నేషనల్ క్రష్ రష్మిక(rashmika mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవల పుష్ప 2(pushpa 2)తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. త్వరలోనే ఛావా అనే మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇలా వరుస సినిమాల్లో నటించడం కోసం పెద్ద త్యాగమే చేశానంటోంది రష్మిక. కొన్ని విషయాల్లో రాజీ పడడం వల్లే ఈ స్థాయి సక్సెస్‌ని అందుకుంటున్నానని చెబుతోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘కెరీర్ పరంగా బిజీగా ఉండడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానని బాధ పడింది. తనకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టమని.. కానీ కెరీర్ కోసం వాళ్లకు దూరంగా ఉండాల్సి వస్తోందని ఎమోషల్ అయింది.
‘ఫ్యామిలీనే నా బలం. ఎక్కువ సమయం కుటుంబంతోనే గడిపేదాన్ని. నా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి రోజు చాటింగ్ చేసుకుంటాం. కానీ షూటింగ్స్ కారణంగా తనను కలువలేకపోతున్నాను. తను చాలా స్మార్ట్. రానున్న రోజుల్లో అద్భుతమైన మహిళగా మారనుందని నమ్ముతున్నా. ‘వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలకు ఒకేసారి సమయాన్ని కేటాయించడం అంత సులభం కాదు. ఒకదాని కోసం మరొకటి త్యాగం చేయాల్సి ఉంటుంది’ అని మొదట్లోనే మా అమ్మ చెప్పింది. నా విషయంలో ఇప్పుడు అదే జరుగుతుంది. వృత్తిపరమైన కమిట్‌మెంట్స్ నిలబెట్టుకోవడానికి ఫ్యామిలీ టైమ్ త్యాగం చేయాల్సి వస్తోంది. వీలున్నప్పుడల్లా కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడుతుంటా’ అని రష్మిక చెప్పుకొచ్చింది.
సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం లక్ష్మణ్ ఉదేకర్ దర్శకత్వంలో ఛావా(Chhava) అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక నటిస్తోంది. ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ‘సికందర్’, ‘థామ’, ‘కుబేర’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘రెయిన్ బో’ చిత్రాల్లో రష్మిక నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment