బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం 'యానిమల్' .ఇప్పటికే కబీర్ సింగ్‌ను బాలీవుడ్‌కు హిట్ ఇచ్చిన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘యానిమల్’ విడుదలకు రెడీగా ఉంది. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ప్రి టీజర్‌ని మేకర్స్ ఇప్పటికే విడుదల చేయగా అందుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజగా ఈ చిత్రం గురించి మరోక క్రేజీ సమాచారాన్ని షేర్ చేశారు.
(ఇదీ చదవండి: షాండ్‌విచ్ దెబ్బకు ఆస్పత్రిపాలైన టాప్ హీరోయిన్)
కొద్ది సేపటి క్రితం ఓ రొమాంటిక్ పోస్టర్‌ను వదులుతూ యానిమల్ నుంచి ఫస్ట్ సింగల్ విడుదల గురించి వివరాలు ప్రకటించారు మేకర్స్. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల అవుతున్న ఈ సినిమా ఐదు భాషల్లో మొదటి సాంగ్‌ను అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగులో ‘అమ్మాయి’ అనే టైటిల్‌తో ఈ పాటు విడుదల కానుంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. దీనిని సందీప్ వంగాతో పాటు రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
రణ్‌బీర్‌కపూర్- రష్మిక ఆకాశంలో లిప్ లాక్ చేసుకుంటున్న పోస్టర్‌ను విడుదల చేశారు. సందీప రెడ్డి మొదటి చిత్రం అయిన అర్జున్ రెడ్డి పోస్టర్‌తో ఫ్యాన్స్ పోలుస్తున్నారు. అందులో విజయ్ దేవరకొండ- షాలినీ కూడా లిప్‌లాక్‌తో సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు. ఇప్పుడు యానిమల్ పోస్టర్‌తో మూవీతో పాటు సాంగ్‌పై ఒక్కసారిగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, జానీ సంగీతం అందిస్తున్నారు. 2023 డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా యానిమల్ విడుదల అవుతుంది.
#AnimalTheFilm pic.twitter.com/oI3ko5YnEz
— Sandeep Reddy Vanga (@imvangasandeep) October 10, 2023
Hua main ❤️
— Rashmika Mandanna (@iamRashmika) October 10, 2023
Out tomorrow..
this song is 🔥🔥🔥🔥
And I personally love it in all the versions.. Hindi Kannada telugu tamil and Malayalam .. 💃🏻🥳#HuaMain #Ammayi #Neevaadi #OhBhaale #Pennaale#AnimalTheFilm@AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @thedeol @tripti_dimri23… pic.twitter.com/JH7eADNoDs
Comments
Please login to add a commentAdd a comment