సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు! | 'Watermelon boy' finds fame as 1st 'Viral Hit of 2016' | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు!

Published Mon, Jan 4 2016 6:00 PM | Last Updated on Sun, Sep 3 2017 3:05 PM

సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు!

సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు!

మెల్ బోర్న్: పుచ్చకాయ బాలుడు(వాటర్ మెలన్ బాయ్) సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. 10 ఏళ్ల ఆస్ట్రేలియా బాలుడు మిచెల్ స్కెహిబెసీ పుచ్చకాయను తొక్కతో సహా ఆబగా తింటూ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 'ఫస్ట్ వైరల్ హిట్ ఆఫ్ ది 2016'గా చక్కెర్లు కొడుతోంది.

మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో శనివారం మెల్ బోర్న్ స్టార్స్, మెల్ బోర్న్ రెనెగాడ్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూస్తూ మిచెల్ లైవ్ టీవీ కెమెరాకు చిక్కాడు. పుచ్చకాయను తొక్కతో సహా తినేస్తున్న అతడిని చూసి కామెంటేటర్లు అవాక్కయ్యారు. 'అతడిని చూడండి తొక్కతో సహా పుచ్చకాయ లాగించేస్తున్నాడు' అంటూ కామెంట్లు చేయడంతో అందరూ అతడిని ఆసక్తిగా గమనించారు. కెమెరా కంటపడగానే అతడు రెట్టించిన ఉత్సాహంతో పుచ్చకాయను కొరకడం మొదలు పెట్టాడు. ఈ వీడియో వాటర్ మెలన్ బాయ్ హేష్ ట్యాగ్ తో ట్విటర్ లో ట్రెండవుతోంది. ట్విటర్ లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. 'ఫస్ట్ ఇంటర్నెట్ హీరో ఆఫ్ 2016'గా పీపుల్స్ మేగజీన్ వర్ణించింది.

అయితే తొక్కతో పుచ్చకాయ తినడం అంత ఈజీ కాదని బీబీసీతో మిచెల్ స్కెహిబెసీ చెప్పాడు. చాలా ప్రయత్నం చేసిన తర్వాతే ఇలా తినగలుగుతున్నానని తెలిపాడు. రెండేళ్ల ప్రాయం నుంచే తొక్కతో సహా పుచ్చకాయ తింటున్నానని వెల్లడించాడు. మిచెల్ పుచ్చకాయ తింటున్న దృశ్యాన్ని ఈఎస్పీఎన్ 'ప్లే ఆఫ్‌ ది డే'గా ప్రకటించింది. అయితే ఈ పురస్కారం అందుకునేందుకు అతడు నిరాకరించాడు. 'నేను నిజంగా హీరోను కాదు. నేనో సాధారణ బాలుడిని' అంటూ మిచెల్ వినయంగా చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement