యానిమల్‌ నుంచి 'నాన్న నువ్‌ నా ప్రాణం' ఎమోషనల్‌ సాంగ్‌ రిలీజ్‌ | Watch: Ranbir Kapoor Animal Movie Emotional Song Nanna Nuv Naa Pranam Out Now, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Animal Movie Song: యానిమల్‌ నుంచి 'నాన్న నువ్‌ నా ప్రాణం' ఎమోషనల్‌ సాంగ్‌ రిలీజ్‌

Published Tue, Nov 14 2023 12:42 PM | Last Updated on Tue, Nov 14 2023 1:16 PM

Emotional Song Out Now In Animal Movie - Sakshi

ప్రస్తుతం సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న సినిమా ‘యానిమల్‌’.  సందీప్‌ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇందులో రష్మిక మందన్న కథానాయిక. అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌ మొదటి పాటను కూడా విడుదల చేశారు. తాజాగా ఎమోషనల్‌గా ఉన్న రెండో సాంగ్‌ను కూడా మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.

'నాన్న నువ్‌ నా ప్రాణం' అంటూ సాగే ఈ సాంగ్‌ ఎంతో ఎమోషనల్‌గా ఉంది. తండ్రీకొడుకుల రిలేషన్‌ షిప్‌ నేపథ్యంలో సాగనున్న ఈ మూవీలో బాబీ డియోల్‌, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ పాటను అనంత శ్రీరామ్‌ రచించగా.. సోను నిగమ్‌ అద్భుతంగా ఆలపించారు.

 తాజాగా విడుదలైన పాటలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్‌ మధ్య ఉన్న బంధాన్ని చూపించారు. దీంతో సినిమా తండ్రి – కొడుకుల మధ్య జరిగే కథలా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎక్కువగా భావోద్వేగాలకు సంబంధించిన సీన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. యానిమల్ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో డిసెంబర్‌ 1న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement