
నగర శివారు నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ శుక్రవారం గోవులు, గేదెలకు పూజలు నిర్వహించి పశు సంక్రాంతిని ప్రారంభించారు.

గుజరాత్, హరియాణా, పంజాబ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన గేదెలు, ఆవులను అందంగా ముస్తాబు చేసి అమ్మకానికి పెట్టారు.

వీటి ధరలు రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు పలికాయి. వట్టినాగులపల్లికి చెందిన ప్రమోద్ అనే పాల వ్యాపారి దులియా, జాఫ్రి జాతికి చెందిన 10 గేదెలను ఒక్కోదాన్ని రూ.2.51 లక్షల చొప్పున కొనుగోలు చేశారు.



















































