
తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన హిందీ చిత్రం ‘యానిమల్’. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్. అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ ముఖ్య పాత్రలు చేశారు. భూషణ్‌కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్, మురాద్ ఖేతని నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 1న విడుదల కానుంది. గురువారం రణ్‌బీర్ బర్త్ డే సందర్భంగా ‘యానిమల్’ టీజర్‌ను రిలీజ్ చేశారు.
‘జ్యోతి... క్రిమినల్‌ను కన్నాం మనం.. (అనిల్ కపూర్), ‘మై ఫాదర్ ఈజ్ ది బెస్ట్ ఫాదర్ ఇన్ ది వరల్డ్.. డోన్ట్ ఎవర్ గో దేర్, నేను చెడును వెంటాడుతూ వెళ్లాను. నాకెక్కడా కనపడలేదు. నాలో నేను చూసుకున్నాను. నాకన్నా చెడ్డవాడు లేడు’ (రణ్‌బీర్) అనే డైలాగ్స్ టీజర్‌లో ఉన్నాయి. తెలుగులోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment