Tilapia fish
-
చేపపై యుద్ధం
ఎక్కడి జీవి అక్కడ ఉంటేనే ప్రకృతి సమతుల్యత సజావుగా ఉంటుంది. ఆఫ్రికా జలాశయాల్లో జీవించే చిన్నపాటి బ్లాక్చిన్ తిలాపియా చేప ఇప్పుడు థాయిలాండ్‌కు చుక్కలు చూపుతోంది. అక్కడి చిన్న చేపలు, రొయ్యలు, నత్త లార్వాలను గుటకాయ స్వాహా చేస్తోంది. అలా దేశ మత్స్య పరిశ్రమకు భారీ నష్టాలు తెచి్చపెడుతోంది. దాంతో వాటిపై థాయ్‌లాండ్ ఏకంగా యుద్ధమే ప్రకటించింది. తిలాపియా చేప అంతు చూసేందుకు రంగంలోకి దిగింది. వాటిని పట్టుకుంటే కేజీకి రూ.35 చొప్పున ఇస్తామంటూ జనాన్నీ భాగస్వాములను చేసింది. దాంతో జనం సైతమంతా తిలాపియా వేటలో పడ్డారు. గ్రామీణులు ప్టాస్టిక్ కవర్లు, వలలు చేతబట్టుకుని మోకాలి లోతు జలాశయాల్లో తిలాపియా వేటలో మునిగిపోయారు. దీనికి తోడు చెరువులు, కుంటలు, సరస్సుల్లో... ఇలా ఎక్కడ పడితే అక్కడ తిష్ట వేసిన తిలాపియా చేపలను తినే ఆసియాన్ సీబాస్, క్యాట్ఫి‹Ùలనూ ప్రభుత్వం వదులుతోంది. ఆడ తిలాపియా చేప ఒకేసారి 500 పిల్లలను పెడుతుంది. దాంతో వీటి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఘనా నుంచి దిగుమతి! జంతువుల దాణా, రొయ్యలు, పౌల్ట్రీ, పంది మాంసం వ్యాపారం చేసే ఓ సంస్థ దిగుమతి చేసుకున్న తిలాపియా చేపలు చివరికిలా దేశమంతటినీ ముంచెత్తినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఏం చేసినా ఒక చేప జాతిని సమూలంగా అంతం చేయడం దాదాపు అసాధ్యమని స్థానిక జలచరాల శాస్త్రవేత్త డాక్టర్ సువిత్ వుథిసుథిమెథవే అంటున్నారు. ‘‘వేగవంతమైన పునరుత్పత్తి వ్యవస్థ ఉన్న చేపలను పూర్తిగా అంతం చేయడం మరీ కష్టం. బాగా ప్రయతి్నస్తే మహా అయితే వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు’’ అని అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీఫుడ్ తినడం మంచిది కాదా? ముఖ్యంగా ఆ చేపలు తింటే..
సీఫుడ్ అంటే చాలు నాలుక కోసుకుంటారు చాలామంది. అంతలా ప్రజలు ఇష్టంగా లాగించేస్తారు. కానీ ఈ సీఫుడ్ ఎక్కువగా తింటే అనేక రకాల చర్మ వ్యాధుల బారినపడటమేగాక కొలస్ట్రాల్ సమస్యను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులోనూ చేపలంటే ఇంకా ఇష్టంగా తింటారు చాలామంది. సముద్ర జాతికిచెందిన చేపలు చాలా రకాలు ఉంటాయి. ఐతే ఓ మహిళ ఇలానే ఎంతో ఇష్టంగా సముద్ర జాతికి చెందిన తిలాపియా అని చేప తింది. పాపం ఆ చేప కారణంగా ప్రాణాంతక బ్యాక్టీరియా బారిన పడి నాలుగు అవయవాలను కోల్పోయింది. దీన్ని బట్టి చూస్తే సీఫుడ్ మంచిదేనా అనే ఫీలింగ్ వస్తుంది కదా!. ఒకవేళ తినాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితరాల గురించే ఈ కథనం. కాలిఫోర్నియాకు చెందిన 40 ఏళ్ల లారా స్థానిక మార్కెట్ నుంచి తిలాపియా అనే చేపను కొనుగోలు చేసింది. తిన్న తర్వాత ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. ఆమె ప్రాణాంతక వైబ్రోవల్ని ఫికస్ అనే బ్యాక్టీరియా బారిన పడినట్లు తెలిపారు. దీనికారణంగా ఆమె చేతి కాలి వేళ్లను తొలగించారు. చావు అంచులదాక వెళ్లి తిరిగొచ్చింది. ఎందువల్ల ఇలా జరిగిందంటే... ఆమె ఆ చేపను సరిగా ఉడికించకుండా తినడం కారణంగానే ఈ బ్యాక్టీరియా ఆమెకు సోకిందని వైద్యులు వెల్లడించారు. సముద్రపు జీవుల్లో కొంత బ్యాక్టీరియా ఉంటుందని, వాటిని బాగా ఉడికిస్తేనే పోతుందని చెబుతున్నారు. సముద్రపు నీటిలో ఎక్కువగా ఈ బ్యాక్టీరియా ఉంటుందని చెబుతున్నారు. సదరు మహిళ లారా ఉడికి ఉడకని ఆ తిలాపియా చేపను తినడంతో తీవ్ర సెప్సిస్‌కి గురై అవయవాలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఈ బ్యాక్టీరియా రోగనిరోధక వ్యకవస్థపై తీవ్ర ప్రభావితం చూపి మనిషిని కుంగదీసేలా చేస్తుందని అన్నారు. ప్రతి ఏడాది యూఎస్‌లో దాదాపు 200 దాక వైబ్రో వల్నిఫికస్ ఇన్షెక్షన్ కేసులు నమోదవుతున్నాయిని, ప్రతి ఐదుగురులో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నట్లు వైద్యులు వెల్లడించారు. వైబ్రో వల్నిఫికస్ అంటే.. ముడి సీఫుడ్ తినడం వల్ల వస్తుంది. అలా కాకుండా కొన్ని విపత్కర పరిస్థితుల్లో గాయాల కారణంగా కూడా వస్తుందని తెలిపారు. సీపుడ్ని ఉడికించకపోవడంతో దానిలో ఉండే బ్యాక్టీరియా నేరుగా శరీరంలోకి సంక్రమించి దాని ప్రతాపం చూపించడం మొదలవుతుందని చెబుతున్నారు వైద్యులు. లక్షణాలు: నీళ్ల విరేచనాలు కడుపు తిమ్మిరి వికారం మరియు వాంతులు తీవ్ర జ్వరం చలి ప్రమాదకరమైన రక్తపోటు పొక్కులు, చర్మ గాయాలు చర్మం ఎరుపు నొప్పి, వాపు తదితర లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఎప్పుడూ రిస్క్ ఎక్కువగా ఉంటుందంటే.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఇలాంటి బ్యాక్టీరియా బారిన పడితే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. అలాగే కాలేయం, హెమోక్రోమాటోసిస్, కిడ్నీ వైఫల్యం తదితర సమస్యలు ఉంటే ప్రాణాలు కోల్పేయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. (చదవండి: బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది కాదా..? ఆ సమస్యలు తప్పవా?) -
రాష్ట్రంలో గొరక చేపల హేచరీలు
సాక్షి, అమరావతి: గొరక (తిలాపియా).. అత్యంత చౌక, ముళ్లు తక్కువగా ఉండే కాలువ చేప. రోడ్ సైడ్ రెస్టారెంట్లలో విరివిగా వాడే ఈ చేపలకు అమెరికా, సింగపూర్, చైనా, యూరోపియన్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే చైనా మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో వీటి వినియోగం తక్కువే. మన రాష్ట్రం నుంచి ఎక్కువగా విదేశాలకు పిల్లెట్స్ రూపంలో ఎగుమతి చేస్తుంటారు. విదేశాల్లో ఉండే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చేపల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో ఈ చేపపిల్లల ఉత్పత్తి కోసం ముందుకొచ్చే ప్రైవేటు హేచరీలకు అనుమతివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో స్టీరింగ్ కమ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీచేశారు. మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో సీఐఎఫ్ఏ విజయవాడ రీజనల్ సెంటర్ సైంటిస్ట్ ఇన్చార్జి, ఎంపెడా విజయవాడ రీజనల్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్, స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ప్రిన్సిపల్‌తో పాటు కృష్ణాజిల్లా మానికొండలోని ఆర్‌జీసీఏలోని తిలాపియా సెంటర్ ప్రాజెక్టు మేనేజర్ సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే తిలాపియా హేచరీ ఏర్పాటు కోసం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఆనంద గ్రూప్ దరఖాస్తు చేసింది. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత హేచరీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. ఇతర జిల్లాల నుంచి కూడా ఈ హేచరీల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నారు. -
తిలాపియా.. ఏం చేయాలయా!
ఐదు దేశాల్లోని చేపలకు వైరస్ నిర్ధారణ ► భారత్ సహా ఇతర దేశాలు అప్రమత్తం ► ఎలా సోకుతుంది.. వ్యాప్తి ఎలాపై పరిశోధన ► ప్రపంచ ఆక్వా సాగులో తిలాపియాది రెండోస్థానం ► కోట్లాది మందికి ఆహారం.. లక్షల మందికి ఉపాధి 2015లో ప్రపంచవ్యాప్తంగా తిలాపియా చేపల ఉత్పత్తి - 6.4 మిలియన్ టన్నులు వీటి విలువ - 66,000 రూ.కోట్లలో సాక్షి, అమరావతి: చేపల చెరువుల్లో కల్లోలం.. తిలాపియా చేపలకు వైరస్.. పెంపకందార్ల అయోమయం.. ప్రపంచంలో ఎక్కువగా తినే చేప జాతుల్లో ఒకటైన తిలాపియాకూ వైరస్ సోకడం పెంపకందారులను కుదిపేస్తుంది. ప్రజారోగ్యానికి ప్రస్తుతానికి ఎలాంటి ముప్పులేనప్పటికీ చేపల పెంపకంలో భారీ నష్టాలతో పాటు పౌష్టికాహారానికి తిప్పలు తప్పని పరిస్థితి. ఇప్పటికే ఈ వైరస్ ఐదు దేశాలను వణికిస్తోంది. మిగతా దేశాలు అప్రమత్తంగా ఉండాలని ఇవి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇది ఎలా సోకుతుందన్నది, ఎలా వ్యాపిస్తుందీ ఇంకా నిర్ధారణ కాలేదు. ఇజ్రాయెల్ వైరస్ నిరోధానికి వ్యాక్సిన్‌ను కనిపెట్టే పనిలో పడింది. ఏఏ దేశాల్లో.. ప్రస్తుతం మూడు ఖండాలలోని ఐదు దేశాలలో తిలాపియా చేపలకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. కొలంబియా, ఈక్విడార్, ఈజిప్ట్, ఇజ్రాయెల్, థాయ్‌ల్యాండ్ దేశాలలో వైరస్‌ను గుర్తించారు. థాయ్‌ల్యాండ్‌లో ఈ వైరస్ వల్ల 90 శాతం వరకు తిలాపియా చేపలు చనిపోయాయి. ఇదే తొలిసారి... ఎక్కడి నుంచైనా చేపల్ని ఎగుమతి చేసేటప్పుడు ఐస్‌లో పెట్టి గడ్డకట్టించి మరీ పంపుతారు. ఇలా పంపే చేపల ద్వారా వైరస్ సోకుతుందా లేదా? అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే తిలాపియాకు వైరస్ రావడం ఇదే తొలిసారి. వైరస్ సోకితే... వైరస్ సోకి¯è చేపలు తిండి తక్కువÐè తింటాయి. కదలిక తక్కువగా ఉంటుంది. మచ్చలు, పుండ్లు ఏర్పడతాయి. కళ్లు మూతలు పడుతుంటాయి. చూపు మందగిస్తుంది. దీన్ని ఆర్థోమైక్సోవిరిడియా (ఇదో వైరల్ వ్యాధి. వేగంగా సోకుతుంది)కు చెందిన వైరస్‌గా నిర్ధారించారు. ప్రజారోగ్యానికి ముప్పు లేనట్లే.. ప్రస్తుతానికి ప్రజారోగ్యానికి ఎటువంటి ముప్పు లేనప్పటికీ ఈ బెడద భవిష్యత్తులో మరింత తీవ్రమవుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో తిలాపియా దిగుమతి చేసుకునే దేశాలు అప్రమత్తమయ్యాయి. ప్రమాద నివారణ చర్యలు చేపట్టాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు మెుదలుపెట్టాయి. విదేశాల నుంచి వచ్చిన చేపల్ని పరీక్షించడం, తాత్కాలిక నివారణ చర్యల్ని రూపొందించడం మొదలయ్యాయి. జీఐఈడబ్ల్యూఎస్ హెచ్చరిక... ముందస్తు హెచ్చరిక వ్యవస్థ (జీఐఈడబ్ల్యూఎస్) తిలాపియా పెంచే దేశాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తిలాపియాను పెంచే సరస్సులను, చెరువులను తరచూ తనిఖీ చేస్తూ ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు చేపట్టాలని సలహా ఇచ్చింది. తిలాపియాది రెండో స్థానం... ప్రపంచంలోనే అత్యధికంగా సాగు చేసే ఆక్వా జాతుల్లో తిలాపియా రెండోది. ఈ సాగుతో కోట్ల మందికి ఆహారంతో పాటు లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. ఏ వ్యాధిని అయినా తట్టుకుని పెరిగే ఆక్వా జాతుల్లో తిలాపియా ఒకటి. ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని బడుగు బలహీన వర్గాలకు పౌష్టికాహారాన్ని అందించడంలో ఈ చేపది కీలక పాత్ర. భారత్‌లో తిలాపియా... కొన్ని షరతులతో తిలాపియా సాగును ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశాలో సాగు చేస్తున్నారు. హెక్టార్‌కు 5 టన్నుల వరకు దిగుబడిని పొందుతున్నారు. కిలో సగటు ధర రు.150 నుంచి రూ.200 వరకు పలుకుతుంది.