యానిమల్‌ డైరెక్టర్‌ వల్ల థియేటర్స్​ యజమానులకు తిప్పలు..! | Animal Movie Runtime Effect On Theatres | Sakshi
Sakshi News home page

Animal: యానిమల్‌ డైరెక్టర్‌ వల్ల థియేటర్స్​ యజమానులకు తిప్పలు..!

Published Sun, Nov 5 2023 2:29 PM | Last Updated on Sun, Nov 5 2023 2:54 PM

Animal Movie Runtime Effect On Theatres - Sakshi

సందీప్‌ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘యానిమల్‌’. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఈ చిత్రం డిసెంబర్‌1న ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఈ సినిమా రన్‌ టైమ్‌ విషయంలో ఇప్పటికే సోషల్‌ మీడియాలో భారీగానే చర్చ జరుగుతుంది. యానిమల్‌ నిడివి విషయంలో వస్తున్న రూమర్స్‌ను చూసి సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. బాలీవుడ్​ నటుడు రణ్​బీర్ కపూర్​, హీరోయిన్​ ర‌ష్మిక జంటగా నటించిన తాజా చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండటంతో మూవీ రన్‌టైమ్‌ తగ్గించాలని డైరెక్టర్‌ వంగా సందీప్‌ రెడ్డికి చాలా అభ్యర్థనలు వస్తున్నాయట.

(ఇదీ చదవండి: జీవితంలో కష్టాలు వచ్చినా.. గుండె బద్దలైనా అంటూ శ్రీజ కామెంట్స్‌)

సుమారు 3:30 గంటలు ఉన్న యానిమల్‌ రన్‌టైమ్‌ ఇప్పటికే పలు సూచనల మేరకు ఆయన 3:15 నిమిషాలకు కుదించారట. ఇక అంతకు మించి కుదించడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని ఆయన తేల్చేశాడట. కథ పరంగా తను ఏదైతే ప్రేక్షకులకు చూపించాలని డిసైడ్‌ అయ్యాడో దానిని కట్‌ చేయడం కుదరదని, రన్‌టైమ్‌ విషయంలో ఏ మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని సందీప్‌ చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇంత ఎక్కువ నిడివ గల సినిమా అంటే థియేటర్స్​లో వేసే షోస్​ టైమింగ్​తో పాటు ఇతర ఇబ్బందులు కూడా తలెత్తుతాయని థియేటర్‌ యాజమాన్యం  సూచిస్తుందట. 3: 15 గంటల సినిమా అంటే రెండు బ్రేక్స్‌ ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చను వారు అనుకుంటున్నారట. 

ఇంత లాంగ్​ రన్​టైమ్​ సినిమాలను తమ టాకీస్​లలో ప్రదర్శిస్తే ఆ తర్వాతి షోల టెలికాస్ట్​ టైమింగ్​ పరంగా, అలాగే స్పెషల్​ షోస్​ వేసే విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటామని థియేటర్‌ యజమానులు వాపోతున్నారట. యానిమల్‌ రన్‌టైమ్‌ 3:15 గంటలు అనేది నిజం అయితే సినిమాకు రెండు ఇంటర్వెల్స్‌ అనేది గ్యారెంటీ అని తెలుస్తోంది. డిసెంబర్‌1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement