వైల్డ్‌ యానిమల్‌ | Ranbir Kapoor Animal pre-teaser out | Sakshi
Sakshi News home page

వైల్డ్‌ యానిమల్‌

Published Mon, Jun 12 2023 6:25 AM | Last Updated on Mon, Jun 12 2023 6:25 AM

Ranbir Kapoor Animal pre-teaser out - Sakshi

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘యానిమల్‌’. ‘అర్జున్‌ రెడ్డి’ ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ నుంచి చిన్న సీన్‌ను ప్రీ టీజర్‌గా ఆదివారం విడుదల చేసింది చిత్రయూనిట్‌. ‘వైల్డ్‌ యానిమల్‌’, ‘వైలెంట్‌ యానిమల్‌’ అంటూ ‘యానిమల్‌’ ప్రీ టీజర్‌ గురించి పోస్ట్‌లు చేస్తున్నారు నెటిజన్లు.

ఫుల్‌ టీజర్‌ ఈ నెల 16న విడుదల కానుందని సమాచారం. తండ్రీ కొడుకుల భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా కథ, కథనాలు ఉంటాయట. ఓ కాలేజ్‌ లెక్చరర్‌ అయిన యువకుడు తండ్రి కోసం మాఫియాతో ఏ విధంగా పోరాడాడు? అనే కథాంశంతో ‘యానిమల్‌’ తెరకెక్కుతోందని ప్రచారం సాగుతోంది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్టులో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement