్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ విధంగా స్పందించారు. ‘‘మన దేశం తరఫున ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అధికారిక ఎంట్రీ లభించకపోవడంతో నిరాశ చెందాను. ‘ఆర్ఆర్ఆర్’కు ఆఫీషియల్ ఎంట్రీ లభిస్తే బాగుండేదన్నట్లుగా విదేశీయులు సైతం అనుకుంటున్నారు. అయితే మా సినిమాకు ఎందుకు అధికారిక ఎంట్రీ లభించలేదు? అని పదే పదే ఆలోచిస్తూ ఉండే మనస్తత్వాలు కావు మావి. జరిగిందేదో జరిగిపోయింది. మనం ముందుకు సాగిపోవాలి. అయినా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) కమిటీ నియమ, నిబంధనలు, మార్గదర్శకాలు వంటి అంశాల గురించి నాకు తెలియదు కాబట్టి నేను ఈ విషయంపై కామెంట్ చేయాలనుకోవడం లేదు. ఇక దేశం తరఫున అఫీషియల్ ఎంట్రీగా పంపిన ‘ఛెల్లో షో’ (గుజరాతీ ఫిల్మ్, ఇంగ్లిష్‌లో ‘లాస్ట్ ఫిల్మ్ షో) చిత్రానికి ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో స్థానం లభించినందుకు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది కూడా ఇండియన్ సినిమాయే’’ అని చెప్పుకొచ్చారు రాజమౌళి. కాగా ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటునాటు’ సాంగ్‌కు ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో స్థానం లభించింది. ఇక గుజరాతీ ఫిల్మ్ ‘ఛెల్లో షో’ ఇండియా తరఫున అధికారిక ఎంట్రీగా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగంలో షార్ట్‌లిస్ట్ కాగా, ‘ఆర్ఆర్ఆర్’తో పాటు మరో ఎనిమిది ఇండియన్ చిత్రాలు ‘ఆస్కార్ రిమైండర్ లిస్ట్’లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక 95వ ఆస్కార్ అవార్డ్స్‌కు సంబంధించిన నామినేషన్స్ ఈ నెల 24న వెల్లడికానున్నాయి. అవార్డ్ ఫంక్షన్ మార్చిలో జరగనుంది. ‘ఆర్ఆర్ఆర్’ విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన విషయం తెలిసిందే. డబ్బు కోసమే... డబ్బు, ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే ఓ దర్శకుడిగా నేను సినిమాలు తీస్తాను. విమర్శకుల ప్రసంశల గురించి పెద్దగా ఆలోచించను. ‘ఆర్ఆర్ఆర్’ ఓ కమర్షియల్ ఫిల్మ్. బాక్సాఫీస్ వద్ద నా సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అయితే నేను హ్యాపీ. అవార్డ్స్‌ను బోనస్‌లా భావిస్తాను. అయితే ఓ సినిమా కోసం పడిన కష్టానికి గుర్తింపు లభిస్తే నాకు, నా చిత్రబృందానికి సంతోషం అనిపిస్తుంది’’ అని కూడా పేర్కొన్నారు రాజమౌళి. ఇక మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి తర్వాతి సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. -
మాకూ ఇవే చివరి ఎన్నికలా..?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశ, నిస్పృహల్లోకి నెట్టాయి. పార్టీ అధినేత మానసికంగా అందరినీ బలోపేతం చేయాల్సింది పోయి బేలగా మాట్లాడటంపై నాయకులు అంతర్మథనంలో పడ్డారు. ‘నాకు ఇవే చివరి ఎన్నికలు, మీరు నన్ను గెలిపించండి’ అంటూ కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న పార్టీ కేడర్ పూర్తిగా డీలా పడింది.అధికారంలో ఉన్నన్నాళ్లూ వాడుకుని.. ఇప్పుడేమో ఇవే చివరి ఎన్నికలంటూ అందరినీ ఊబిలోకి నెట్టారని అనంతపురం జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత వాపోయారు. అధినేతే ఇలా డీలా పడిపోతే మా పరిస్థితి ఏంటని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల్లోకి ఏమని వెళ్లాలి?.. ‘టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలంటూ పార్టీ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూర్చాం... ప్రస్తుత ప్రభుత్వమేమో వాళ్లూ వీళ్లూ అని చూడకుండా ప్రతి గ్రామంలోనూ 95 శాతం మందికి అన్ని పథకాలూ వర్తింపచేసింది. ఈ పరిస్థితుల్లో ఏమి చెప్పి ప్రజల్లోకి వెళ్లాల’ని టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులు తెల్లమొహం వేస్తున్నారు. పింఛన్లు, చేదోడు, అమ్మ ఒడి, రైతు భరోసా, వాహనమిత్ర ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా వైఎస్సార్సీపీ వారే కాదు కొన్ని గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలకే ఎక్కువగా లబ్ధి జరిగింది. దీంతో తాము పల్లెల్లోకి వెళితే.. నిరసన తప్పదని నాయకులు అంటున్నారు. గడప గడపలోనే స్పష్టత.. జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు గడప గడపకూ తిరుగుతున్నారు. ఏ ఇంటికి ఎంత లబ్ధి జరిగిందో ఆధారాలతో సహా తీసుకుని వెళుతున్నారు. మూడున్నరేళ్ల తర్వాత ప్రజల్లోకి వెళుతున్నా ఎక్కడా ఇసుమంత నిరసన లేదు. దీంతో టీడీపీ నాయకుల్లో భయాందోళన మొదలైంది. మనం ఎన్ని రకాలుగా గిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని లోలోపల మదనపడుతున్నారు. ఉన్న దానికీ లేనిదానికీ బురద జల్లినా అది మనకే అంటుకుంటోందన్న అభిప్రాయంలో ఉన్నారు. అప్పుడే కుమ్ములాటలు.. ఎన్నికలకు ఏడాదిన్నర ఉండగానే అప్పుడే తెలుగు తమ్ముళ్లు తన్నుకుంటున్నారు. మొన్న కళ్యాణదుర్గం నియోజకవర్గ సమావేశంలో ఇదే జరిగింది. కదిరిలో ఇప్పటికీ రెండు వర్గాల మధ్య రోజూ రచ్చ జరుగుతోంది. ధర్మవరంలో సూరి టీడీపీలోకి ఎప్పుడొస్తారో తెలియని పరిస్థితి. మడకశిరలో ఎవరు అభ్యర్థో తెలియదు. కళ్యాణదుర్గంలో రెండు వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. శింగనమలలో ఎవరు అభ్యర్థో స్పష్టత లేదు. అనంతపురంలో ప్రభాకర్ చౌదరిపై మరో వర్గం నిప్పులు చెరుగుతోంది. రాయదుర్గంలో కాలవ శ్రీనివాసులు మాటలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. రాప్తాడులో పరిటాల సునీతకు వ్యతిరేకంగా మరో వర్గం కసిగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా అటు సత్యసాయి, ఇటు అనంతపురం జిల్లాల్లో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గపోరు నడుస్తూనే ఉంది. -
క్యూ2లో మదర్సన్ సుమీ వైరింగ్ లాభాలు ఓకే
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆటో విడిభాగాల కంపెనీ మదర్సన్ సుమీ వైరింగ్ ఇండియా ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై-సెప్టెంబర్ (క్యూ2)లో నికర లాభం స్వల్పంగా 2 శాతం పుంజుకుని రూ. 116 కోట్లను అధిగమించింది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 114 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,400 కోట్ల నుంచి రూ. 1,835 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 1,230 కోట్ల నుంచి రూ. 1,690 కోట్లకు పెరిగాయి. దేశీ ఆటోమోటివ్ పరిశ్రమ తిరిగి జోరందుకున్నట్లు కంపెనీ చైర్మన్ వివేక్ చాంద్ సెహగల్ పేర్కొన్నారు. దీంతో తమ కస్టమర్లు ఉత్పత్తిని పెంచుతున్నట్లు తెలియజేశారు. ఇది వ్యయాలను (వన్‌టైమ్) పెంచినప్పటికీ రానున్న త్రైమాసికాలలో సర్దుబాటు కాగలవని తెలిపారు.అయితే ఈ ఫలితాలు నేపథ్యంలో సోమవారం 6 శాతం నష్టాలనుంచి కోలుకుని మంగళవారం 2 శాతం లాభాలతో కొనసాగుతోంది. -
ఎగుమతుల క్షీణత... వాణిజ్యలోటు తీవ్రత
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు–దిగుమతులకు సంబంధించి జూలై గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, ఎగుమతులు స్వల్పంగా 0.76 శాతం క్షీణించి (2021 జూలై నెలతో పోల్చి) 35.24 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇక ఎగుమతులు 44 శాతం పెరిగి 66.26 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు భారీగా 31.02 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2021 జూలైలో భారత్ వాణిజ్యలోటు 10.63 బిలియన్ డాలర్లు మాత్రమే. పసిడి దిగుమతులు జూలైలో వార్షికంగా సగానికి సగం పడిపోయి 2.37 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. ఏప్రిల్ నుంచి జూలై వరకూ...: ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో భారత్ ఎగుమతుల విలువ 156 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 48 శాతం ఎగసి 256 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు 100 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం భారత్ ఎగుమతుల లక్ష్యం 400 బిలియన్ డాలర్ల సాధన నెరవేరింది. 2022–23లో కూడా 470 బిలియన్ డాలర్ల లక్ష్య సాధన నెరవేరుతుందన్న విశ్వాసాన్ని వాణిజ్యశాఖ కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం వ్యక్తం చేశారు. డిమాండ్–సరఫరాల సవాళ్లు, నియంత్రణలు, కోవిడ్–19 సమస్యలు, రష్యా–ఉక్రెయిన్ భౌగోళిక ఉద్రిక్తతలు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ఎగుమతుల విభాగం చక్కని పనితీరునే కనబరుస్తున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మరో ప్రకటనలో పేర్కొంది. -
నైరాశ్యంలో విపక్షాలు
న్యూఢిల్లీ: ప్రజలు తమను ఆదరించడం లేదన్న నిరాశతో విపక్షాలు విభజన రాజకీయాలకు తెర తీశాయని బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా మండిపడ్డారు. మోదీ పాలనలో దేశంలో మతోన్మాదం పెరుగుతోందంటూ 13 విపక్ష పార్టీలు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు దేశవాసులనుద్దేశించి సోమవారం ఆయన లేఖ రాశారు. ‘‘ఓటుబ్యాంకు, విభజన రాజకీయాలకు పాల్పడి కూడా వరుస ఎన్నికల్లో విపక్షాలు ఘోర ఓటమినే మూటగట్టుకుంటున్నాయి. మోదీ నాయకత్వంలో దేశ ప్రజలకు సాధికారత లభిస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. అభివృద్ధిని అడ్డుకోజూస్తున్నాయి. బీజేపీ వ్యతిరేకతే ఏకైక ఎజెండాగా ఒక్కటై విభజన రాజకీయాలకు తెర తీస్తున్నాయి’’ అంటూ మండిపడ్డారు. దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన వాళ్లు ఇప్పుడు సోదిలో కూడా లేకుండా పోతుండటంపై ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ కాంగ్రెస్‌కు చురకలు వేశారు. కాంగ్రెస్, ఇతర విపక్షాలు అధికారంలో ఉన్న రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో జరుగుతున్న మత ఘర్షణలు, రాజకీయ హింసపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మత హింసకు కారకులు మీరే విపక్షాల అసలు రంగు ప్రజల ముందు క్రమంగా బయట పడుతోందని నడ్డా అన్నారు. దాంతో వాటికి ఎటూ పాలుపోవడం లేదని ఎద్దేవా చేశారు. ‘‘1966లో గో వధను నిషేధించాలంటూ పార్లమెంటు బయట శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సాధువులపై నాటి ప్రధాని ఇందిరాగాంధీ కాల్పులు జరిపించలేదా? ఆమె హత్యానంతరం సిక్కులపై భారీ హత్యాకాండ జరిగితే, పెద్ద చెట్టు కూలినప్పుడు ఆ మాత్రం ప్రకంపనలుంటాయని కుమారుడు రాజీవ్‌గాంధీ బాధ్యాతారహితంగా మాట్లాడలేదా? 1969లో గుజరాత్లో, 1980లో మొరాదాబాద్, 1984లో భివాండీ, 1989లో భాగల్పూర్ తదితర చోట్ల మత ఘర్షణలకు కారకులెవరు? దారుణమైన మత హింస బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు కాదా?’’ అని నడ్డా ప్రశ్నించారు. ఇప్పటికైనా విభజనవాదం వదిలి అభివృద్ధి రాజకీయాలను అందిపుచ్చుకోవాలని హితవు పలికారు. -
ఆరు వారాల్లో అతిపెద్ద నష్టం
ముంబై: స్టాక్ మార్కెట్ సోమవారం ఆరు వారాల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో అధిక వెయిటేజీ ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ షేర్ల భారీ పతనం సూచీల నష్టాలను శాసించాయి. దేశీయంగా వినిమయ, టోకు ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరడంతో ఆర్బీఐ వడ్డీరేట్లు పెంపు ఆందోళనలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం భయాలతో పాటు తాజాగా పెరుగుతున్న కోవిడ్ కేసులు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఫలితంగా ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లలో భారీగా అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ సూచీలు రెండు శాతం క్షీణించాయి. సెన్సెక్స్ 1,172 పాయింట్లు పతనమై 57,167 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లకు గానూ 20 షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ 302 పాయింట్లను కోల్పోయి 17,174 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది వరుసగా నాలుగోరోజూ నష్టాల ముగింపు. మరోవైపు ఎఫ్ఎంసీజీ, మెటల్, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.6,387 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీ ఇన్వెస్టర్లు రూ.3,342 కోట్ల షేర్లను కొన్నారు. ఆరంభ నష్టాలను పూడ్చుకున్న రూపాయి డాలర్ మారకంలో ఆరు పైసలు బలహీనపడి 76.25 స్థాయి వద్ద ముగిసింది. 1,000 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభం నాలుగు సెలవు రోజుల అనంతరం ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూలతలను అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 1,000 పాయింట్లను కోల్పోయి 57,339 వద్ద, నిఫ్టీ 293 పాయింట్ల పతనంతో 17,183 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి దశలో కాస్త కోలుకునే ప్రయత్నం చేసినా.., రికవరీకి తోడ్పాటును అందించే అంశాలేవీ లేకపోవడంతో సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లోనే కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,497 పాయింట్లు క్షీణించి 56,842 వద్ద, నిఫ్టీ 408 పాయింట్లను కోల్పోయి 17,068 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ► మ్యూచువల్ ఫండ్ పంపిణీ ప్లాట్‌ఫామ్ ‘బీఎస్ఈ స్టార్ ఎంఎఫ్’పై సోమవారం 30.11 లక్షల లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ 11 తర్వాత ఒకరోజులో ఇదే గరిష్టస్థాయి అని బీఎస్ఈ తెలిపింది. ► సూచీలు రెండు శాతం పతనంతో స్టాక్ మార్కెట్లో రూ. 2.58 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. తద్వారా బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.269 లక్షల కోట్లకు దిగివచ్చింది. బలహీనంగా అంతర్జాతీయ మార్కెట్లు చైనా ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ 4.8 శాతం వృద్ధికి పరిమితం కావడంతో పాటు కోవిడ్ కేసులు శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. జపాన్, సింగపూర్, చైనా, తైవాన్, దక్షిణ కొరియా, స్టాక్ సూచీలు ఒకశాతం వరకు పతనమైంది ఇండో నేసియా మార్కెట్ మాత్రం నష్టాల నుంచి తేరుకొని అరశాతం లాభపడింది. హాంగ్‌కాంగ్ మార్కెట్ సెలవు. ఈస్టర్ హాలిడేస్ సందర్భంగా యూరప్ మార్కెట్లు పనిచేయలేదు. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్‌కు రూ.53,509 కోట్ల నష్టం మార్చి త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఇన్ఫోసిస్ షేరు సోమవారం ఏడుశాతానికి పైగా క్షీణించి రూ.1,621 వద్ద స్థిరపడింది. గత బుధవారం (ఏప్రిల్ 13)మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ క్యూ4 ఫలితాలను వెల్లడించింది. బలహీనమైన నిర్వహణ మార్జిన్ నమోదు నేపథ్యంలో షేరు ఉదయం 8% నష్టంతో రూ.1592 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో తొమ్మిది శాతం క్షీణించి రూ.1,592 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మార్చి 16, 2020 తర్వాత షేరు ఈ స్థాయిలో దిగజారడం ఇదే తొలిసారి. షేరు భారీ పతనంతో కంపెనీకి ఒక్కరోజులోనే రూ.53,509 కోట్ల నష్టం వాటిల్లింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 5 శాతం పతనం ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు ఐదు శాతం నష్టపోయి రూ. 1,395 వద్ద స్థిరపడింది. క్యూ4లో నికర లాభం అంచనాలను అందుకోలేకపోవడం షేరు పతనానికి కారణమైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఐదు శాతం నష్టపోయి రూ.1,390 స్థాయిని తాకింది. బీఎస్ఈలో 4.94 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.38,542 కోట్లు కుచించుకుపోయి రూ.7.73 లక్షల కోట్లు వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► తన అనుబంధ సంస్థలో యూఎస్ కంపెనీ బ్లాక్‌రాక్ రియల్ అసెట్స్ రూ. 4,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు టాటా పవర్ ప్రకటనతో ఈ షేరులో లాభాల స్వీకరణ జరిగింది. బీఎస్ఈలో ఆరు శాతం నష్టంతో రూ.258 వద్ద స్థిరపడింది. ► ఈ వేసవి సీజన్లో విద్యుత్ డిమాండ్ ఉంటుందన్న అంచనాతో ఎన్టీపీసీ షేరు ఆరుశాతం లాభపడి రూ.163 వద్ద స్థిరపడింది. ‘‘ఐటీ, బ్యాంకింగ్ రంగ దిగ్గజాలు నిరాశాజనకమైన గణాంకాలతో ఆర్థిక ఫలితాల సీజన్‌ను ప్రారంభించడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. భారత్‌లో కోవిడ్ కేసుల నమోదు, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ ఆందోళనలు రానున్న రోజుల్లో దేశీయ మార్కెట్‌కు దిశానిర్ధేశాన్ని చూపుతాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. -
క్వార్టర్ ఫైనల్లో సింధుకు చుక్కెదురు
ఒడెన్స్: టోక్యో ఒలింపిక్స్ తర్వాత బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. డెన్మార్క్‌ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 36 నిమిషాల్లో 11–21, 12–21తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ ఆన్ సెయంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి పాలైంది. ఆన్ సెయంగ్‌తో పోరులో సింధు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. తొలుత సింధు 2–1తో ఆధిక్యంలోకి వెళ్లినా... ఆన్ సెయంగ్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 6–2తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఆన్ సెయంగ్ వెనుదిరిగి చూడలేదు. ఇక రెండో గేమ్‌లోనూ ఆన్ సెయంగ్ జోరు కొనసాగింది. ఈ గేమ్‌లో ఒక్కసారి కూడా ఇద్దరు స్కోర్లు సమం కాకపోవడం ఆన్ సెయంగ్ ఆధిపత్యానికి నిదర్శనం. మరోవైపు టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ తొలి గేమ్‌ను 17–21తో చేజార్చుకున్నాక గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. -
వెలవెలబోయిన ట్రెడా ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) ప్రాపర్టీ షో నిరుత్సాహంగా మొదలైంది. ఇప్పటివరకు ట్రెడా 10 ప్రాపర్టీ షోలు జరిగాయి. ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఓ సినీ నటుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రాపర్టీ షోను ప్రారంభించారు. సాధారణం గా ఏ డెవలపర్ల సంఘం ప్రాప ర్టీ షో నిర్వహించినా నిర్మాణ రంగానికి సంబంధించిన మంత్రులనో లేదా ప్రభుత్వ అధికారులనో ముఖ్య అతిథిగా హాజరవటం ఆనవాయితీ. కానీ, ట్రెడా ఈ ఆనవాయితీని పాటించలేదు. సదరు నిర్వాహకులు ప్రభుత్వాధికారులు లేదా రాజకీయ నేతలను ముఖ్య అతిథిగా ఆహ్వానించగా.. ఎవరూ సరిగా స్పందించలేదని ట్రెడా సభ్యుడు ఒకరు తెలిపారు. నిర్మాణ సంస్థలు, బ్యాంక్‌లు కలిపి మొత్తం 105 స్టాల్స్‌ను ఏర్పాటు చేయగా.. ఇందులో 20–25 కంపెనీలు మినహా మిగిలిన స్టాల్స్ అన్నీ చిన్నా చితక నిర్మాణ సంస్థలకు చెందినవే. ఎక్కువగా ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన స్టాల్సే. చాలా వరకు స్టాళ్లు ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చాయి. ప్రతి ఏటా అక్టోబర్–నవంబర్ మధ్య కాలంలో ట్రెడా ప్రాపర్టీ షో నిర్వహించాలి కాబట్టి ఏదో మొక్కుబడిగా నిర్వహించినట్లు కనిపించింది. తొలి రోజు పైగా వర్కింగ్ డే కాబట్టి పెద్దగా సందర్శకులు రాలేదని.. శని, ఆది వారాలు సెలవు రోజులు కావటంతో సందర్శకులు వచ్చే అవకాశం ఉందని ఓ స్టాల్ నిర్వాహకుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రదర్శనలో అనుమతులు లేని ప్రాజెక్ట్‌లు కూడా.. నిర్మాణ అనుమతులు రాని ప్రాజెక్ట్‌లు, భవిష్యత్తులో నిర్మించబోయే ప్రాజెక్ట్‌లకు సంబంధించిన కరపత్రాలు, హోల్డింగ్స్ ప్రదర్శిస్తూ ట్రెడా ప్రాపర్టీ షోలో స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. రెరా నిబంధనల ప్రకారం రెరా అనుమతి తీసుకోకుండా ప్రాజెక్ట్‌లను ప్రకటనలు చేయడం, ప్రదర్శించడం నేరం. కానీ నిర్వాహకులు ఇవేవి పట్టించుకోలేదు. పైగా ఆయా స్టాళ్ల వద్దకు వచ్చిన సందర్శకులతో ‘త్వరలోనే ప్రాజెక్ట్‌ను లాంచింగ్ చేయనున్నాం. ఇప్పుడే కొనుగోలు చేస్తే ధర తక్కువకు వస్తుందని ప్రీలాంచ్లో బుకింగ్ చేసుకోండని’ సదరు నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ నిర్వాహకులు చెబుతున్నారు. యూడీఎస్ విధానంలో ఫ్లాట్లను విక్రయిస్తున్న ఓ కంపెనీ ఏకంగా స్పాన్సర్లలో ఒకటిగా నిలిచింది. సందర్శకులను ఆకట్టుకునేలా ఆకర్షణీయంగా స్టాల్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. -
క్యూ1కు సెకండ్ వేవ్ షాక్!
గతేడాది చివరి త్రైమాసికం (2020–21, జనవరి–మార్చి)లో కార్పొరేట్ దిగ్గజాలు ఆకర్షణీయ ఫలితాలు సాధించాయి. అయితే ఇది పరిశ్రమ వర్గాలకు జోష్‌నివ్వడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ మొదలు దేశీయంగా తలెత్తిన కోవిడ్–19 సెకండ్ వేవ్.. మరోసారి లాక్డౌన్లకు దారితీయడంతో పలు రంగాలపై తీవ్ర ప్రభావం కనిపించనున్నట్లు భావిస్తున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లో పలు కంపెనీలు మళ్లీ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించవచ్చనేది విశ్లేషకుల అంచనా. ముంబై: కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా ఉధృత రూపం దాల్చడంతో జనజీవనం అస్తవ్యస్తంకావడంతోపాటు.. పారిశ్రామిక రంగాలకూ సెగ తగులుతోంది. ఇప్పటికే ఏప్రిల్ నెలలో పలు కంపెనీల అమ్మకాలు పడిపోగా.. మే నెలలో వైరస్ మరింత దెబ్బతీసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా ఆటో, ఆతిథ్యం, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, ట్రావెల్, టూరిజం, విచక్షణాధారిత వినియోగం తదితర రంగాలు కరోనా వైరస్ దెబ్బకు కుదేలవనున్నట్లు పేర్కొంటున్నారు. ఇది బ్యాంకింగ్ రంగంపై సైతం ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నట్లు ఆర్థిక రంగ నిపుణులు తెలియజేశారు. ఈ పరిస్థితులు అత్యధిక రిస్కులకు దారితీయవచ్చని బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడ్డారు. హెల్త్‌కేర్ ఓకే.... ఇటీవల ప్రజలు ఆరోగ్య పరిరక్షణ, గృహ పరిశుభ్రత, నిత్యావసరాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. పలు రాష్ట్రాలు లాక్డౌన్ పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆటో, వినియోగ వస్తువుల రంగ కంపెనీలు తయారీ ప్లాంట్లకు తాత్కాలికంగా బ్రేకులు వేస్తున్నాయి. నిల్వలను క్లియర్ చేసుకున్నాక తిరిగి ఉత్పత్తిని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సంబంధిత నిపుణులు తెలియజేశారు. వరుసగా రెండో ఏడాదిలోనూ జూన్ క్వార్టర్లో అప్లయెన్సెస్ మార్కెట్‌ను మహమ్మారి దెబ్బతీస్తున్నట్లు గోద్రెజ్ అప్లయెన్సెస్ వైస్‌ప్రెసిడెంట్ కమల్ నంది పేర్కొన్నారు. 40 శాతం డౌన్ ... ఈ ఏప్రిల్‌లో అమ్మకాలు 40 శాతం పడిపోయినట్లు నంది వెల్లడించారు. 2020 ఏప్రిల్‌లో అయితే లాక్డౌన్ కారణంగా మొత్తం అమ్మకాలు తుడిచిపెట్టుకు పోయినట్లు గుర్తు చేశారు. ఇక మే నెలలో సైతం ఇదే స్థాయిలో సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలియజేశారు. నిజానికి వేసవి కారణంగా జూన్ త్రైమాసికం బిజినెస్‌లకు కీలకమని వినియోగ వస్తు కంపెనీల సమాఖ్య అధ్యక్షుడైన నంది తెలియజేశారు. అమ్మకాలలో 33 శాతం వరకూ క్యూ1లో నమోదవుతుంటాయని వివరించారు. హోటళ్లు బేర్ కోవిడ్–19 కట్టడికి గతేడాది విధించిన లాక్డౌన్ నేపథ్యంలో 30–35 శాతం హోటళ్లు శాశ్వతంగా మూతపడినట్లు దేశీ హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ వైస్‌ప్రెసిడెంట్ జీఎస్ కోహ్లి ప్రస్తావించారు. ప్రస్తుత లాక్డౌన్, ఆంక్షల ఫలితంగా మరో 30 శాతం కనుమరుగయ్యే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. కాగా.. కార్ల కొనుగోలు వంటి విచక్షణాధారిత వినియోగ రంగాలను సైతం వైరస్ దెబ్బతీస్తున్నట్లు మారుతీ సుజుకీ అమ్మకాలు, మార్కెటింగ్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. వివిధ పట్టణాలలో లాక్డౌన్ల కారణంగా అమ్మకాలు పడిపోతున్నట్లు తెలియజేశారు. ఇది మే నెల అమ్మకాలపై ప్రభావం చూపినట్లు చెప్పారు. అయితే ఏప్రిల్‌లో పలు కంపెనీల ప్యాసింజర్ వాహనాల విక్రయాలు పుంజుకున్నట్లు తెలియజేశారు. సుమారు 2,87,000 వాహనాలు అమ్ముడైనట్లు వెల్లడించారు. మే నెలలో తయారీ, సరఫరా వ్యవస్థలు నిలిచిపోవడం కూడా అమ్మకాలను దెబ్బతీయనున్నట్లు వివరించారు. దీనికితోడు ఇటీవల కొద్ది నెలలుగా ఆటో రంగం సెమీకండక్టర్ల కొరత సమస్యను ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇక ద్విచక్ర, త్రిచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో అమ్మకాలు ఏప్రిల్‌లో నీరసించగా.. మే నెల మొదట్లోనూ డిమాండ్ భారీగా క్షీణించినట్లు కంపెనీ ఈడీ రాకేష్ శర్మ తెలియజేశారు. -
కనిపించని తమ్ముళ్లు.. టీడీపీ డీలా!
చిత్తూరు అర్బన్: పంచాయతీ ఎన్నికల ఫలితాలతో బేజారైన తమ్ముళ్లు మున్ని‘పోల్స్’కు దూరంగా ఉన్నారు. 30 మందికి పైగా సిట్టింగ్ కార్పొరేటర్లు పోటీకి వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. మార్చి 2, 3 తేదీల్లో ఉపసంహరణ ప్రక్రియ పూర్తయితే అసలు పోటీలో ఎవరైనా ఉంటారా అనే ప్రశ్న టీడీపీ నేతలను వేధిస్తోంది సిట్టింగులు దూరం చిత్తూరు నగరపాలక సంస్థకు మొదటిసారిగా 2014లో ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లో 30కి పైగా స్థానాలను టీడీపీ గెలుచుకుంది. ఆ పార్టీ అభ్యర్థి కటారి అనురాధ చిత్తూరు తొలి మేయర్‌గా పీఠం అధిష్టించారు. అయితే ఆమెకు మేయర్ పదవి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. అనురాధ, ఆమె భర్త కటారి మోహన్‌ను వారి రక్తసంబం«దీకులే మట్టుపెట్టారు. అనంతరం నలుగురు మహిళా కార్పొరేటర్ల భర్తలు కార్పొరేషన్‌ను తమ చెప్పుచేతల్లోకి తీసుకున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. చిత్తూరు ప్రజలు ఏకపక్షంగా మద్దతుగా పలికి ఆరణి శ్రీనివాసులును ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఈక్రమంలో ప్రస్తుతం కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వచ్చాయి. అయితే నాడు కోట్లు కొల్లగొట్టినవారు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. బాధ్యత తీసుకుంటే దాచుకున్న మూటలను బయటకు తీయాల్సివస్తుందని ఇంటికే పరిమితమయ్యారు. టీడీపీలో ఆందోళన టీడీపీ తరఫున అభ్యర్థులు దొరకకపోవడంతో ఆ పార్టీ నేతలు అనామకులతో నామినేషన్లు వేయించారు. బతిమిలాడి.. డబ్బులిచ్చి బరిలో దించిన తమ్ముళ్లు ఇప్పుడు కనిపించకపోవడంతో చిత్తూరు టీడీపీలో ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు నగర పార్టీకి అధ్యక్షుడినే నియమించకపోవడంతో ఎవరికి వారు తమ కెందుకులే అని పక్కకు తప్పుకుంటున్నారు. ప్రస్తుత కీలక సమయంలో నూ కనీసం పార్టీ కార్యాలయానికి వచ్చేవారు కూడా కనిపించడంలేదు. దీంతో చిత్తూరు నగర టీడీపీలో నిస్తేజం ఆవరించింది. మరోవైపు వైఎస్సార్సీపీ మొత్తం 50 డివిజన్లుకు అభ్యర్థులను ప్రకటించేసింది. పోటీలో దిగిన అభ్యర్థులు ప్రచా రంలో దూసుకుపోతున్నారు. ఈ పరిణామాలను గమనించిన టీడీపీ జిల్లా నాయకులు కింకర్తవ్యం అంటూ మధనపడుతున్నారు. ఎవరికి వారు దూరంగా ఉండిపోతున్నారు. చదవండి: బాబు ఊకదంపుడు.. జారుకున్న జనం! చంద్రబాబు మేనిఫెస్టో.. ఓ 420 వ్యవహారం -
అదే కథ... అదే వ్యథ!
మరో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ముగిసింది. ఆశల పల్లకి మోస్తూ బరిలోకి దిగిన భారత బృందం రిక్తహస్తాలతో వెనుదిరిగి వచ్చింది. చిన్నాచితక దేశాలూ పతకాలు కొల్లగొడుతున్న వేళ భారత్ మాత్రం నిరాశపరుస్తోంది. కారణాలు ఏమైనా... మనోళ్లు ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్, గ్రాండ్‌ప్రి సిరీస్‌లలోనే మెరిపిస్తారని... అందరి దృష్టి కేంద్రీకృతమయ్యే విశ్వ వేదికలపై మాత్రం తడబడతారని మరోసారి తేటతెల్లం అయ్యింది. సాక్షి క్రీడా విభాగం పదహారేళ్ల క్రితం అంజూ బాబీ జార్జి మహిళల లాంగ్‌జంప్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత పలువురు భారత క్రీడాకారులు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్స్ వరకు వెళ్లినా పోడియంపై మాత్రం స్థానం సంపాదించలేకపోతున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు ముందు పాల్గొనే సన్నాహక టోర్నమెంట్లలో పతకాలు సాధించి ఆశలు రేకెత్తించి... తీరా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం చేతులెత్తుస్తున్నారు. ఒత్తిడికి తలవంచుతారో... పోటీతత్వానికి తట్టుకోలేకపోతారోగానీ కొందరు అగ్రశ్రేణి అథ్లెట్స్ సీజన్లో తమ అత్యుత్తమ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోతారు. మూడు ఈవెంట్స్‌లో ఫైనల్స్ చేరడం... రెండు ఒలింపిక్ బెర్త్‌లు దక్కించుకోవడం మినహా ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విశేషాలు లేవు. మహిళల జావెలిన్ త్రోలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అన్ను రాణి గుర్తింపు పొందడం... 4్ఠ400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత బృందం ఫైనల్‌కు చేరడంతోపాటు ఒలింపిక్ బెర్త్ సాధించడం... పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో అవినాశ్ సాబ్లే మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు తన పేరిటే ఉన్న జాతీయ రికార్డులను సవరించడం, టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం మనకు కాస్త ఊరటనిచ్చాయి. ఆసియా చాంపియన్‌షిప్‌లలో మెరిపించే భారత క్రీడాకారులు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టాప్–5లో కూడా ఉండటం లేదు. పురుషుల షాట్‌పుట్ విభాగంలో ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్ అయిన తజీందర్ పాల్ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు. మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ హీట్స్‌లోనే ఇంటిదారి పట్టింది. 4్ఠ400 మీటర్ల పురుషుల, మహిళల విభాగం రిలేల్లోనూ భారత బృందాలు నిరాశ పరిచాయి. అమెరికా అదుర్స్... మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్న అమెరికా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. 14 స్వర్ణాలు, 11 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 29 పతకాలను గెల్చుకుంది. ఇక ఈ మెగా ఈవెంట్లో నమోదైన మూడు ప్రపంచ రికార్డులు అమెరికా అథ్లెట్స్ సాధించడం విశేషం. మహిళల 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో దలీలా మొహమ్మద్ 52.16 సెకన్లలో గమ్యానికి చేరి 52.20 సెకన్లతో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. టైరెల్ రిచర్డ్, జెస్సికా బియర్డ్, జాస్మిన్ బ్లాకర్, ఒబి ఇగ్బోక్విలతో కూడిన అమెరికా మిక్స్డ్ రిలే బృందం 4్ఠ400 హీట్స్‌లో 3ని:12.42 సెకన్లతో ప్రపంచ రికార్డును సృష్టించగా... ఫైనల్లో పోటీపడిన అలీసన్ ఫెలిక్స్, విల్బెర్ట్, కొట్నీ ఒకోలో, మైకేల్ చెర్రీలతో కూడిన అమెరికా మిక్స్డ్ రిలే బృందం 3ని:09.34 సెకన్లతో హీట్స్‌లో తమ సహచర బృందం నెలకొల్పిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఆఫ్రికా ఆకట్టుకుంది.... అమెరికాకు ఎదురులేకున్నా... ఆఫ్రికా దేశాల అథ్లెట్స్ కూడా ఈసారీ తమ సత్తాను చాటుకున్నారు. పతకాల పట్టికలో టాప్–10లో మూడు ఆఫ్రికా దేశాలు ఉండటం విశేషం. కెన్యా 5 స్వర్ణాలు, 2 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 11 పతకాలతో రెండో స్థానం సాధించడం గమనార్హం. ఇథియోపియా 2 స్వర్ణాలు, 2 రజతాలు, ఒక కాంస్యంతో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఉగాండా రెండు స్వర్ణాలతో పదో స్థానంలో నిలిచింది. అమ్మలు అదరగొట్టారు... తల్లి హోదా వచ్చాక ఆటకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదని... పట్టుదలతో కృషి చేస్తే అద్భుతాలు చేయవచ్చని ఈ మెగా ఈవెంట్లో స్టార్ అథ్లెట్స్ నియా అలీ, షెల్లీ యాన్ ఫ్రేజర్, అలీసన్ ఫెలిక్స్ (అమెరికా) నిరూపించారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఇద్దరు పిల్లల తల్లి అయిన నియా అలీ (అమెరికా)... 100 మీటర్ల విభాగంలో జమైకా స్టార్ షెల్లీ యాన్ ఫ్రేజర్... 4్ఠ400 మీటర్ల మిక్స్డ్ రిలేలో అలీసన్ ఫెలిక్స్ స్వర్ణాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. మిక్స్డ్ రిలేలో స్వర్ణం సాధించిన క్రమంలో అలీసన్ ఫెలిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అత్యధికంగా 11 స్వర్ణాలతో ఉసేన్ బోల్ట్ (జమైకా) పేరిట ఉన్న రికార్డును 12వ పసిడి పతకంతో సవరించింది. నియా అలీ షెల్లీ ఫెలిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత ప్రదర్శన మహిళల విభాగం 100 మీటర్లు: ద్యుతీ చంద్ (11.48 సెకన్లతో తన హీట్స్‌లో ఏడో స్థానం. ఓవరాల్‌గా 47 మందిలో 37వ స్థానం). 200 మీటర్లు: అర్చన (23.65 సెకన్లతో తన హీట్స్‌లో ఎనిమిదో స్థానం. ఓవరాల్‌గా 43 మందిలో 40వ స్థానం) 400 మీటర్లు: అంజలి దేవి (52.33 సెకన్లతో తన హీట్స్‌లో ఆరో స్థానం. ఓవరాల్‌గా 47 మందిలో 37వ స్థానం). 1500 మీటర్లు: చిత్రా ఉన్నికృష్ణన్ (4ని:11.10 సెకన్లతో తన హీట్స్‌లో ఎనిమిదో స్థానం. ఓవరాల్‌గా 35 మందిలో 30వ స్థానం). జావెలిన్ త్రో: అన్ను రాణి (క్వాలిఫయింగ్‌లో 62.43 మీటర్లతో గ్రూప్ ‘ఎ’లో మూడో స్థానం. ఓవరాల్‌గా ఐదో స్థానం. 12 మంది పాల్గొన్న ఫైనల్లో 61.12 మీటర్లతో ఎనిమిదో స్థానం). 4x400 మీటర్ల రిలే: (జిస్నా మాథ్యూ, పూవమ్మ రాజు, విస్మయ, శుభాలతో కూడిన బృందం 3ని:29.42 సెకన్లతో హీట్స్‌లో ఆరో స్థానం) పురుషుల విభాగం 400 మీటర్ల హర్డిల్స్: జబీర్ మదారి (49.62 సెకన్లతో తన హీట్స్‌లో మూడో స్థానంలో నిలిచి సెమీఫైనల్ చేరాడు. అనంతరం మూడో సెమీఫైనల్లో 49.71 సెకన్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్ చేరలేకపోయాడు); ధరుణ్ అయ్యసామి (50.55 సెకన్లతో తన హీట్స్‌లో ఆరో స్థానం). 1500 మీటర్లు: జిన్సన్ జాన్సన్ (3ని:39.86 సెకన్లతో తన హీట్స్‌లో పదో స్థానం. ఓవరాల్‌గా 43 మందిలో 34వ స్థానం) 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్: అవినాశ్ సాబ్లే (హీట్స్‌లో 8ని:25.23 సెకన్లతో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్ చేరిక. 15 మంది పాల్గొన్న ఫైనల్లో 8ని:21.37 సెకన్లతో 13వ స్థానం) 4x400 మీటర్ల రిలే: (జాకబ్, అనస్, జీవన్, నోవా నిర్మల్‌లతో కూడిన భారత బృందం తమ హీట్స్‌లో 3ని:03.09 సెకన్లతో ఏడో స్థానం) 20 కిలోమీటర్ల నడక: ఇర్ఫాన్ (గంటా 35ని.12 సెకన్లతో 27వ స్థానం); దేవేందర్ సింగ్ (గంటా 41ని.48 సెకన్లతో 36వ స్థానం). మారథాన్: గోపీ (2గం:15ని.57 సెకన్లతో 21వ స్థానం) లాంగ్‌జంప్: శ్రీశంకర్ (14 మంది పోటీపడిన క్వాలిఫయింగ్ గ్రూప్ ‘బి’లో 7.62 మీటర్లతో 12వ స్థానం). జావెలిన్ త్రో: శివపాల్ సింగ్ (16 మంది పోటీపడిన క్వాలిఫయింగ్ గ్రూప్ ‘ఎ’లో 78.97 మీటర్లతో పదో స్థానం. ఓవరాల్‌గా 30 మందిలో 24వ స్థానం) షాట్‌పుట్: తజీందర్ సింగ్ (18 మంది పోటీపడిన క్వాలిఫయింగ్ గ్రూప్ ‘బి’లో 20.43 మీటర్లతో ఎనిమిదో స్థానం) 4x400 మిక్స్డ్ రిలే: (అనస్, నోవా, జిస్నా, విస్మయలతో కూడిన భారత బృందం హీట్స్‌లో 3ని:16.14 సెకన్లతో మూడో స్థానం. ఎనిమిది జట్లు పాల్గొన్న ఫైనల్లో 3ని:15.77 సెకన్లతో ఏడో స్థానం) కనీసం ఒక పతకమైనా సాధించిన దేశాల సంఖ్య:43 ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కనీసం ఒక స్వర్ణమైనా సాధించిన దేశాల సంఖ్య:20 పురుషుల 4x400 మీటర్ల హీట్స్‌లో భారత అథ్లెట్స్ -
తగిన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం వల్లే..
పట్నా/మీర్జాపూర్: ఏదో నామమాత్రంగా జేడీ(యూ)కి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామనడంతోనే తాము కేంద్రంలో చేరకూడదని నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు, బిహార్ సీఎం నితీశ్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. మంత్రివర్గంలో జేడీ(యూ)ను కూడా చేరేలా నితీశ్‌ను ఒప్పించేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పలుసార్లు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే తగినన్ని మంత్రిపదవులు ఇవ్వకపోతుండడంతో నితీశ్ అందుకు విముఖత వ్యక్తం చేశారు. జేడీ(యూ)కు ఒక మంత్రి పదవి ఇస్తామని అమిత్ షా చెప్పగా, తమ పార్టీకి తగినంత ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందేనని నితీశ్ పట్టుబట్టినట్లు సమాచారం. లేదంటే ఆ ఒక్క పదవి కూడా వద్దని తేల్చిచెప్పారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీ నుంచి నితీశ్ శుక్రవారం పట్నా తిరిగొచ్చారు. అనంతరం నితీశ్ మాట్లాడుతూ ఎన్డీయేతో లేదా బీజేపీతో తమకు విభేదాలేమీ లేవనీ, తాము మోదీ ప్రభుత్వానికి మద్దతిస్తామని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ ‘మేం మోదీ ప్రభుత్వంతోనే ఉన్నాం. తప్పనిసరిగా ప్రభుత్వంలో కూడా ఉండాల్సిన అవసరం లేదు కదా. పార్టీలో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని చెప్పారు. ఒక కేబినెట్ మంత్రి, ఒక సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), మరో సహాయమంత్రి పదవులను జేడీయూ డిమాండ్ చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అప్నాదళ్‌దీ అదే దారి.. మంత్రిపదవి విషయంలో అసంతృప్తి కారణంగానే ఉత్తరప్రదేశ్‌లోని అప్నాదళ్ (ఎస్) పార్టీ కూడా కేంద్ర మంత్రివర్గంలో చేరలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ పార్టీ నాయకురాలు అనుప్రియా పటేల్ గత ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు. ఈసారి ఆమె కేబినెట్ హోదా పదవి ఆశించారనీ, అయితే సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) కూడా దక్కకపోతుండటంతో ఈసారి మంత్రిపదవిని అనుప్రియ వద్దనుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. -
అసమ్మతిపై టీఆర్ఎస్ కన్నెర్ర
సాక్షి, హైదరాబాద్: అసమ్మతి రాగం వినిపిస్తున్న పార్టీ నేతలపై టీఆర్ఎస్ కన్నెర్రజేస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా, పోటీగా కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఉమ్మడి నల్లగొండలో గురువారం బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఆ జిల్లాలోని మునుగోడు అసమ్మతి నేత వేనేపల్లి వెంకటేశ్వరరావుపై వేటు వేసింది. వెంకటేశ్వరరావును టీఆర్ఎస్ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటన జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన కారణంగా వేనేపల్లి వెంకటేశ్వరరావును బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నామని ప్రకటనలో తెలిపారు. వెంకటేశ్వరరావుపై బహిష్కరణ నిర్ణయం టీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది. ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సాగుతున్న టీఆర్ఎస్కు కొన్ని సెగ్మెంట్లలో అసమ్మతి నేతల తీరు ఇబ్బందిగా మారింది. టీఆర్ఎస్ అధిష్టానం తరఫున మంత్రి కేటీఆర్ అసమ్మతి నేతలతో భేటీ అవుతున్నారు. అయితే పార్టీ అభ్యర్థులకు పోటీగా ప్రచారం చేస్తున్న కొందరు నేతలు కేటీఆర్‌తో చర్చలకు సైతం రావడంలేదు. దీంతో వీరిపై కఠినంగా వ్యవహరించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. నల్లగొండలో సభ నేపథ్యంలోనే మునుగోడు అసమ్మతి నేత వెంకటేశ్వరరావును బహిష్కరించారు. మరికొందరు నేతల విషయంలోనూ టీఆర్ఎస్ ఇదే రకమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. చివరి అవకాశంగా ఓసారి చర్చలకు ఆహ్వానించాలని, అయినా దారికి రాకుంటే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అభ్యర్థులకు అడ్డంకులు.. కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు సొంత పార్టీ వారితోనే ఇబ్బందులు వస్తున్నాయి. కొందరు అసమ్మతి నేతలు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనను పొగుడుతూ.. సీఎం కేసీఆర్ చిత్రపటాలు, గులాబీ రంగు జెండాలు వినియోగిస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. నామినేషన్ల సమయం వరకు తమకే టికెట్లు వస్తాయని చెబుతున్నారు. దీంతో ప్రత్యర్థి పార్టీల నేతలతో కంటే వీరితోనే టీఆర్ఎస్ అభ్యర్థులకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. కేడర్‌లోనూ అయోమయం నెలకొంటోంది. పార్టీ అధిష్టానం నుంచి స్పష్టత రాక ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొనడం లేదు. ఇలా సొంత పార్టీ నేతలతో ఇబ్బంది పడే అభ్యర్థులు కేటీఆర్‌కు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కేటీఆర్ పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దాదాపు 10 నియోజకవర్గాల నేతలు చర్చలకు సైతం రావడంలేదు. కొన్ని నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీరి విషయంలోనూ పార్టీ కఠిన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. టీఆర్ఎస్ అభ్యర్థులకు పోటీగా తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్న కోరుకంటి చందర్ (రామగుండం), గండ్ర సత్యనారాయణరావు (భూపాలపల్లి), రాజారపు ప్రతాప్ (స్టేషన్‌ఘన్‌పూర్), చకిలం అనిల్‌కుమార్ (నల్లగొండ) విషయంలోనూ టీఆర్ఎస్ రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. వేములవాడ, రామగుండం, జగిత్యాల, స్టేషన్‌ఘన్‌పూర్, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, సత్తుపల్లి, మక్తల్, మునుగోడు నియోజకవర్గాల్లోని పలువురు ద్వితీయ శ్రేణి నేతలపైనా వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసింది. రెండు సభలు వాయిదా.. ముందస్తు ఎన్నికల వ్యూహంలో ముందున్న టీఆర్ఎస్.. ప్రచారంలో మాత్రం ఆ ఊపు కొనసాగించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ రద్దయిన మరుసటి రోజు సీఎం కేసీఆర్ హుస్నాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 50 రోజుల్లో వంద నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు ప్రకటించా రు. ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు సమయం ఉండటంతో ప్రచార వ్యూహాన్ని మార్చారు. ఉమ్మడి జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అక్టోబర్ 3న నిజామాబాద్, 4న నల్లగొండ, 5న మహబూబ్‌నగర్, 7న వరంగల్, 8న ఖమ్మంల్లో సభలు నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటన జారీ చేసింది. అయితే ఆయా జిల్లాల్లో నెలకొన్న అసంతృప్తుల దృష్ట్యా వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల బహిరంగ సభలను వాయిదా వేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో స్టేషన్‌ఘన్‌పూర్, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో అసమ్మతి ఎక్కువగా ఉంది. బహిరంగ సభ నిర్వహించే వరంగల్ నగరంలోని వరంగల్ తూర్పు నియోజకవర్గానికి అభ్యర్థిని ఖరారు చేయలేదు. దీంతో ఇక్కడ సభ వాయిదా వేశారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని సత్తుపల్లి, వైరా, ఖమ్మం నియోజకవర్గాల్లోనూ అసమ్మతి పూర్తిగా తొలిగిపోలేదు. దీంతో ఖమ్మంలో తలపెట్టిన బహిరంగ సభనూ వాయిదా వేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ నేతలు మంగళవారం మంత్రి కేటీఆర్‌ను కలసి బహిరంగ సభ విషయాన్ని ప్రస్తావించగా.. వరంగల్ బహిరంగ సభ ఉందని ఎవరు చెప్పారని కేటీఆర్ వారిని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ రెండు బహిరంగ సభల నిర్వహణ తేదీలను త్వరలోనే ఖరారు చేయనున్నారు. ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించే బహిరంగ సభల విషయంలోనూ నిర్ణయం తీసుకోనున్నారు. హుస్నాబాద్‌లో సభ నిర్వహించినందున ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సభ ఉండకపోవచ్చని తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రగతి నివేదన సభ నిర్వహించిన కారణంగా రంగారెడ్డి, హైదరాబాద్‌ల్లోనూ బహిరంగ సభలు నిర్వహించే అవకాశం లేదు. ఉమ్మడి జిల్లాల బహిరంగ సభల అనంతరం సీఎం కేసీఆర్ నేరుగా నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నారు. దసరా తర్వాత నియోజకవర్గాల వారీగా ప్రచార కార్యక్రమం మొదలుకానుంది. -
ఫ్లాట్‌లో నివాసం.. కార్ల వేలం!
పైసా పైసా పొదుపు, అదే భవితకు మలుపు అంటున్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆయన తీసుకుంటున్న పొదుపు చర్యలు చాలా మందిని విస్మయానికి గురి చేస్తున్నాయి. ప్రభుత్వంలో కొందరు ఇదెక్కడి పొదుపంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, మరికొందరు దుబారాకు కళ్లెం పడాల్సిందేనని ఇమ్రాన్‌కు మద్దతు పలుకుతున్నారు. అధికారిక నివాసం కాదని అపార్ట్మెంట్లోకి ఇమ్రాన్ పొదుపు చర్యల్ని మొదట తనతోనే మొదలు పెట్టారు. 134 ఎకరాల్లో విస్తరించిన రాజప్రాసాదం, 524 మంది సిబ్బంది ఉన్న ప్రధాని అధికారిక నివాసాన్ని కాదని 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. కేవలం ఇద్దరు సేవకుల్ని మాత్రమే పనిలో ఉంచారు. ప్రధాని నివాసాన్ని యూనివర్సిటీగా మారుస్తానని ప్రకటించారు. ఉన్నతాధికారులు విమానాల్లో ఫస్టక్లాస్ ప్రయాణాలు చేయకుండా నిషేధం విధించారు. అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైనా సరే ఫస్ట్‌క్లాస్ బదులుగా ఇక బిజినెస్ క్లాసులోనే ప్రయాణించాల్సి ఉంటుంది. మూడోసారి ప్ర«ధానిగా ఉన్న సమయంలో నవాజ్ షరీఫ్ 64 సార్లు విదేశీ ప్రయాణాలు చేశారు. వెళ్లినప్పుడల్లా 631 మంది సిబ్బంది ఆయన వెంట ఉండేవారు. ఇందుకోసం రూ. 65 కోట్లు ఖర్చు చేశారు. అందువల్ల అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు చేయకూడదని ఇమ్రాన్ నిర్ణయం తీసుకున్నారు. విదేశాంగ మంత్రి తప్ప మరెవరూ ఇతర దేశాలకు వెళ్లాల్సిన పని లేదని తేల్చేశారు. ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశాల సమయంలో గత ప్రభుత్వాలు రకరకాల నోరూరించే వంటకాలతో లంచ్ ఏర్పాటు చేసేవి. ఇమ్రాన్ వాటన్నింటినీ తగ్గించేశారు. ఇప్పుడు సమావేశాల సమయంలో కనీసం బిస్కెట్లు కూడా ఇవ్వడం లేదని ఒక అధికారి వాపోయారు. ప్రధాని లగ్జరీ కార్ల వేలం ప్రధాని నివాసంలో అంతగా వినియోగంలో లేని 33 లగ్జరీ కార్లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రధాని నివాసంలో సెప్టెంబర్ 17న ఈ వేలం జరుగుతుంది. ఎనిమిది బీఎండబ్ల్యూ కార్లు, నాలుగు బెంజ్ కార్లు, 16 టయోటా కార్లతో పాటుగా నాలుగు బుల్లెట్ ప్రూప్ వాహనాలు, ఒక హోండా సివిక్ కారు, మూడు సుజుకి వాహనాలతో పాటుగా 1994 మోడల్‌కు చెందిన హినో బస్సును కూడా వేలం వేస్తారు. హెలికాప్టర్ ప్రయాణం వివాదాస్పదం ఇమ్రాన్ తన నివాసం నుంచి సెక్రటేరియెట్‌కి ప్రతీరోజూ హెలికాప్టర్లో వెళ్లి రావడం వివాదాన్ని రేపింది. అందరికీ సుద్దులు చెబుతున్న ఇమ్రాన్ హెలికాప్టర్లో వెళ్లడమేంటని విపక్షాలు ఎదురుదాడికి దిగాయి. హెలికాప్టర్లో వెళ్లితే కి.మీ.కు రూ. 50–55 రూపాయలకు మించి అవదని పాక్ సమాచార మంత్రి ఫవాద్ వ్యాఖ్యలు వివాదమయ్యాయి. ఇమ్రాన్ ప్రయాణిస్తున్న అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ ఖర్చు కి.మీ.కు దాదాపు రూ.1600 అవుతుందని కొందరు తేల్చారు. దీంతో ప్రభుత్వం మాట మార్చి సామాన్య జనాలకు ఇబ్బందులు కలగకుండా, కాన్వాయ్ ఖర్చు లేకుండా చూసేందుకే ఇమ్రాన్ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నారని సమర్థించుకుంది. -
ఆర్టీఐ కమిషనర్లను నియమించరా?
సాక్షి, న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం పరిధిలోని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ), రాష్ట్రాల సమాచార కమిషన్ల(ఎస్ఐసీ)లో ఖాళీల్ని భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేశారు. వేలాది అప్పీళ్లు, ఫిర్యాదుల పరిష్కారంపై ఈ జాప్యం ప్రభావం చూపుతుందని, ఖాళీల్ని ఎందుకు భర్తీ చేయలేదో జవాబు చెప్పాలని కేంద్రంతో పాటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు నోటీసులు జారీచేసింది. సమాచార హక్కు కమిషనర్లను భర్తీ చేయకపోవడంతో వేలాది అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేస్తూ ముగ్గురు పిటిషనర్లు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం సోమవారం విచారించింది. వెంటనే చర్యలు చేపట్టాలి: సుప్రీం ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఖాళీల్ని భర్తీ చేయకపోతే ఈ రాజ్యాంగ సంస్థల నిర్వహణ కష్ట సాధ్యంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఈ విభాగాల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర చట్టబద్ధ సంస్థల్లోను ఇది అలవాటుగా మారిపోయింది. వందల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడానికి వీల్లేదు. మీరు ఏదొకటి చేయాలి’ అని అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్‌కు సుప్రీం స్పష్టం చేసింది. సీఐసీలో 23,500కు పైగా అప్పీళ్లు, ఫిర్యాదుల పెండింగ్ ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్, మాజీ నేవీ అధికారి లోకేశ్ బాత్రా, అమ్రితా జోహ్రిల తరఫున న్యాయవాది కామిని జైస్వాల్ వాదిస్తూ.. ప్రస్తుతం సీఐసీలో 4 ఖాళీలున్నాయని, 23,500కు పైగా అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ‘వేలాది అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నా బ్యాక్‌ల్యాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, బెంగాల్, కేరళ, కర్ణాటక, ఒడిషా తదితర రాష్ట్రాల్లో సమాచార హక్కు కమిషన్లలో బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా ఆర్టీఐ చట్టాన్ని కాలరాస్తున్నారు. కేంద్ర సమాచార కమిషన్ వద్ద వేల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2016లో వచ్చిన అప్పీళ్లూ పెండింగ్‌లో ఉన్నాయి’ అని జైస్వాల్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషన్‌లో ఒక్క కమిషనర్‌ను కూడా భర్తీ చేయలేదని, ఆ రాష్ట్ర ఎస్ఐసీ ప్రస్తుతం ఎలాంటి విధులూ నిర్వర్తించడం లేదని కోర్టుకు తెలిపారు. మహారాష్ట్ర కమిషన్‌లో నాలుగు ఖాళీలు ఉన్నాయని, అక్కడ 40 వేల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, కర్ణాటకలో ఆరు పోస్టుల ఖాళీగా ఉండగా.. 33 వేల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.కేరళలో ఒకే ఒక్క కమిషనర్ విధుల్లో ఉన్నారని, అక్కడ 14 వేల అప్పీళ్లను పరిష్కరించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఇన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నా ఎందుకు జాప్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కేరళ, ఒడిశా, కర్ణాటక, ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. -
కావేరి బోర్డు ఏర్పాటులో జాప్యంపై అసంతృప్తి
న్యూఢిల్లీ: కావేరి నదీ జలాల యాజమాన్య బోర్డు ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డు ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న చర్యలు వివరిస్తూ మే 8 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కావేరి బోర్డును నియమించే బాధ్యత కేంద్రానిదేనని, ఇందులో రాష్ట్రాల పాత్ర ఏమీ ఉండదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు సూచించింది. తమ ఆదేశాల మేరకు కావేరి జలాశయాల నుంచి తమిళనాడుకు 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేని పక్షంలో కోర్టు ధిక్కార కేసుగా భావించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరు కోరుతామని హెచ్చరించింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారని, విచారణను పోలింగ్ ముగిసే దాకా వాయిదా వేయాలని వేణుగోపాల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం పక్షపాత ధోరణితో సమాఖ్య విధానానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని తమిళనాడు ఆరోపించింది. -
యడ్యూరప్పకు నిరాశ
బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్పకు తీవ్ర నిరాశే ఎదురైంది. కుమారుడు విజయేంద్రతోపాటు, సన్నిహితురాలు శోభా కరాంద్లజే (యశ్వంత్‌పూర్ కోసం) లకు సోమవారం విడుదల చేసిన నాలుగో జాబితాలోనూ చోటు దక్కలేదు. మైసూరు జిల్లా వరుణ నియోజకవర్గం నుంచి తన కొడుకు విజయేంద్ర పోటీ చేయడంలేదని నంజనగుడులో ఏర్పాటుచేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో యడ్యూరప్ప చెప్పారు. దీంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికతోపాటు.. అక్కడున్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అటు, రెండ్రోజుల క్రితం బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి రేవణ్ణ సిద్దయ్య (లింగాయత్ వర్గం బలమైన నాయకుడు)కు వరుణ నుంచి బీ–ఫామ్ ఇచ్చే అవకాశముంది. రేవణ్ణకు ఆరెస్సెస్‌నుంచి బలమైన మద్దతుంది. వరుణ, యశ్వంత్‌పూర్ సహా మరో రెండు నియోజకవర్గాలకు మంగళవారం అభ్యర్థులను ప్రటించే అవకాశం ఉంది. బళ్లారిలో రెడ్డి సోదరులపైనే ఆధారం తూర్పు కర్ణాటక ప్రాంతంలో గాలి జనార్దనరెడ్డి సోదరులపైనే బీజేపీ నమ్మకం పెట్టుకుంది. అందుకే శ్రీరాములు, రెడ్డి సోదరుల కుటుంబసభ్యులు, అనుచరులకు ఏడు టికెట్లు ఇచ్చింది. గాలి మేనల్లుడు, రియల్టర్ లల్లేశ్ రెడ్డిని కన్నడ హోం మంత్రి ఆర్ రామలింగారెడ్డిపై (బీటీఎం లేఔట్ నుంచి) పోటీకి దించనుంది. ఈ ప్రాంతంలోని రెడ్డి ఓట్లను బీజేపీ వైపుకు తీసుకురావటంలో గాలి పాత్ర కీలకం కానుంది. బీజేపీ దీనిపైనే విశ్వాసం ఉంచింది. -
హీట్స్‌లోనే సిద్ధాంత్ నిష్క్రమణ
బర్మింగ్హమ్: ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ సిద్ధాంత్ తింగాలయకు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్లో పురుషుల 60 మీటర్ల హర్డిల్స్‌లో పోటీ పడ్డ సిద్ధాంత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. మూడో హీట్‌లో బరిలోకి దిగిన 27 ఏళ్ల సిద్ధాంత్ 7.93 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మొత్తం నాలుగు హీట్స్ నుంచి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు సెమీఫైనల్‌కు అర్హత పొందుతారు. అమెరికాలో శిక్షణ పొందే సిద్ధాంత్ ఎనిమిది మంది పాల్గొన్న తన హీట్స్‌లో ఆరో స్థానంలో నిలిచి ఆ అవకాశాన్ని కోల్పోయాడు. -
చివరి రోజు నిరాశే
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ చివరి రోజు భారత రెజ్లర్లకు నిరాశే మిగిలింది. ఆదివారం పతకం కోసం పోటీ పడ్డ ఇద్దరు రెజ్లర్లు ఓటమి పాలవడంతో భారత్ ఖాతాలో మరో పతకం చేరలేదు. ఈ టోర్నీని భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలతో ముగించింది. చివరి రోజు పతకం కోసం పోటీ పడ్డ శ్రవణ్ తోమర్, దీపక్ పూనియా నిరాశపరిచారు. 61 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత రెజ్లర్ శ్రవణ్ 0–10తో కజుయ కోయాంగి (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. తన ప్రత్యర్థి ఫైనల్ చేరడంతో మరో అవకాశం దక్కించుకున్న శ్రవణ్ కాంస్యం కోసం జరిగిన పోరులో అబ్బాస్ రఖ్‌మోనొవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడాడు. దీపక్ పునియా (86 కేజీలు) క్వార్టర్స్‌లో 0–7తో ఉతుమెన్ ఉర్గోడొల్ (మంగోలియా) చేతిలో ఓడినా రెప్‌చేజ్ రౌండ్లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అక్కడ 7–2తో శోతె షిరాయి (జపాన్)పై గెలుపొంది కాంస్య పోరుకు అర్హత సాధించాడు. పతక పోరులో 0–10తో షెంగ్‌ఫెంగ్ బి (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
ధోని కథ వేరు మాది వేరు
-
దృష్టికోణాన్ని మార్చుకోవాలి
ఆత్మీయం మన జీవన విధానంలో ఇబ్బందులు లేకుండా ఏ మనిషీ జీవితాన్ని సాగించలేడు. బాధాకరమైన పరిస్థితులలో చిక్కుకుపోయినప్పుడు నిరాశ పడుతూ, దురదృష్టాన్ని నిందించుకుంటూ కూర్చోకూడదు. దాని బదులు ఆ కష్టాన్ని లేదా ఇబ్బందిని చూసే దృష్టికోణాన్ని మార్చుకోవాలి. అందుకు కారణం ఏమిటో విశ్లేషించుకోవాలి. ఏమి చేస్తే ఆ కష్టం తొలగిపోతుందో ఆలోచించాలి. మంచి ఆలోచనలను మనసులో నింపుకోవాలి. అంటే కష్టాన్ని కష్టంగా భావించకుండా, దానిని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టుకుంటే ఆ సమస్య కాస్తా చిన్నదిగా మారిపోతుంది. దాన్ని స్వరూపం మారిపోతుంది. జీవితాన్ని బాధాకరంగా మార్చిన పరిస్థితులు తగ్గుముఖం పట్టడం ఆరంభం అవుతుంది. చీకటిని చూసి తిట్టుకుంటూ కూర్చోకుండా చిరుదివ్వె వెలిగించే ప్రయత్నం చేయాలి.