Rashmika Mandanna To Act With Ranbir Kapoor in Animal Movie - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: ఐటెం సాంగ్‌లో కాదు.. ఏకంగా హీరోయిన్‌ చాన్స్‌..

Published Sat, Apr 2 2022 4:58 PM | Last Updated on Sun, Apr 3 2022 11:24 AM

Official: Rashmika Mandanna Star in Ranbir Kapoor, Sandeep Vanga Animal Movie - Sakshi

బాలీవుడ్‌ చిత్రం ‘ఎనిమల్‌’లో రష్మిక మందన్నా ఓ ఐటెం సాంగ్‌లో నటిస్తున్నట్లు కొద్ది రోజులగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికి దీనిపై చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ వార్తలపై టీ-సిరీస్‌ సంస్థ క్లారిటీ ఇచ్చింది. అర్జున్‌ రెడ్డి ఫేం, తెలుగు డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా ఎనిమల్‌ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తాజాగా మేకర్స్‌, డైరెక్టర్‌ సందీప్‌ వంగ అధికారిక ప్రకనట ఇచ్చారు. ఈ మేరకు టీ-సిరీస్‌ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో పోస్ట్‌ షేర్‌ చేసింది. ‘ఈ ఉగాది, గుడి పూజ సందర్భంగా రష్మిక మందన్నాకు ‘ఎనిమల్‌’ టీం స్వాగతం పలుకుతోంది. ఈ సమ్మర్‌లో ఎనిమల్‌ సెట్స్‌పైకి రానుంది’ అంటూ వెల్లడించింది.

చదవండి: కృతిశెట్టి నో చెప్పిన ప్రాజెక్ట్‌కు ‘మహానటి’ గ్రీన్‌ సిగ్నల్‌

అలాగే సందీప్‌ వంగ ట్వీట్‌ చేస్తూ.. ‘అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఈ సందర్భంగా రష్మిక మందన్నాకు ఎనిమల్‌కు టీం స్వాగతం. ఇందులో రష్మిక.. గీతాంజలి పాత్ర పోషించనుంది’ అని తెలిపాడు. కాగా ఇప్పటికే రష్మిక హిందీలో మిషన్‌ మజ్నుతో పాటు అమితాబ్‌ బచ్చన్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తన మూడో సినిమాకే ఏకంగా రణ్‌బీర్‌ కపూర్‌ వంటి స్టార్‌ హీరోతో నటించే చాన్స్‌ కొట్టేసింది. యాక్షన్‌, రొమాంటిక్‌ డ్రామా ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ మూవీలో అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌లు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సమ్మర్‌ సెట్స్‌పై రానున్న ఎనిమల్‌ వచ్చే ఏడాది 2023 అగష్టు 11న విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement