దుబాయ్‌లో యానిమల్‌ | Animal stars Ranbir Kapoor and Bobby Deol do Bhangra in Dubai for Arjan Vailly launch | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో యానిమల్‌

Published Mon, Nov 20 2023 4:21 AM | Last Updated on Mon, Nov 20 2023 4:21 AM

Animal stars Ranbir Kapoor and Bobby Deol do Bhangra in Dubai for Arjan Vailly launch - Sakshi

రణబీర్‌ కపూర్, బాబీ డియోల్‌

రణబీర్‌ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘యానిమల్‌’. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాబీ డియోల్, అనిల్‌ కపూర్‌ కీలక పాత్రల్లో నటించారు. గుల్షన్‌ కుమార్, టి.సిరీస్‌ సమర్పణలో భద్రకాళి పిక్చర్స్, సినీ 1 స్టూడియోస్‌పై భూషణ్‌ కుమార్, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషణ్‌ కుమార్, మురాద్‌ ఖేతాని నిర్మించారు.

ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబరు 1న విడుదలవుతోంది. ఈ సినిమాలోని ‘అర్జన్‌ వైలీ..’ అనే పాటను దుబాయ్‌లోని ఐకానిక్‌ గ్లోబల్‌ విలేజ్‌లో అభిమానుల మధ్య ఘనంగా విడుదల చేశారు మేకర్స్‌. ఈ వేడుకలో రణబీర్‌ కపూర్, బాబీ డియోల్‌ పాల్గొన్నారు. వేదికపై ‘అర్జన్‌ వైలీ...’ పాటకు స్టార్‌ కాస్ట్‌తో పాటు అభిమానులు చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement