కడప కల్చరల్(వైఎస్సార్ జిల్లా): సాధారణంగా ఒక అరిటాకులో ఒకరు భోజనం చేస్తారు. మరీ పెద్ద ఆకు అయితే ఇద్దరు తింటారు. ఈ ఫొటోలో కనిపిస్తున్నవారు మాత్రం ఒక్కొక్క ఆకులో ముగ్గురు చొప్పున పది అరిటాకుల్లో సామూహికంగా భోజనం చేశారు.
అన్నమయ్య జిల్లా చిట్వేలిలో డాక్టర్ దొండ్లవాగు చంద్రశేఖర్ కుటుంబానికి చెందిన 35 మంది పండుగ సందర్భంగా శనివారం కలుసుకున్నారు. దీన్ని మరపురాని కలయికగా మార్చుకోవాలని భావించారు. వెంటనే అరటితోటలో ఏపుగా పెరిగిన అరిటాకులను తీసుకొచ్చారు. పండుగ భోజనం వడ్డించుకున్నారు. ఆనందాలు పంచుకుంటూ ఆహ్లాదంగా సహపంక్తి భోజనాలు చేశారు.
చదవండి: హైదరాబాద్ అల్లుడు.. భీమవరం మామ.. 173 రకాలతో..
Comments
Please login to add a commentAdd a comment