'సిగ్గుండాలి కొంచెమైనా.. చేసింది చాలు.. బయటికి గెంటెయ్' | Rashmika kisses Ranbir in front of family in Animal song | Sakshi
Sakshi News home page

Animal Song: 'ఫ్యామిలీ ముందే ముద్దు సీన్'.. ఆ కెమిస్ట్రీ ఏంట్రా బాబు!

Published Wed, Oct 11 2023 1:31 PM | Last Updated on Wed, Oct 11 2023 1:49 PM

Ranbeer and Rashmika kisses Ranbir in front of family In Animal Song - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌కపూర్‌, నేషనల్ క్రష్  రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం 'యానిమల్‌'. ఇప్పటికే కబీర్‌ సింగ్‌ను బాలీవుడ్‌కు హిట్‌ ఇచ్చిన తెలుగు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ‘యానిమల్‌’ విడుదలకు రెడీగా ఉంది. ఇందులో అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ప్రి టీజర్‌ని మేకర్స్‌ ఇప్పటికే విడుదల చేయగా అందుకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్ చేశారు. తెలుగులో ‘అమ్మాయి’ అనే పేరుతో సాంగ్‌ను విడుదల చేశారు.

అయితే ఈ సాంగ్‌లో రణ్‌బీర్‌ కపూర్, రష్మిక మందన్నా కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో ఉంది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ముద్దు సీన్స్ మరింత రొమాంటిక్‌గా ఉన్నాయి. అయితే ఈ సాంగ్‌ ప్రారంభంలో ఫ్యామిలీ అందరిముందే ఈ జంట ముద్దు పెట్టుకోవడం హైలెట్‌గా ఉంది. ఈ సాంగ్‌లో వచ్చే సీన్‌లో తన ప్రేమ గురించి చెప్పమని రష్మికను 'ఏం గీత ఇలాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పాలిగా.. ఈ అబ్బాయిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఏం చేశాడో చూడు.' అని ఆమె తల్లి, సోదరుడు అడుగుతుండగానే.. పక్కన ఉన్న మరొకరు మాట్లాడుతూ.. 'సిగ్గుండాలి కొంచెమైనా? చేసింది చాలు' అనగానే.. అంతలోనే ఇద్దరు ముద్దు పెట్టుకుంటారు.

ఆ తర్వాత జెట్‌లో వచ్చే ముద్దు సన్నివేశాలు అభిమానులకు ఫుల్ రొమాంటిక్ విందును అందించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఇటీవల రణబీర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అధికారిక టీజర్‌ను విడుదల చేశారు. దీనికి అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో  డిసెంబర్ 1న థియేటర్లలోకి రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement