
టాలీవుడ బిగ్ హిట్ 'అర్జున్ రెడ్డి' మొదటి సినిమాతోనే దర్శకుడిగా సత్తా చాటాడు సందీప్ రెడ్డి వంగా. ఆ చిత్రంతోనే విజయ్ దేవరకొండ సన్సేషన్ స్టార్‌గా మారిపోయాడు. ఇదే సినిమా హిందీలో 'కబీర్ సింగ్'గా రీమేక్ చేసి బాలీవుడ్‌లో తన మార్క్ ఎంటో చూపించాడు సందీప్. తాజాగా తన నుంచి వస్తున్న 'యానిమల్' ప్రీ టీజర్‌ను విడుదుల చేశాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక నటిస్తున్నారు. ఈ కాంబినేషన్‌తోనే భారీ అంచనాలు పెంచేశాడు.
(ఇదీ చదవండి: సీతగా నన్నే ఎందుకు ఎంపిక చేశారంటే: కృతి సనన్)
ఇక ప్రీ టీజర్ విషయానికొస్తే.. హిందీ సాంగ్‌తో మొదలవుతుంది. విలన్స్ గుంపులు గుంపులుగా ఒకపక్క వస్తుంటే.. ఇంకోపక్క రణబీర్ వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో కనిపిస్తూ.. చేతిలో గొడ్డలి పట్టుకొని ఒక్కోక్కరిని నరకడం చూపించాడు సందీప్. ప్రీ టీజరే ఇంత భయంకరంగా ఉంటే 11న వచ్చే టీజర్ ఏ రేంజ్‌లో ఉంటుందో అని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. ఇదీ మామూలు అరాచకం కాదు భయ్యో అంటూ... ఈ సినిమాతో సందీప్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడోనని కామెంట్స్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: టాప్ హీరోయిన్ కూతురి అన్నప్రాసన వేడుక చూశారా?)
Comments
Please login to add a commentAdd a comment