సీఫుడ్ అంటే చాలు నాలుక కోసుకుంటారు చాలామంది. అంతలా ప్రజలు ఇష్టంగా లాగించేస్తారు. కానీ ఈ సీఫుడ్ ఎక్కువగా తింటే అనేక రకాల చర్మ వ్యాధుల బారినపడటమేగాక కొలస్ట్రాల్ సమస్యను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులోనూ చేపలంటే ఇంకా ఇష్టంగా తింటారు చాలామంది. సముద్ర జాతికిచెందిన చేపలు చాలా రకాలు ఉంటాయి. ఐతే ఓ మహిళ ఇలానే ఎంతో ఇష్టంగా సముద్ర జాతికి చెందిన తిలాపియా అని చేప తింది. పాపం ఆ చేప కారణంగా ప్రాణాంతక బ్యాక్టీరియా బారిన పడి నాలుగు అవయవాలను కోల్పోయింది. దీన్ని బట్టి చూస్తే సీఫుడ్ మంచిదేనా అనే ఫీలింగ్ వస్తుంది కదా!. ఒకవేళ తినాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితరాల గురించే ఈ కథనం.
కాలిఫోర్నియాకు చెందిన 40 ఏళ్ల లారా స్థానిక మార్కెట్ నుంచి తిలాపియా అనే చేపను కొనుగోలు చేసింది. తిన్న తర్వాత ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. ఆమె ప్రాణాంతక వైబ్రోవల్ని ఫికస్ అనే బ్యాక్టీరియా బారిన పడినట్లు తెలిపారు. దీనికారణంగా ఆమె చేతి కాలి వేళ్లను తొలగించారు. చావు అంచులదాక వెళ్లి తిరిగొచ్చింది. ఎందువల్ల ఇలా జరిగిందంటే... ఆమె ఆ చేపను సరిగా ఉడికించకుండా తినడం కారణంగానే ఈ బ్యాక్టీరియా ఆమెకు సోకిందని వైద్యులు వెల్లడించారు. సముద్రపు జీవుల్లో కొంత బ్యాక్టీరియా ఉంటుందని, వాటిని బాగా ఉడికిస్తేనే పోతుందని చెబుతున్నారు.
సముద్రపు నీటిలో ఎక్కువగా ఈ బ్యాక్టీరియా ఉంటుందని చెబుతున్నారు. సదరు మహిళ లారా ఉడికి ఉడకని ఆ తిలాపియా చేపను తినడంతో తీవ్ర సెప్సిస్‌కి గురై అవయవాలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఈ బ్యాక్టీరియా రోగనిరోధక వ్యకవస్థపై తీవ్ర ప్రభావితం చూపి మనిషిని కుంగదీసేలా చేస్తుందని అన్నారు. ప్రతి ఏడాది యూఎస్‌లో దాదాపు 200 దాక వైబ్రో వల్నిఫికస్ ఇన్షెక్షన్ కేసులు నమోదవుతున్నాయిని, ప్రతి ఐదుగురులో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నట్లు వైద్యులు వెల్లడించారు.
వైబ్రో వల్నిఫికస్ అంటే..
ముడి సీఫుడ్ తినడం వల్ల వస్తుంది. అలా కాకుండా కొన్ని విపత్కర పరిస్థితుల్లో గాయాల కారణంగా కూడా వస్తుందని తెలిపారు. సీపుడ్‌ని ఉడికించకపోవడంతో దానిలో ఉండే బ్యాక్టీరియా నేరుగా శరీరంలోకి సంక్రమించి దాని ప్రతాపం చూపించడం మొదలవుతుందని చెబుతున్నారు వైద్యులు.
లక్షణాలు:
- నీళ్ల విరేచనాలు
- కడుపు తిమ్మిరి
- వికారం మరియు వాంతులు
- తీవ్ర జ్వరం
- చలి
- ప్రమాదకరమైన రక్తపోటు
- పొక్కులు, చర్మ గాయాలు
- చర్మం ఎరుపు
- నొప్పి, వాపు తదితర లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
ఎప్పుడూ రిస్క్ ఎక్కువగా ఉంటుందంటే..
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఇలాంటి బ్యాక్టీరియా బారిన పడితే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. అలాగే కాలేయం, హెమోక్రోమాటోసిస్, కిడ్నీ వైఫల్యం తదితర సమస్యలు ఉంటే ప్రాణాలు కోల్పేయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
(చదవండి: బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది కాదా..? ఆ సమస్యలు తప్పవా?)
Comments
Please login to add a commentAdd a comment