Animal Movie New Release Date Sandeep Reddy Video Viral - Sakshi
Sakshi News home page

Animal Movie: కొత్త రిలీజ్ డేట్.. అదిదా అసలు మేటర్!

Published Mon, Jul 3 2023 1:20 PM | Last Updated on Mon, Jul 31 2023 8:14 PM

Animal Movie New Release Date Sandeep Reddy Video Viral - Sakshi

ఆ డైరెక్టర్ తీసింది ఒ‍క్కటే సినిమా. కానీ దేశవ్యాప్తంగా కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అదే మూవీని హిందీలో రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్. వందల కోట్ల కలెక్షన్స్. దీంతో ఆ దర్శకుడు నెక్స్ట్ చిత్రం ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు తెగ ఎదురుచూశారు. ఇప్పుడేమో మరో నెలరోజుల్లో విడుదల ఉందనగా, రిలీజ్ డేట్ మార్చేశారు. ఏకంగా మూడున్నర నెలల తర్వాత థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. అసలు కారణం ఏంటో కూడా బయటపెట్టారు.

'యానిమల్' వాయిదా
'అర్జున్‌రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తీస్తున్న పాన్ ఇండియా మూవీ 'యానిమల్'. రణ్‌బీర్ కపూర్, రష్మిక హీరోహీరోయిన్లు. ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాలి. ఇప్పుడేమో ఆ తేదీన రాలేకపోతున్నామని.. డిసెంబరు 1న విడుదలవుతుందని కొత్త డేట్ ప్రకటించారు. అభిమానులు కాస్త నిరుత్సాహపడిన మాట వాస్తవే.. కానీ డైరెక్టర్ చెప్పింది విని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన సినిమాపై పెట్టుకున్న నమ్మకం చూసి అంచనాలు పెంచేసుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల‍్లోకి ఏకంగా 24 సినిమాలు)

డైరెక్టర్ ఏం చెప్పారు?
'ఈ సినిమాలో ఏడు పాటలున్నాయి. ఐదు భాషల్లో లెక్కేస్తే మొత్తం 35 అవుతాయి. ఇన్ని సాంగ్స్ ని డిఫరెంట్ సెటప్ ప్లేసులు, డిఫరెంట్ సెటప్ సింగర్స్ తో రికార్డ్ చేయాలంటే కాస్త టైమ్ పడుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్లే ఆగస్టు 11న విడుదల చేయలేమని మాకు అర్థమైంది. ప్రీ టీజర్ కు వచ్చిన స‍్పందనకు ధన్యవాదాలు. హిందీలో రికార్డ్ చేసిన పాటలకు లిరికల్ గా ఎలాంటి ఔట్‌పుట్ వచ్చిందో ఇతర భాషల్లోనూ అలాంటి దానికోసం ప్రయత్నిస్తున్నాం. దీనికోసం టైమ్, ఎనర్జీ కేటాయించాల్సి ఉంటుంది' 

'అలానే ఇతర భాషల్లో విన్నవాళ్లకు డబ్బింగ్ అనే ఫీల్ రాకూడదనేదే మా ఆలోచన. అందుకే మూవీ రిలీజ్ వాయిదా వేశాం. డిసెంబరు 1న 'యానిమల్' విడుదల చేయబోతున్నాం. ప్రేక్షకులకు వీడియో, ఆడియో పరంగా బెస్ట్ క్వాలిటీ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాను. ఓవరాల్ గా ఇది చాలా పెద్ద మూవీ. థియేటర్లలో రణ్‌బీర్ కపూర్ విశ్వరూపం చూస్తారు' అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు. 

సందీప్ చెప్పిన దానిబట్టి చూస్తుంటే.. పాటలు ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి. అందుకే వాటి విషయంలో అస్సలు తగ్గట్లేదనిపిస్తోంది. ఇక 'యానిమల్' తర్వాత డైరెక్టర్ సందీప్.. ప్రభాస్ తో కలిసి పనిచేయబోతున్నాడు. 'స్పిరిట్' అనే మూవీని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. బహుశా దీని షూటింగ్.. వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశముంది. 

(ఇదీ చదవండి: డైరెక్టర్‌తో హీరోయిన్‌ సీక్రెట్‌ పెళ్లి.. యూటర్న్‌ తీసుకున్న కల్పికా గణేశ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement