‘యానిమల్‌’ మెషీన్‌ గన్‌ సీక్రెట్‌ ఇదే.. | How Was 500 kg Machine Gun Motorcycle In Animal Prepared And Know What Is The Secret Behind It - Sakshi
Sakshi News home page

Animal Movie Machine Gun Secret: ‘యానిమల్‌’ మెషీన్‌ గన్‌ సీక్రెట్‌ ఇదే..

Published Tue, Dec 19 2023 1:38 PM | Last Updated on Tue, Dec 19 2023 3:07 PM

How was Machine Gun of Film Animal Prepared - Sakshi

ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్  నటించిన ‘యానిమల్’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. 2023,  డిసెంబర్ ఒకటిన  థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి, గత రికార్డులను బద్దలు కొట్టింది.

భారత్‌లో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన 10 చిత్రాల జాబితాలో ‘యానిమల్’ చేరింది. రూ. 100 కోట్లతో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 835.87 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి ఘన విజయాన్ని అందుకుంది. 

ఈ సినిమాలో రణబీర్ ‘మెషిన్ గన్’ను ఉపయోగించే దృశ్యం ప్రేక్షకులను అమితంగా అలరిస్తోంది. ఈ మెషిన్ గన్  ఎలా తయారు చేశారనే ‍ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. కొందరు ఇది నిజమైన మెషీన్ గన్ కాదని, ఇదంతా వీఎఫ్‌ఎక్స్‌తో రూపొందించిన అద్భుతం అని అంటున్నారు. అయితే దీనిలో నిజం లేదని చిత్ర యూనిట్‌ చెబుతోంది. 

ఈ మెషీన్ గన్ గురించి ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ మీడియాతో మాట్లాడుతూ ఈ మెషిన్ గన్ స్టీల్‌తో తయారు చేశామని, దీనిని తయారీకి ఐదు నెలలు పట్టిందని తెలిపారు. దీనిని తయారు చేయడానికి వందమంది శ్రమించారని, 500 కిలోల స్టీల్‌ను ఉపయోగించామని తెలిపారు.

ఈ గన్ తయారు చేస్తున్నప్పుడు దీనికి సంబంధించిన సీన్‌  అందరినీ ఇంతలా ఆకట్టుకుంటుందని అనుకోలేదని అన్నారు. సినిమా దర్శకుడు సందీప్‌  ఆలోచనలకు అనుగుణంగా ఈ గన్‌ రూపొందించామన్నారు. మొదట సందీప్‌ పెద్ద మెషీన్‌ గన్‌ గురించి చెప్పారని, అంత భారీ గన్‌ రూపకల్పనకు నాలుగైదు నెలలు పడుతుందని చెప్పానన్నారు. మెషీన్‌ గన్‌ తయారీలో ఎంతో శ్రద్ద చూపించామని, వినూత్నంగా దానిని తీర్చిదిద్దామని తెలిపారు. ఆ మెషీన్‌ గన్‌ బరువు 500 కిలోలని సురేష్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement