eats
-
ఆకలికి తాళలేక పిల్లిని తినేశాడు..చివరికి మానసిక వైద్యశాలలో..
ఓ వ్యక్తి ఆకలికి తాళ్లలేక చనిపోయిన పిల్లిని తినేశాడు. ఈ దిగ్బ్రాంతికర ఘటన కేరళలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అతను సైక్రియాట్రిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎందువల్ల ఈ జుగుప్సా కరమైన చర్యకు దిగాడు?. ఇలా పచ్చిమాంసం తినడం ఎంతవరకు మంచిది అంటే.. ఈ భయానక ఘటన కేరళలోని కుట్టిపురంలో చోటు చేసుకుది. 27 ఏళ్ల వ్యక్తి కుట్టిపురంలోని బస్టాండ్‌లో చనిపోయిన పిల్లి మాంసాన్ని తింటూ కనిపించాడు. దీంతో షాక్‌కి గురయ్యిన స్థానికలు పోలీసులుకు సమాచారం అందించారు. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రిలోకి తీసుకువెళ్లి పలు పరీక్షలు చేయించారు. ప్రాథమిక పరీక్షల్లో అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తేలడంతో పోలీసులు అతడిని మానసిక వైద్యశాలలో అడ్మిట్ చేశారు. అతడు గత ఐదు రోజుల నుంచి భోజనం చేయకపోవడంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని విచారణలో తేలింది. ఏదీఏమైనా వండకుండా ఇలా పచ్చి మాంసం తినడం మంచిదేనా? ఏవైనా సమస్యలు వస్తాయా? అంటే.. చాలా దేశాల్లో పచ్చిగా మాంసాన్ని తినేసే సంప్రదాయం ఉంది. ముఖ్యంగా చైనా వంటి దేశాల గురించి చెప్పనక్కర్లేదు. వాళ్లు చాలా వరకు పచ్చిగా తినేందుకే ఇష్టపడతారు. ఐతే ఇలా తినడం ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొదటగా ఫుడ్ పాయిజన్ అయ్యి ఆరోగ్యం చెడిపోతుందని అన్నారు. పచ్చి మాంసంలో బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్న జీవులు లేదా టాక్సిన్లతో చాలా విషపూరితంగా ఉంటుంది. వాటి ప్రేగులు కత్తిరించబడితే మరింత ప్రమాదం అని చెబుతున్నారు. ఒక వేళ ఆ మాంసానికి హానికరమైన వ్యాధికారకాలు వ్యాపిస్తే వధ సమయంలో ఆహార కాలుష్యం ఏర్పడుతుంది. అదీగాక సాల్మోనెల్లా, క్లోస్ట్రిడియా పెర్ఫ్రింజెన్స్, ఇ కోలి లిస్టేరియా మోనోసైటోజెన్‌లు క్యాంపిలోబాక్టర్ వంటి వ్యాధి కారకాలు పచ్చి మాంసలో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవన్నీ మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనవి. ఇలా తింటే వచ్చే సమస్యలు.. వికారంతో వాంతులు అవ్వడం అతిసారం తీవ్రమైన కడుపు నొప్పి, తిమ్మిరి తీవ్రమైన జ్వరం తీవ్రమైన తలనొప్పి ఈ లక్షణాలు తిన్న 24 గంటల్లో కనిపిస్తాయి. వ్యాధికారకాన్ని బట్టి ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్‌కి చికిత్స చేయగలిగనప్పటికీ పలు సందర్భాల్లో ప్రాణాంతకం అయ్యే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అందువల ఉడికించి తింటే వ్యాదికారక క్రిములు నాశనంమయ్యి తినేందుకు సురక్షితంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే ఈ పచ్చి మాంసంలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవని చెప్పారు. కొన్ని దేశాల్లో పచ్చిగా తినే సంప్రదాయం ఉంది. ఇలా తినడం ఎంత మాత్ర సురక్షితం కానప్పటికీ అనారోగ్య ప్రమాదాన్ని తగ్గించే మార్గాలు కొన్ని ఉన్నాయన్నారు. అవి అనుసరిస్తే ప్రమాదం ఉండదని సూచించారు. పచ్చిగా తినాలనుకుంటే తాజా మాంసాన్ని, అదికూడా ముక్కలుగా ఉన్నదాన్ని ఎంచుకోమని చెబుతున్నారు. (చదవండి: ఆయుష్షు పెంచే డ్రగ్ ట్రయల్!..ఏకంగా వెయ్యి కుక్కలపై..) -
పాకిస్తాన్ జాతీయ జంతువు ఏది? ఏ విషప్రాణులను మింగుతుంది?
మార్ఖోర్ అనేది అడవి మేక. ఇది హిమాలయ ప్రాంతాలలో కనిపిస్తుంది. దీనికి సంబంధించి చాలా కథలు వినిపిస్తాయి. ఇది పాములకు తొలి శత్రువు అని చెబుతారు. పాములు ఎక్కడున్నాయో కనిపెట్టి, వాటిని చంపి, నమిలి మింగేస్తుందని చెబుతారు. పాకిస్తానీ గూఢచార సంస్థ ఐఎస్ఐ చిహ్నంలో మార్ఖోర్ కనిపిస్తుంది. మార్ఖోర్ పాకిస్తాన్ జాతీయ జంతువు. మార్ఖోర్ అనేది పర్షియన్ పదం. దీని అర్థం పాములను తినేది లేదా పాములను చంపేది. ఈ జంతువు తన వాడి అయిన కొమ్ములతో పాములను చంపి, వాటిని తినగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని స్థానిక జానపద కథలు చెబుతున్నాయి. పాముకాటు నుండి విషాన్ని తొలగించడంలోనూ మార్ఖోర్ సహాయపడుతుందని కూడా చెబుతారు. అయితే మార్ఖోర్.. పాములను తిన్నట్లు లేదా వాటి కొమ్ములతో పాములను చంపినట్లు ఆధారాలు ఎక్కడా కనిపించవు. అయితే పాకిస్తాన్ ప్రజలు మార్ఖోర్లు ఉండే చోట పాములు కనిపించవని నమ్ముతారు. ప్రస్తుతం మనకు సాధారణంగా మేక.. మార్ఖోర్ నుండి ఉద్భవించి ఉండవచ్చని చార్లెస్ డార్విన్ ఊహించాడు. మార్ఖోర్ చాలా శక్తివంతమైనది. 6 అడుగుల పొడవు, 240 పౌండ్ల బరువు కలిగి ఉంటుంది. దీనికి దవడ నుండి కడుపు దిగువ వరకు విస్తరించిన దట్టమైన గడ్డం ఉంటుంది. మార్ఖోర్లు ఉత్తర భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి టర్కిస్తాన్ వరకు 2,000 నుండి 11,800 అడుగుల ఎత్తయిన పర్వతాలలో నివాసం ఉంటాయి. ఇవి ప్రధానంగా శాఖాహారులు. ఇవి సాధారణంగా గుంపులుగా జీవిస్తాయి. ఒక మందలోని మార్ఖోర్ల సగటు సంఖ్య దాదాపు 9గా ఉంటుంది. కాగా వేట కారణంగా మార్ఖోర్ల జనాభా తగ్గుతోంది. వాటి ప్రత్యేకమైన కొమ్ముల కోసం వేటగాళ్లు మార్ఖోర్లను వేటాడుతారు. ఇది కూడా చదవండి: భారత సంతతి జడ్జి చేతిలో గూగుల్ భవితవ్యం -
సీఫుడ్ తినడం మంచిది కాదా? ముఖ్యంగా ఆ చేపలు తింటే..
సీఫుడ్ అంటే చాలు నాలుక కోసుకుంటారు చాలామంది. అంతలా ప్రజలు ఇష్టంగా లాగించేస్తారు. కానీ ఈ సీఫుడ్ ఎక్కువగా తింటే అనేక రకాల చర్మ వ్యాధుల బారినపడటమేగాక కొలస్ట్రాల్ సమస్యను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులోనూ చేపలంటే ఇంకా ఇష్టంగా తింటారు చాలామంది. సముద్ర జాతికిచెందిన చేపలు చాలా రకాలు ఉంటాయి. ఐతే ఓ మహిళ ఇలానే ఎంతో ఇష్టంగా సముద్ర జాతికి చెందిన తిలాపియా అని చేప తింది. పాపం ఆ చేప కారణంగా ప్రాణాంతక బ్యాక్టీరియా బారిన పడి నాలుగు అవయవాలను కోల్పోయింది. దీన్ని బట్టి చూస్తే సీఫుడ్ మంచిదేనా అనే ఫీలింగ్ వస్తుంది కదా!. ఒకవేళ తినాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితరాల గురించే ఈ కథనం. కాలిఫోర్నియాకు చెందిన 40 ఏళ్ల లారా స్థానిక మార్కెట్ నుంచి తిలాపియా అనే చేపను కొనుగోలు చేసింది. తిన్న తర్వాత ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. ఆమె ప్రాణాంతక వైబ్రోవల్ని ఫికస్ అనే బ్యాక్టీరియా బారిన పడినట్లు తెలిపారు. దీనికారణంగా ఆమె చేతి కాలి వేళ్లను తొలగించారు. చావు అంచులదాక వెళ్లి తిరిగొచ్చింది. ఎందువల్ల ఇలా జరిగిందంటే... ఆమె ఆ చేపను సరిగా ఉడికించకుండా తినడం కారణంగానే ఈ బ్యాక్టీరియా ఆమెకు సోకిందని వైద్యులు వెల్లడించారు. సముద్రపు జీవుల్లో కొంత బ్యాక్టీరియా ఉంటుందని, వాటిని బాగా ఉడికిస్తేనే పోతుందని చెబుతున్నారు. సముద్రపు నీటిలో ఎక్కువగా ఈ బ్యాక్టీరియా ఉంటుందని చెబుతున్నారు. సదరు మహిళ లారా ఉడికి ఉడకని ఆ తిలాపియా చేపను తినడంతో తీవ్ర సెప్సిస్‌కి గురై అవయవాలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఈ బ్యాక్టీరియా రోగనిరోధక వ్యకవస్థపై తీవ్ర ప్రభావితం చూపి మనిషిని కుంగదీసేలా చేస్తుందని అన్నారు. ప్రతి ఏడాది యూఎస్‌లో దాదాపు 200 దాక వైబ్రో వల్నిఫికస్ ఇన్షెక్షన్ కేసులు నమోదవుతున్నాయిని, ప్రతి ఐదుగురులో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నట్లు వైద్యులు వెల్లడించారు. వైబ్రో వల్నిఫికస్ అంటే.. ముడి సీఫుడ్ తినడం వల్ల వస్తుంది. అలా కాకుండా కొన్ని విపత్కర పరిస్థితుల్లో గాయాల కారణంగా కూడా వస్తుందని తెలిపారు. సీపుడ్ని ఉడికించకపోవడంతో దానిలో ఉండే బ్యాక్టీరియా నేరుగా శరీరంలోకి సంక్రమించి దాని ప్రతాపం చూపించడం మొదలవుతుందని చెబుతున్నారు వైద్యులు. లక్షణాలు: నీళ్ల విరేచనాలు కడుపు తిమ్మిరి వికారం మరియు వాంతులు తీవ్ర జ్వరం చలి ప్రమాదకరమైన రక్తపోటు పొక్కులు, చర్మ గాయాలు చర్మం ఎరుపు నొప్పి, వాపు తదితర లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఎప్పుడూ రిస్క్ ఎక్కువగా ఉంటుందంటే.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఇలాంటి బ్యాక్టీరియా బారిన పడితే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. అలాగే కాలేయం, హెమోక్రోమాటోసిస్, కిడ్నీ వైఫల్యం తదితర సమస్యలు ఉంటే ప్రాణాలు కోల్పేయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. (చదవండి: బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది కాదా..? ఆ సమస్యలు తప్పవా?) -
రాత్రి భోజనం ఉదయం 11కే కానిచ్చేస్తాడు.. 45లో 18లా కనిపిస్తూ..
అమెరికన్ వ్యాపారవేత్త బ్రియాన్ జాన్సన్ ప్రకృతికి విరుద్ధంగా పోరాడుతూ కొన్ని ఏళ్లు వెనక్కి వెళుతున్నారు. అంటే తన వయసును తగ్గించుకుని యంగ్ లుక్‌లోకి వచ్చేస్తున్నారు. ఇందుకోసం బ్రియాన్ జాన్సన్ రెండు మిలియన్ డాలర్లు ఖర్చుచేస్తున్నారు. బ్రియాన్ చేసిన ఒక తాజా ప్రకటన అందరినీ ఎంతగానో ఆలోచింపజేస్తోంది. బ్రియాన్ జాన్సన్ ఇటీవల ఆయన తాను ఉదయం 11 గంటలకే డిన్నర్ (రాత్రి భోజనం) కానిచ్చేస్తానని వెల్లడించాడు. ఒక ట్విట్టర్ యూజర్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ రోజులో తన చివరి భోజనం ఉదయం 11 గంటలకు ముగుస్తుందని తెలిపారు. నిజానికి ఆ సమయానికి చాలామంది టిఫిన్ తింటుంటారు. Easy, low cost brain/mind measurement unlocks next level wellness. New 🔥 capabilities from @KernelCo. The mind is forgotten until it’s the only thing that matters. More soon. pic.twitter.com/oCtt5RsRYP — Bryan Johnson (@bryan_johnson) July 8, 2023 రోజుకు వందకు మించిన సప్లిమెంట్లు 45 ఏళ్ల బ్రియాన్ జాన్సన్ యుక్త వయసులో ఉన్న తన కుమారుని రక్తాన్ని మార్చుకుంటారు. అలాగే రోజుకు వందకు మించిన సప్లిమెంట్లు తీసుకుంటారు. ఫార్చ్యూన్ తెలిపిన వివరాల ప్రకారం 30 మంది డాక్టర్ల బృందం ప్రతీరోజూ అతని శరీరంలోని ఫ్యాట్ స్కాన్ చేయడంతో పాటు ఎంఆర్ఐ సేకరిస్తుంది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల మధ్యనే ఒక ట్విట్టర్ యూజర్ బ్రియాన్ జాన్సన్‌ను..‘మీ ఆహారపు షెడ్యూల్‌కు సంబంధించిన రిపోర్టు సరైనదేనా?’అని అడిగారు. దీనిని ఆయన సమాధానమిస్తూ అది నిజమేనని తెలిపారు. ‘రోజులో తన చివరి భోజనం ఉదయం 11 గంటలకేనని, నేను ఉదయం 6 గంటల నుంచి 11 గంటల మధ్యనే తింటానని’ తెలిపారు. ఫార్చ్యూన్ రిపోర్టులో పేర్కొన్న వివరాల ప్రకారం బ్రియాన్ ఉదయం వేళ ‘గ్రీన్ జాయింట్’ తీసుకుంటారు. ఈ విధమైన రోజువారీ డైట్ కారణంగా ఆయన 18 ఏళ్ల వ్యక్తికి ఉండే ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కలిగివున్నారు. 48 ఏళ్ల వ్యక్తి హృదయ స్థాయిని, 28 ఏళ్ల వ్యక్తి చర్మపు తీరును కలిగివున్నారు. Question @bryan_johnson Is this a typo? Can you clarify? pic.twitter.com/D1kYkx6eFM — Martina Markota (@MartinaMarkota) July 4, 2023 ఇది కూడా చదవండి: ఆవు మొదలు ఆడ కుక్క వరకూ.. చెత్త పనులుచేసే ముసలోడికి అరదండాలు! -
దసరా కోసం నాని పాట్లు...స్ట్రీట్ ఫుడ్ తింటూ
-
సంక్రాంతి స్పెషల్.. అరిటాకంత ఆనందం!
కడప కల్చరల్(వైఎస్సార్ జిల్లా): సాధారణంగా ఒక అరిటాకులో ఒకరు భోజనం చేస్తారు. మరీ పెద్ద ఆకు అయితే ఇద్దరు తింటారు. ఈ ఫొటోలో కనిపిస్తున్నవారు మాత్రం ఒక్కొక్క ఆకులో ముగ్గురు చొప్పున పది అరిటాకుల్లో సామూహికంగా భోజనం చేశారు. అన్నమయ్య జిల్లా చిట్వేలిలో డాక్టర్ దొండ్లవాగు చంద్రశేఖర్ కుటుంబానికి చెందిన 35 మంది పండుగ సందర్భంగా శనివారం కలుసుకున్నారు. దీన్ని మరపురాని కలయికగా మార్చుకోవాలని భావించారు. వెంటనే అరటితోటలో ఏపుగా పెరిగిన అరిటాకులను తీసుకొచ్చారు. పండుగ భోజనం వడ్డించుకున్నారు. ఆనందాలు పంచుకుంటూ ఆహ్లాదంగా సహపంక్తి భోజనాలు చేశారు. చదవండి: హైదరాబాద్ అల్లుడు.. భీమవరం మామ.. 173 రకాలతో.. -
హల్చల్ చేస్తున్న వాటర్‌మిలన్ బోయ్
మెల్బోర్న్: అందరిలా ఉంటే స్పెషల్ ఏముంది అనుకున్నాడో ఏమో.. క్రికెట్ మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ కుర్రాడు వాటర్‌మిలన్(పుచ్చకాయ)ను మొత్తం తినేసి ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాడు. పుచ్చకాయ మొత్తం తింటే ఆశ్చర్యం ఏముంది.. మేం కూడా చాలా సార్లు తిన్నాం కదా అని అనుకుంటున్నారా.. అయితే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఆ పిల్లాడు పుచ్చకాయ తొక్కను, గింజలను దేన్నీ వదలకుండా మొత్తం తిన్నాడు. అందుకే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. శనివారం ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వచ్చిన ఆ చిన్నోడు తాపీగా కూర్చొని పుచ్చకాయ మొత్తాన్ని లాగించేస్తున్నాడు. అయితే మ్యాచ్ మధ్యలో కెమెరామెన్ ఆ కుర్రాడిని కవర్ చేయడంతో అందరి కళ్లు అతగాడిపై పడ్డాయి. తీక్షణంగా గమనించిన కామెంటేటర్లు.. ఓ మైగాడ్ అతను తొక్కతో సహా మొత్తం తినేస్తున్నాడు అంటూ కామెంటరీ అందుకున్నారు. రెండు మహిళా జట్ల మధ్య జరుగుతున్న ఆ మ్యాచ్ ఫలితం కంటే కూడా, కుర్రాడు ఆ పుచ్చకాయ మొత్తం అలాగే తినేస్తాడా అనే ఆసక్తి ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. కాసేపటికే ట్విట్టర్లో 'ది వాటర్ మిలన్ బోయ్' అనే హ్యష్‌ట్యాగ్ హల్ చల్ చేసింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిన పింక్ కలర్ టీ షర్ట్ ధరించిన ఆ బుడతడు ఎవరనేది మాత్రం తెలియరాలేదు. క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా కెమెరా కంట్లో పడటానికి నానా పాట్లు పడే ప్రేక్షక లోకం ఈ చిన్నోడిని చూసి షాక్ అవుతున్నారు.