రణ్‌బీర్‌- రష్మిక ఫ్లైట్ సీన్.. ఆ మూవీ నుంచి కొట్టేశారా? | Plane Scene In Ranbir Kapoor's Animal Copied From Fifty Shades Of Grey | Sakshi
Sakshi News home page

Animal: యానిమల్ సాంగ్ సీన్.. అచ్చం ఆ మూవీలానే ఉంది!

Published Wed, Oct 18 2023 3:35 PM | Last Updated on Wed, Oct 18 2023 4:26 PM

Plane Scene In Ranbir Kapoor Animal Copied From Fifty Shades Of Grey - Sakshi

రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీని రూపొందించగా.. త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.  ఇటీవలే ఈ చిత్రం నుంచి ఓ రొమాంటిక్‌ సాంగ్‌ రిలీజ్ చేశారు మేకర్స్.  తెలుగులో ‘అమ్మాయి’ అనే టైటిల్‌తో  ఈ పాటను విడుదల చేశారు. అయితే ప్రైవేట్ జెట్‌లో రష్మిక, రణ్‌బీర్ కపూర్‌ మధ్య లిప్‌ లాక్ సీన్స్ ఆడియన్స్‌కు అర్జున్‌ రెడ్డి సినిమాను గుర్తుకు తెచ్చాయి. తాజాగా ఈ ఫ్లైట్‌లో రొమాంటిక్ సీన్స్‌పై నెట్టింట చర్చ మొదలైంది. 

(ఇది చదవండి: 'మన దగ్గర పైసలెక్కడివిరా సేవ్ చేయడానికి'.. ఆసక్తిగా ట్రైలర్)

అయితే ఈ ఫ‍్లైట్‌ సీన్‌ కాపీ కొట్టారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జామీ డోర్నాన్,  డకోటా జాన్సన్ నటించిన 2015లో వచ్చిన హాలీవుడ్ చిత్రం ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రేలోని హెలికాప్టర్ సన్నివేశంలా ఉందని అంటున్నారు.  ఓ నెటిజన్ రాస్తూ.. బాలీవుడ్ ప్రస్తుతం కాపీకి బ్రాండ్‌గా మారిందని పోస్ట్ చేశారు. మరొకరు ఫిఫ్టీ షేడ్స్ కాపీ క్యాట్ అంటూ రాసుకొచ్చారు. 

ఇప్పటికే టీజర్‌ రిలీజ్ కాగా.. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, జానీ సంగీతం అందిస్తున్నారు.   బాబీ డియోల్ ప్రధాన ప్రతినాయకుడిగా కూడా నటించారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అనే ఐదు భాషల్లో ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలోకి రానుంది.

(ఇది చదవండి: లియో మూవీ రిలీజ్ వివాదం.. కొనసాగుతున్న సస్పెన్స్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement