watermelon boy
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు!
మెల్ బోర్న్: పుచ్చకాయ బాలుడు(వాటర్ మెలన్ బాయ్) సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. 10 ఏళ్ల ఆస్ట్రేలియా బాలుడు మిచెల్ స్కెహిబెసీ పుచ్చకాయను తొక్కతో సహా ఆబగా తింటూ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 'ఫస్ట్ వైరల్ హిట్ ఆఫ్ ది 2016'గా చక్కెర్లు కొడుతోంది. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో శనివారం మెల్ బోర్న్ స్టార్స్, మెల్ బోర్న్ రెనెగాడ్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూస్తూ మిచెల్ లైవ్ టీవీ కెమెరాకు చిక్కాడు. పుచ్చకాయను తొక్కతో సహా తినేస్తున్న అతడిని చూసి కామెంటేటర్లు అవాక్కయ్యారు. 'అతడిని చూడండి తొక్కతో సహా పుచ్చకాయ లాగించేస్తున్నాడు' అంటూ కామెంట్లు చేయడంతో అందరూ అతడిని ఆసక్తిగా గమనించారు. కెమెరా కంటపడగానే అతడు రెట్టించిన ఉత్సాహంతో పుచ్చకాయను కొరకడం మొదలు పెట్టాడు. ఈ వీడియో వాటర్ మెలన్ బాయ్ హేష్ ట్యాగ్ తో ట్విటర్ లో ట్రెండవుతోంది. ట్విటర్ లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. 'ఫస్ట్ ఇంటర్నెట్ హీరో ఆఫ్ 2016'గా పీపుల్స్ మేగజీన్ వర్ణించింది. అయితే తొక్కతో పుచ్చకాయ తినడం అంత ఈజీ కాదని బీబీసీతో మిచెల్ స్కెహిబెసీ చెప్పాడు. చాలా ప్రయత్నం చేసిన తర్వాతే ఇలా తినగలుగుతున్నానని తెలిపాడు. రెండేళ్ల ప్రాయం నుంచే తొక్కతో సహా పుచ్చకాయ తింటున్నానని వెల్లడించాడు. మిచెల్ పుచ్చకాయ తింటున్న దృశ్యాన్ని ఈఎస్పీఎన్ 'ప్లే ఆఫ్ ది డే'గా ప్రకటించింది. అయితే ఈ పురస్కారం అందుకునేందుకు అతడు నిరాకరించాడు. 'నేను నిజంగా హీరోను కాదు. నేనో సాధారణ బాలుడిని' అంటూ మిచెల్ వినయంగా చెప్పాడు. -
హల్చల్ చేస్తున్న వాటర్‌మిలన్ బోయ్
మెల్బోర్న్: అందరిలా ఉంటే స్పెషల్ ఏముంది అనుకున్నాడో ఏమో.. క్రికెట్ మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ కుర్రాడు వాటర్‌మిలన్(పుచ్చకాయ)ను మొత్తం తినేసి ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాడు. పుచ్చకాయ మొత్తం తింటే ఆశ్చర్యం ఏముంది.. మేం కూడా చాలా సార్లు తిన్నాం కదా అని అనుకుంటున్నారా.. అయితే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఆ పిల్లాడు పుచ్చకాయ తొక్కను, గింజలను దేన్నీ వదలకుండా మొత్తం తిన్నాడు. అందుకే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. శనివారం ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వచ్చిన ఆ చిన్నోడు తాపీగా కూర్చొని పుచ్చకాయ మొత్తాన్ని లాగించేస్తున్నాడు. అయితే మ్యాచ్ మధ్యలో కెమెరామెన్ ఆ కుర్రాడిని కవర్ చేయడంతో అందరి కళ్లు అతగాడిపై పడ్డాయి. తీక్షణంగా గమనించిన కామెంటేటర్లు.. ఓ మైగాడ్ అతను తొక్కతో సహా మొత్తం తినేస్తున్నాడు అంటూ కామెంటరీ అందుకున్నారు. రెండు మహిళా జట్ల మధ్య జరుగుతున్న ఆ మ్యాచ్ ఫలితం కంటే కూడా, కుర్రాడు ఆ పుచ్చకాయ మొత్తం అలాగే తినేస్తాడా అనే ఆసక్తి ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. కాసేపటికే ట్విట్టర్లో 'ది వాటర్ మిలన్ బోయ్' అనే హ్యష్‌ట్యాగ్ హల్ చల్ చేసింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిన పింక్ కలర్ టీ షర్ట్ ధరించిన ఆ బుడతడు ఎవరనేది మాత్రం తెలియరాలేదు. క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా కెమెరా కంట్లో పడటానికి నానా పాట్లు పడే ప్రేక్షక లోకం ఈ చిన్నోడిని చూసి షాక్ అవుతున్నారు.