మార్ఖోర్ అనేది అడవి మేక. ఇది హిమాలయ ప్రాంతాలలో కనిపిస్తుంది. దీనికి సంబంధించి చాలా కథలు వినిపిస్తాయి. ఇది పాములకు తొలి శత్రువు అని చెబుతారు. పాములు ఎక్కడున్నాయో కనిపెట్టి, వాటిని చంపి, నమిలి మింగేస్తుందని చెబుతారు. పాకిస్తానీ గూఢచార సంస్థ ఐఎస్ఐ చిహ్నంలో మార్ఖోర్ కనిపిస్తుంది.
మార్ఖోర్ పాకిస్తాన్ జాతీయ జంతువు. మార్ఖోర్ అనేది పర్షియన్ పదం. దీని అర్థం పాములను తినేది లేదా పాములను చంపేది. ఈ జంతువు తన వాడి అయిన కొమ్ములతో పాములను చంపి, వాటిని తినగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని స్థానిక జానపద కథలు చెబుతున్నాయి. పాముకాటు నుండి విషాన్ని తొలగించడంలోనూ మార్ఖోర్ సహాయపడుతుందని కూడా చెబుతారు. అయితే మార్ఖోర్.. పాములను తిన్నట్లు లేదా వాటి కొమ్ములతో పాములను చంపినట్లు ఆధారాలు ఎక్కడా కనిపించవు.
అయితే పాకిస్తాన్ ప్రజలు మార్ఖోర్‌లు ఉండే చోట పాములు కనిపించవని నమ్ముతారు. ప్రస్తుతం మనకు సాధారణంగా మేక.. మార్ఖోర్ నుండి ఉద్భవించి ఉండవచ్చని చార్లెస్ డార్విన్ ఊహించాడు. మార్ఖోర్ చాలా శక్తివంతమైనది. 6 అడుగుల పొడవు, 240 పౌండ్ల బరువు కలిగి ఉంటుంది. దీనికి దవడ నుండి కడుపు దిగువ వరకు విస్తరించిన దట్టమైన గడ్డం ఉంటుంది.
మార్ఖోర్లు ఉత్తర భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి టర్కిస్తాన్ వరకు 2,000 నుండి 11,800 అడుగుల ఎత్తయిన పర్వతాలలో నివాసం ఉంటాయి. ఇవి ప్రధానంగా శాఖాహారులు. ఇవి సాధారణంగా గుంపులుగా జీవిస్తాయి. ఒక మందలోని మార్ఖోర్‌ల సగటు సంఖ్య దాదాపు 9గా ఉంటుంది. కాగా వేట కారణంగా మార్ఖోర్ల జనాభా తగ్గుతోంది. వాటి ప్రత్యేకమైన కొమ్ముల కోసం వేటగాళ్లు మార్ఖోర్లను వేటాడుతారు.
ఇది కూడా చదవండి: భారత సంతతి జడ్జి చేతిలో గూగుల్ భవితవ్యం
Comments
Please login to add a commentAdd a comment