హల్చల్ చేస్తున్న వాటర్మిలన్ బోయ్ | Young boy eats a WHOLE watermelon | Sakshi
Sakshi News home page

హల్చల్ చేస్తున్న వాటర్మిలన్ బోయ్

Published Sat, Jan 2 2016 7:15 PM | Last Updated on Sun, Sep 3 2017 2:58 PM

హల్చల్ చేస్తున్న వాటర్మిలన్ బోయ్

హల్చల్ చేస్తున్న వాటర్మిలన్ బోయ్

మెల్బోర్న్: అందరిలా ఉంటే స్పెషల్ ఏముంది అనుకున్నాడో ఏమో.. క్రికెట్ మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ కుర్రాడు వాటర్మిలన్(పుచ్చకాయ)ను మొత్తం తినేసి ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాడు. పుచ్చకాయ మొత్తం తింటే ఆశ్చర్యం ఏముంది.. మేం కూడా చాలా సార్లు తిన్నాం కదా అని అనుకుంటున్నారా.. అయితే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఆ పిల్లాడు పుచ్చకాయ తొక్కను, గింజలను దేన్నీ వదలకుండా మొత్తం తిన్నాడు. అందుకే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాడు.

శనివారం ఆస్ట్రేలియాలో బిగ్బాష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వచ్చిన ఆ చిన్నోడు తాపీగా కూర్చొని పుచ్చకాయ మొత్తాన్ని లాగించేస్తున్నాడు. అయితే మ్యాచ్ మధ్యలో కెమెరామెన్ ఆ కుర్రాడిని కవర్ చేయడంతో అందరి కళ్లు అతగాడిపై పడ్డాయి. తీక్షణంగా గమనించిన కామెంటేటర్లు.. ఓ మైగాడ్ అతను తొక్కతో సహా మొత్తం తినేస్తున్నాడు అంటూ కామెంటరీ అందుకున్నారు. రెండు మహిళా జట్ల మధ్య జరుగుతున్న ఆ మ్యాచ్ ఫలితం కంటే కూడా, కుర్రాడు ఆ పుచ్చకాయ మొత్తం అలాగే తినేస్తాడా అనే ఆసక్తి ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది.

కాసేపటికే ట్విట్టర్లో 'ది వాటర్ మిలన్ బోయ్' అనే హ్యష్ట్యాగ్ హల్ చల్ చేసింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిన పింక్ కలర్ టీ షర్ట్ ధరించిన ఆ బుడతడు ఎవరనేది మాత్రం తెలియరాలేదు. క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా కెమెరా కంట్లో పడటానికి నానా పాట్లు పడే ప్రేక్షక లోకం ఈ చిన్నోడిని చూసి షాక్ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement