దృష్టికోణాన్ని మార్చుకోవాలి
ఆత్మీయం
మన జీవన విధానంలో ఇబ్బందులు లేకుండా ఏ మనిషీ జీవితాన్ని సాగించలేడు. బాధాకరమైన పరిస్థితులలో చిక్కుకుపోయినప్పుడు నిరాశ పడుతూ, దురదృష్టాన్ని నిందించుకుంటూ కూర్చోకూడదు. దాని బదులు ఆ కష్టాన్ని లేదా ఇబ్బందిని చూసే దృష్టికోణాన్ని మార్చుకోవాలి. అందుకు కారణం ఏమిటో విశ్లేషించుకోవాలి.
ఏమి చేస్తే ఆ కష్టం తొలగిపోతుందో ఆలోచించాలి. మంచి ఆలోచనలను మనసులో నింపుకోవాలి. అంటే కష్టాన్ని కష్టంగా భావించకుండా, దానిని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టుకుంటే ఆ సమస్య కాస్తా చిన్నదిగా మారిపోతుంది. దాన్ని స్వరూపం మారిపోతుంది. జీవితాన్ని బాధాకరంగా మార్చిన పరిస్థితులు తగ్గుముఖం పట్టడం ఆరంభం అవుతుంది. చీకటిని చూసి తిట్టుకుంటూ కూర్చోకుండా చిరుదివ్వె వెలిగించే ప్రయత్నం చేయాలి.