
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆటో విడిభాగాల కంపెనీ మదర్‌సన్ సుమీ వైరింగ్ ఇండియా ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై-సెప్టెంబర్ (క్యూ2)లో నికర లాభం స్వల్పంగా 2 శాతం పుంజుకుని రూ. 116 కోట్లను అధిగమించింది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 114 కోట్లు ఆర్జించింది.
మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,400 కోట్ల నుంచి రూ. 1,835 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 1,230 కోట్ల నుంచి రూ. 1,690 కోట్లకు పెరిగాయి. దేశీ ఆటోమోటివ్ పరిశ్రమ తిరిగి జోరందుకున్నట్లు కంపెనీ చైర్మన్ వివేక్ చాంద్ సెహగల్ పేర్కొన్నారు. దీంతో తమ కస్టమర్లు ఉత్పత్తిని పెంచుతున్నట్లు తెలియజేశారు. ఇది వ్యయాలను (వన్‌టైమ్) పెంచినప్పటికీ రానున్న త్రైమాసికాలలో సర్దుబాటు కాగలవని తెలిపారు.అయితే ఈ ఫలితాలు నేపథ్యంలో సోమవారం 6 శాతం నష్టాలనుంచి కోలుకుని మంగళవారం 2 శాతం లాభాలతో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment