Bryan Johnson Says, He Eats Dinner at 11 AM - Sakshi
Sakshi News home page

Bryan Johnson: రాత్రి భోజనం ఉదయం 11కే కానిచ్చేస్తాడు.. 45లో 18లా కనిపిస్తూ..

Published Sun, Jul 9 2023 1:08 PM | Last Updated on Sun, Jul 9 2023 3:34 PM

bryan johnson says he eats dinner at 11am - Sakshi

అమెరికన్ వ్యాపారవేత్త బ్రియాన్ జాన్సన్ ప్రకృతికి విరుద్ధంగా పోరాడుతూ కొన్ని ఏళ్లు వెనక్కి వెళుతున్నారు. అంటే తన వయసును తగ్గించుకుని యంగ్‌ లుక్‌లోకి వచ్చేస్తున్నారు. ఇందుకోసం బ్రియాన్‌ జాన్సన్‌ రెండు మిలియన్‌ డాలర్లు ఖర్చుచేస్తున్నారు. బ్రియాన్ చేసిన ఒక తాజా ప్రకటన అందరినీ ఎంతగానో ఆలోచింపజేస్తోంది.

బ్రియాన్‌ జాన్సన్‌ ఇటీవల ఆయన తాను ఉదయం 11 గంటలకే డిన్నర్‌ (రాత్రి భోజనం) కానిచ్చేస్తానని వెల్లడించాడు. ఒక ట్విట్టర్‌ యూజర్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ రోజులో తన చివరి భోజనం ఉదయం 11 గంటలకు ముగుస్తుందని తెలిపారు. నిజానికి ఆ సమయానికి చాలామంది టిఫిన్‌ తింటుంటారు. 


రోజుకు వందకు మించిన సప్లిమెంట్లు
45 ఏళ్ల బ్రియాన్‌ జాన్సన్‌ యుక్త వయసులో ఉన్న తన కుమారుని రక్తాన్ని మార్చుకుంటారు. అలాగే రోజుకు వందకు మించిన సప్లిమెంట్లు తీసుకుంటారు. ఫార్చ్యూన్‌ తెలిపిన వివరాల ప్రకారం 30 మంది డాక్టర్ల బృందం ప్రతీరోజూ అతని శరీరంలోని ఫ్యాట్‌ స్కాన్ చేయడంతో పాటు ఎంఆర్‌ఐ సేకరిస్తుంది.

ఉదయం 6 గంటల నుంచి 11 గంటల మధ్యనే
ఒక ట్విట్టర్‌ యూజర్‌ బ్రియాన్‌ జాన్సన్‌ను..‘మీ ఆహారపు షెడ్యూల్‌కు సంబంధించిన రిపోర్టు సరైనదేనా?’అని అడిగారు. దీనిని ఆయన సమాధానమిస్తూ అది నిజమేనని తెలిపారు. ‘రోజులో తన చివరి భోజనం ఉదయం 11 గంటలకేనని, నేను ఉదయం 6 గంటల నుంచి 11 గంటల మధ్యనే తింటానని’ తెలిపారు. ఫార్చ్యూన్‌ రిపోర్టులో పేర్కొన్న వివరాల ప్రకారం బ్రియాన్‌ ఉదయం వేళ ‘గ్రీన్‌ జాయింట్‌’ తీసుకుంటారు. ఈ విధమైన రోజువారీ డైట్‌ కారణంగా ఆయన 18 ఏళ్ల వ్యక్తికి ఉండే ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కలిగివున్నారు. 48  ఏళ్ల వ్యక్తి హృదయ స్థాయిని, 28 ఏళ్ల వ్యక్తి చర్మపు తీరును కలిగివున్నారు. 


ఇది కూడా చదవండి: ఆవు మొదలు ఆడ కుక్క వరకూ.. చెత్త పనులుచేసే ముసలోడికి అరదండాలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement