‘యానిమల్’ చిత్రం అనుకున్న సమయాని కన్నా కాస్త ఆలస్యంగా థియేటర్స్‌కు రానుంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘యానిమల్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, మురాద్ ఖేతని, అశ్విన్ వార్దే, ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్నారు.
యాక్షన్, రొమాన్స్, ప్రతీకారం అంశాలతో తండ్రీకొడుకుల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కావడం లేదని, కొన్ని కారణాల వల్ల డిసెంబరులో రిలీజ్ చేసే యోచనలో చిత్రయూనిట్ ఉన్నారని బాలీవుడ్ సమాచారం. ఈ చిత్రంలో అనిల్‌కపూర్, బాబీ డియోల్, శక్తికపూర్ కీలక పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment