రష్మిక మందన్న ఫేక్‌ వీడియో వైరల్‌.. ఫైర్‌ అయిన అమితాబ్‌ | Rashmika Mandanna Fake Morphing Video Controversy, Celebrities And Fans Reactions Goes Viral - Sakshi
Sakshi News home page

Rashmika Fake Video Controversy: రష్మిక మందన్న ఫేక్‌ వీడియో వైరల్‌.. వారిని శిక్షించాలని డిమాండ్‌

Published Mon, Nov 6 2023 7:40 AM | Last Updated on Mon, Nov 6 2023 12:06 PM

Rashmika Mandanna Fake Video Viral - Sakshi

సోషల్ మీడియా వైరస్ లాంటింది. కోవిడ్‌కన్నా బలమైంది… ఒక్కోసారి అందులో వైరల్‌ అవుతున్న ఫోటోలు,వీడియోలు  ఏవి నిజమో..? ఏది అబద్ధమో పసిగట్టడం కష్టం. సోషల్‌ మీడియాలో నకిలీ సృష్టికర్తల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలపై ఫేక్ న్యూస్, ఫేక్ ఫోటోలు, వీడియోలు ప్రచారం చేసే వారి వ్యక్తిగత జీవితానికి ఇబ్బందులు కలిగేలా కొందరు ఎంతటి చెత్తపనులు అయినా చేసేందుకు వెనకాడటం లేదు. తాజాగా నటి రష్మిక మందన్న కూడా ఈ సమస్యను ఎదుర్కొంటోంది.

ప్రస్తుతం రష్మిక మందన్న డీప్ నెక్ బ్లాక్ కలర్ డ్రెస్‌లో లిఫ్ట్ లోపల నిలబడి ఉన్న వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వారందరూ రష్మికనే అని పొరపడ్డారు. బహిరంగా ప్రదేశాల్లో రష్మిక ఇలాంటి డ్రెస్‌ వేయడం ఏంటి..? మరీ ఇంత హాట్‌గా ఎందుకు కనిపించారు..? అనే ప్రశ్నలు ఆమె అభిమానుల్లో కనిపించాయి.. ఆ వీడియోను చూసి వారంతా కలత చెందారు కూడా. అయితే ఈ వీడియోలో రష్మిక కాదని తెలుస్తోంది. కొందరు సోషల్‌ మీడియా దుండగులు ఓ డీప్ ఫేక్ వీడియోను రూపొందించి హల్ చల్ చేశారు.

ఫైర్‌ అయిన అమితాబ్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ కూడా ఈ వీడియోపై స్పందించారు. ఇలాంటి వీడియోల మీద వ్యతిరేకత ప్రదర్శించాడు. వీడియో క్రియేట్‌ చేసిన వారిని పట్టుకుని శిక్షించాలని తన ట్విటర్‌ ఎక్స్‌ ద్వారా రియాక్ట్‌ అయ్యారు. ఆ వీడియో నిజమని కొందరు నమ్ముతున్న సమయంలో వాస్తవికతను జర్నలిస్ట్ అభిషేక్ మొదట ఆ వీడియో షేర్‌ చేస్తూ.. వాస్తవాన్ని వెల్లడించారు. చెప్పాలంటే, ఈ వీడియోలో జారా పటేల్ అనే యువతి ఉన్నారని ఆయన తేల్చేశారు.

అయితే కొందరు సోషల్‌ మీడియా ముసుగులో రష్మిక ముఖాన్ని ఆమె ముఖంలోకి మార్ఫింగ్ చేసి ఆ వీడియో వైరల్ చేశారు. ఇంతకుముందు కూడా రష్మిక మందన్న ఇలాంటి పొట్టి డ్రెస్‌లో ఉన్న ఫోటోలు, జిమ్ వీడియోలు వైరల్ అయ్యాయి. కొందరు ఒకరినొకరు పోల్చుకుని, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో రష్మికదే అని అనుకున్నారు. ఈ మేరకు అభిషేక్‌ సమాచారం అందించారు. రెండు వీడియోలను షేర్ చేసి క్లారిటీ ఇచ్చారు.

వైరల్‌గా మారిన ఫేక్ వీడియోపై రష్మిక అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులను తగిన విధంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో వారు ఉన్నట్లు తెలుస్తోంది.  గతంలో కూడా చాలా మంది నటీనటులు ఇలాంటి ఫేక్ ఫోటోలు, వీడియోలతో ఇబ్బంది పడ్డారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాన్ని సద్వినియోగం చేసుకోవడం కంటే తప్పుగా వాడేవారే ఎక్కువ. ఇది ఎప్పుడు ఏ దశకు చేరుతుందో తెలియక నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు.

సినిమాల విషయనాకి వస్తే రష్మిక మందన్న నటించిన 'యానిమల్‌' విడుదలకు సిద్ధంగా ఉంది. రణబీర్ కపూర్ సరసన రష్మిక నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాలోని లిప్‌లాక్ సన్నివేశాలు వైరల్‌గా మారాయి. సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి డైరెక్ట్‌ చేశారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విజయంతో బాలీవుడ్‌లో మరిన్ని ఛాన్స్‌లు దక్కించుకోవాలనే ప్లాన్‌లో ఈ బ్యూటీ ఉంది. తను నటించిన పుష్ప-2 వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా శ్రీవల్లి పాత్రలో రష్మిక అదరగొట్టిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement