మాస్కో: ఈ మధ్యకాలంలో విచిత్రాతి విచిత్రంగా జంతువులకు, మనుష్యులకు రకరకాలుగా పిల్లలు పుట్టడం చూసే ఉంటాం. హార్మోనుల తేడాలతో రకరకాలుగా అవకారాలతోనో లేక మరో విధంగానో వింత వింత జననాలను చూసి ఉంటాం. కానీ ఇలా మరో జంతు రూపుతో విచిత్రంగా జన్మించటం అత్యంత అరుదుగా జరుగుతుంది. అచ్చం అలాంటి ఘటన రష్యాలో చోటు చేసుకుంది.
(చదవండి: సంవత్సరాల తేడాతో ఒకే నెల ఒకే తేదిలో జన్మించినన ముగ్గురు అక్కాచెల్లెళ్లు)
వివరాల్లోకెళ్లితే...రష్యాలోని ఖాకాసియాలోని మట్కెచిక్ గ్రామంలో ఒక ఆవుకి పందులను పోలిన రూపంతో రెండు తలల దూడ జన్మించింది. అయితే ఈ నవజాత దూడ పుట్టిన వెంటనే చనిపోయింది. అంతేకాదు పాపం దాని తల్లి కూడా కొద్ది రోజులకే చనిపోయింది. జన్యుపరమైన అసాధారణతల వల్ల ఈ విధంగా జరిగే అవగాశం ఉందిన రష్యా వెటర్నరీ మెడిసిన్ విభాగం పేర్కొంది.
ఈ మేరకు వారసత్వంగా వచ్చే జన్యువుల్లోని మార్పుల వల్ల కానీ లేదా క్రాస్ బ్రీడింగ్ సమయంలోనూ ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుందని వెల్లడించింది. అదేవిధంగా రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లా పురా సిక్రౌడా గ్రామంలో ఓ గేదె రెండు తలల దూడకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పైగా ఆ గేదె ఎవరి సాయం లేకుండా జన్మినివ్వడమే కాకా ఆ దూడ కూడా ఆరోగ్యంగానే ఉంది. ఏది ఏమైన ఇలాంటి అరుదైన ఘటనల్లో పుట్టినవి ఆరోగ్యంగా ఉండటమే విశేషం. చాలామటుకు అవి చనిపోయే అవకాశాలే ఎక్కువ.
(చదవండి: పని ఒత్తిడితో చిర్రెత్తి ఉన్నారా!.....అయితే ఈ వీడియో చూడండి చాలు
Comments
Please login to add a commentAdd a comment