Cinima
-
కుంభమేళా మోనాలిసా స్టన్నింగ్ లుక్!
పూసల దండలు అమ్మేందుకు కుంభమేళాకు వచ్చిన మోనాలిసా వాటిని అమ్మిందో లేదోగానీ, తన నీలికళ్ల అందాలతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది. ఒకవైపు సినిమా అవకాశాలు, మరోవైపు ప్రకటనల్లో నటించే అవకాశాలు ఆమెకు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న మోసాలిసా ఫొటోలను చూస్తే ఈమె కుంభమేళాలో పూసల దండలు విక్రయించేందుకు వచ్చిన మోనాలిసానేనా అనేలా ఉన్నాయి.మోనాలిసా ప్రస్తుతం తన తొలి బాలీవుడ్ డెబ్యూకు సిద్దమవుతోంది. ఇందుకోసం ఆమె ఒకవైపు నటన నేర్చుకుంటూనే, మరోవైపు అక్షరాలు కూడా దిద్దుతోంది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా దర్శకత్వంలో ఆమె నటించనుంది. తాజాగా సనోజ్ మిశ్రా, మోనాలిసాలు ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు కేరళ చేరుకున్నారు. ఈ నేపధ్యంలో బయటకు వచ్చిన కొన్ని ఫొటోలు ఆమె అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.కేరళలో జరిగిన ఒక ఈవెంట్లో పాల్గొన్న ఆమె గులాబీరంగు లెహంగాలో ఎంతో అందంగా కనిపిస్తోంది. ఆమె కురులు కూడా ఎంతో అందంగా ఉన్నాయి. కొద్దిపాటి మేకప్‌తో మోసాలిసా సహజ సౌందర్యరాశిలా నవ్వుతూ కనిపిస్తోంది. కోట్ల రూపాయల ఖరీదైన కారులో ఆమె ఈవెంట్‌కు హాజరయ్యింది. ఆ సమయంలో ఆమె అత్యంత ఖరీదైన వజ్రాల హారం కూడా ధరించింది. కార్యక్రమానికి హాజరైన అభిమానులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు తెగ తాపత్రయపడ్డారు.ఇది కూడా చదవండి: రాష్ట్రపతి పాలన తొలిగా ఏ రాష్ట్రంలో ఎందుకు విధించారు? -
కుంభమేళా మోనాలిసా.. ఢిల్లీలో సినిమా, కేరళలో ప్రకటన షూటింగ్?
యూపీలో ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా పలువురి తలరాతలను మార్చేసింది. అటువంటి వారిలో మోనాలిసా ఒకరు. కుంభమేళాకు పూసల దండలు విక్రయించేందుకు వచ్చిన ఆమె రాత్రికిరాత్రే ఎంతో ఫేమస్ అయిపోయింది. జనం ఆమెను చూసేందుకు గుమిగూడుతుండటంతో ఆమె తండ్రి మోనాలిసాను మధ్యప్రదేశ్‌లోని తమ ఇంటికి తిరిగి పంపించేశాడు. అయితే అక్కడకు కూడా ఆమె అభిమానులు తరలివస్తున్నారు.కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసా నటిస్తున్న తొలిచిత్రం షూటింగ్ ఫిబ్రవరి 12న ఢిల్లీలోని ఇండియాగేట్ దగ్గర ప్రారంభం కానున్నదని తెలుస్తోంది. అయితే షూటింగ్ తేదీ విషయమై ఇంకా నిర్థారణ కాలేదని సమాచారం. ఇదిలావుండగా ఇంతలో ఆమెను ఒక ప్రముఖ జ్యూలయరీ కంపెనీ కలుసుకున్నదని, ఆమెను ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిచేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.మోనాలిసా నటిస్తున్న సినిమాకు చెందిన చిత్రబృందం మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ జ్యూయలరీ కంపెనీ మోనాలిసాను సంప్రదించిందని, ఆమెతో వారు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపింది. ఇందుకోసం వారు రూ.15 లక్షలకు కూడా ఇచ్చారని చిత్రబృందం పేర్కొంది. ఈ కంపెనీకి సంబంధించిన ప్రకటన షూటింగ్ ఫిబ్రవరి 14న మొదలుకానున్నదని, ఇందుకోసం మోనాలిసా కేరళ వెళ్లనున్నారని వివరించింది.ఇది కూడా చదవండి: Mahakumbh: మాఘ పూర్ణిమకు సన్నాహాలు.. క్రౌడ్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి -
నటి నుంచి సీఎం వరకూ.. ‘అమ్మ’ జీవితం సాగిందిలా!
పలువురు మహిళలు దేశ రాజకీయాల్లో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. చరిత్రను పరిశీలిస్తే.. సరోజినీ నాయుడు, ఇందిరా గాంధీ, సుచేతా కృపలానీ, సుష్మా స్వరాజ్, ప్రతిభా పాటిల్, మమతా బెనర్జీ, మాయావతి, ప్రియాంక గాంధీ సహా ఎందరో మహిళల పేర్లు దేశ ప్రజల నోళ్లలో మెదులుతాయి. దేశ రాజకీయాల్లో సత్తా చాటుతున్న నటీమణుల విషయానికొస్తే స్మృతి ఇరానీ, నుస్రత్ జహాన్, జయప్రద హేమమాలిని తదితరుల పేర్లు వినవస్తాయి. అయితే అమోఘమైన ప్రజాదరణ పొందిన మహిళా నేతల జాబితాను పరిశీలిస్తే ఒక నాటి నటీమణి, ఆ తరువాత తమిళనాట సీఎంగా సత్తా చాటిన జయలలిత తప్పుకుండా గుర్తుకువస్తారు. తమిళనాడు ప్రజలు జయలలితను ‘అమ్మా’ అని పిలిచేంతటి ఆదరణ ఆమె సొంతం చేసుకున్నారు. ఈరోజు(ఫిబ్రవరి 24) దివంగత సీఎం జయలలిత జన్మదినం. 1948 ఫిబ్రవరి 24న జన్మించిన జయలలిత జీవితానికి సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ నేపధ్యం జయలలిత.. ప్రస్తుతం కర్ణాటకలో భాగంగా ఉన్న మైసూర్‌లోని మాండ్య జిల్లాలోని పాండవపురా తాలూకాలోని మేలుర్కోట్ గ్రామంలో అయ్యర్ కుటుంబంలో జన్మించారు. జయలలిత అసలు పేరు ‘కోమలవల్లి’. ఆమె తండ్రి పేరు జయరామ్. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. ఆమె తల్లి పేరు వేదవల్లి. జయలలిత తల్లి వేదవల్లి ప్రముఖ నటిగా పేరు సంపాదించారు. బాల్యంలో జయలలితకు సినిమాలపై అంతగా ఆసక్తి లేదు. ఆమె ఎప్పుడూ నటి కావాలని కోరుకోలేదు. బలవంతంగా ఆమె సినీ రంగంలోకి వచ్చారని చెబుతుంటారు. సినీ జీవితం చదువులో జయలలిత ఎంతో ప్రతిభ కనబరిచారు. జయలలిత తండ్రి ఆమెను లాయర్‌గా చూడాలనుకున్నారు. అయితే ఆమె తల్లి.. జయలలితను చిన్నతనంలోనే సినీ రంగంలోకి తీసుకువచ్చారు. జయలలిత కేవలం తన 15 ఏళ్ల వయసులోనే అడల్ట్ సినిమాలో నటించారు. ఆమె సినీ జీవితం అక్కడి నుంచే మొదలైంది. ఆమె సినిమాల్లో తన అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. జయలలిత తన కెరీర్లో మొత్తం 85 సినిమాలు చేయగా, అందులో 80 సినిమాలు అమోఘ విజయం సాధించాయి. సినిమాల్లో స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించిన తొలి నటిగా ఆమె గుర్తింపు పొందారు. రాజకీయ ప్రయాణం నాటి రాజకీయ నేత ఎంజీ రామచంద్రన్ నటి జయలలితను సినిమాల నుంచి రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ఎంజీఆర్, జయలలిత ప్రేమించుకున్నారని కానీ పెళ్లి చేసుకోలేదని, పైగా వారు తమ బంధాన్ని ఏనాడూ బహిరంగపరచలేదని చెబుతుంటారు. జయలలిత 1982లో ఎంజీ రామచంద్రన్‌తో పాటు అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నా డీఎంకే)లో సభ్యురాలయ్యారు. నాటి నుంచే ఆమె రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1984 నుండి 1989 వరకు జయలలిత తమిళనాడు నుండి రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరించారు. ఎంజీఆర్ మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. సాధించిన విజయాలు తమిళనాడులో జయలలిత ప్రజాదరణ పొందిన నటిగా మాత్రమే కాకుండా మహిళా నేతగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. ఆరు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రి కావడం ఆమె రాజకీయాల్లో సాధించిన అమోఘ విజయంగా చెబుతుంటారు. భ్రూణహత్యల నివారణకు ఆమె ‘క్రెడిల్ టు బేబీ స్కీమ్’ను ప్రారంభించారు. ‘అమ్మ’ బ్రాండ్ ప్రారంభించి, ఈ పేరుతో దాదాపు 18 ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేశారు. అమ్మ పేరుతో అమలయిన ఈ పథకాలు పూర్తిగా ఉచితం. లేదా భారీగా రాయితీలు అందించేవి. పట్టణ పేదలకు ఒక్క రూపాయికే ఆహారం అందించేందుకు ఆమె ‘అమ్మ క్యాంటీన్’ను ప్రారంభించారు. జయలలిత తన 68వ ఏట 2016 డిసెంబర్ 5న కన్నుమూశారు. -
‘యానిమల్’ మెషీన్ గన్ సీక్రెట్ ఇదే..
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. 2023, డిసెంబర్ ఒకటిన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి, గత రికార్డులను బద్దలు కొట్టింది. భారత్‌లో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన 10 చిత్రాల జాబితాలో ‘యానిమల్’ చేరింది. రూ. 100 కోట్లతో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 835.87 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రణబీర్ ‘మెషిన్ గన్’ను ఉపయోగించే దృశ్యం ప్రేక్షకులను అమితంగా అలరిస్తోంది. ఈ మెషిన్ గన్ ఎలా తయారు చేశారనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. కొందరు ఇది నిజమైన మెషీన్ గన్ కాదని, ఇదంతా వీఎఫ్ఎక్స్తో రూపొందించిన అద్భుతం అని అంటున్నారు. అయితే దీనిలో నిజం లేదని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ మెషీన్ గన్ గురించి ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ మీడియాతో మాట్లాడుతూ ఈ మెషిన్ గన్ స్టీల్‌తో తయారు చేశామని, దీనిని తయారీకి ఐదు నెలలు పట్టిందని తెలిపారు. దీనిని తయారు చేయడానికి వందమంది శ్రమించారని, 500 కిలోల స్టీల్‌ను ఉపయోగించామని తెలిపారు. ఈ గన్ తయారు చేస్తున్నప్పుడు దీనికి సంబంధించిన సీన్ అందరినీ ఇంతలా ఆకట్టుకుంటుందని అనుకోలేదని అన్నారు. సినిమా దర్శకుడు సందీప్ ఆలోచనలకు అనుగుణంగా ఈ గన్ రూపొందించామన్నారు. మొదట సందీప్ పెద్ద మెషీన్ గన్ గురించి చెప్పారని, అంత భారీ గన్ రూపకల్పనకు నాలుగైదు నెలలు పడుతుందని చెప్పానన్నారు. మెషీన్ గన్ తయారీలో ఎంతో శ్రద్ద చూపించామని, వినూత్నంగా దానిని తీర్చిదిద్దామని తెలిపారు. ఆ మెషీన్ గన్ బరువు 500 కిలోలని సురేష్ తెలిపారు. -
భార్యాభర్తల మధ్య ఆత్మ ప్రవేశిస్తే 'తంతిరం' చూడాల్సిందే
శ్రీమతి కాండ్రగుల లావణ్య రాణి సమర్పణలో 'సినిమా బండి ప్రొడక్షన్స్' పతాకంపై శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ జంటగా నటించిన చిత్రం 'తంతిరం'. ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ కాండ్రగుల (SK) నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: Jailer Review: రజినీకాంత్ 'జైలర్' ట్విటర్ రివ్యూ) ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ కాండ్రగుల మాట్లాడుతూ ' ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఇది హారర్ అంశాలతో కూడిన కుటుంబ కథ చిత్రం. భార్య భర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే మా 'తంతిరం' చిత్రం చూడాల్సిందే. మా చిత్రం కేరళ ప్రాంతాల్లో అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్నాము, షూటింగ్ అంతా పూర్తి అయ్యింది. ప్రస్తుతానికి నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉంది. ఈరోజు మా చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశాం. త్వరలోనే టీజర్, ట్రైలర్‌తో మీ ముందుకు వస్తాం' అని నిర్మాత శ్రీకాంత్ తెలిపారు. -
‘ఆది పురుష్’పై విమర్శల బాణం ఎక్కుపెట్టిన అఖిల భారత హిందూ మహాసభ!
‘ఆదిపురుష్’ సినిమా సనాతన ధర్మాన్ని అవమానించినట్లుగా ఉంది. శ్రీరాముడు, సీతామాత, హనుమంతుడు పాత్రలను తప్పుగా చిత్రీకరించారు. అసంబద్ధ డైలాగులతో పవిత్ర భావాలను వక్రీకరించారు. అందుకే ‘ఆది పురుష్’ను బ్యాన్ చేయాలి’ అంటూ అఖిల భారత హిందూ మహాసభ ఆందోళన వ్యక్తం చేసింది. నటుడు ప్రభాస్ నటించిన ‘ఆది పురుష్’ సినిమాను పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ‘ఆది పురుష్’ సినిమా స్టార్కాస్ట్, డైలాగ్ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్లపై అఖిల భారత హిందూ మహాసభ విమర్శల బాణం సంధించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసింది. అఖిల భారత హిందూ మహాసభ ‘ఆదిపురుష్’ సినిమా సనాతన ధర్మాన్ని ఘోరంగా అవమానించిందని ఆరోపించింది. రామాయణంలోని ఎంతో ఉన్నతమైన పాత్రలను ‘ఆదిపురుష్’ సినిమాలో దిగజార్చారని ఆరోపించింది. ఈ సినిమా కారణంగా రామాయణంపై అందరిలో తప్పుడు భావాలు ఏర్పడేందుకు అవకాశం ఉందని, ముఖ్యంగా పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని ఆరోపించింది. అందుకే ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు అఖిల భారత హిందూ మహాసభ యూపీలోని హజరత్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆదిపురుష్ సినిమాను ఉత్తరప్రదేశ్‌లో బ్యాన్ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆర్జేడీ వినతిపత్రం సమర్పించింది. ఈ సినిమాలో వినియోగించిన భాష గౌరవప్రదంగా లేదని ఆర్జేడీ ఆరోపించింది. సనాతన ధర్మంపై మక్కువ గలవారి హృదయాలను ఈ సినిమా గాయపరిచిందని ఆ లేఖలో ఆర్జేడీ పేర్కొంది. ఇది కూడా చదవండి: ‘ఆది పురుష్’ను చీల్చిచెండాడిన ‘టీవీ రాముడు’ -
ఈ అత్యుత్సాహం మానుకోండి : సల్మాన్ ఖాన్
న్యూఢిల్లీ: సాధారణంగా ఫ్యాన్స్.. తమ అభిమాన హీరో సినిమా షోను మొదటి రోజు... మొదటి షోను చూడటానికి ఇష్టపడుతుంటారు. సినిమా హాల్లో పేపర్ కటింగ్స్, అల్లరి చేయడం, విజిల్స్ వేయడం చేస్తుంటారు. మరికొందరు పూలు చల్లుతూ.. ఫ్లెక్సీలపై పాలను పోసి తమ అభిమానాన్ని చాటుకుంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే, కొందరు అభిమానులు మాత్రం అత్యుత్సాహాం ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటన న్యూఢిల్లీలోని స్థానిక సినిమా థియేటర్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ కొత్త సినిమా.. ‘ఆంటీమ్ దిఫైనల్ ట్రూత్’ సినిమా విడుదలైంది. ఈ క్రమంలో కొందరు అభిమానులు థియేటర్లో క్రాకర్లను కాల్చారు. అంతటితో ఆగకుండా.. గట్టిగా కేకలు వేస్తూ పక్కవారికి ఇబ్బందులకు గురిచేశారు. ఈ హఠాత్పరిణామంతో.. థియేటర్‌కు హజరైన చాలా మంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ట్వీటర్ వేదికగా స్పందించారు. థియేటర్లలో ఇలాంటి పనులు చేయకూడదని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పనులతో.. మీ ప్రాణాలతోపాటు.. తోటివారి ప్రాణాలకు కూడా ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు. అదే విధంగా.. ఫ్యాన్స్ క్రాకర్స్ తీసుకోని సినిమాహల్లోకి ప్రవేశించకుండా సెక్యురీటి సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా కొందరు అభిమానులు ‘ఆంటీమ్ దిఫైనల్ ట్రూత్’ సినిమా ఫ్లెక్సీపై పాలాభిషేకం నిర్వహించారు. దీనిపై కూడా సల్మాన్ ట్వీటర్ వేదికగా స్పందించారు. ‘ కొంత మందికి తాగటానికి సరైన మంచి నీరు దొరకడం లేదు.. మీరు పాలను ఈ విధంగా వృథా చేయకూడదని’ పేర్కొన్నారు. ఈ విధంగా.. పాలను వృథా చేసే బదులు అవసరమైన పిల్లలకు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ట్వీట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
దేవుడా..! ఏకంగా స్మార్ట్‌ఫోన్‌తో సినిమానే తీశారే..!
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో ఏళ్లతరబడి నుంచి పాతుకుపోయినా యాపిల్, శాంసంగ్ కంపెనీలకు వన్‌ప్లస్ గట్టి పోటీనే ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్ భారీ ఆదరణను నోచుకున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ను ఇట్టే కట్టిపడేశాయి. ఒకానొక సమయంలో వన్‌ప్లస్ యూజర్లు తీసిన ఫోటోలను కంపెనీ బిల్బోర్డ్స్గా కూడా వాడుకుంది. తాజాగా వన్‌ప్లస్ 9 ప్రొ స్మార్ట్‌ఫోన్‌తో ఏకంగా సినిమానే చిత్రించారు. మొత్తం షూట్ వన్‌ప్లస్ 9ప్రోతోనే..! విక్రమాదిత్య మోట్వానేకు చెందిన ఆందోళన్ ప్రొడక్షన్, బిగ్ బ్యాడ్ వోల్ఫ్ స్టూడియోస్, ఆడ్ అండ్ ఈవెన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా 2024 అనే ఫీచర్ ఫిల్మ్‌ను రూపొందించారు. 60 నిమిషాలపాటు సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ పూర్తిగా వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో 8కే రికార్డింగ్‌లో చిత్రించారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలైంది.ఈ సినిమాలోని విజువల్స్ ప్రొఫెషనల్ సినిమా కెమెరాతో తీసినట్లుగానే అద్భుతంగా వచ్చాయి. చదవండి: కేవలం రూ.10 వేలకే..అదిరిపోయే ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు ఇవే -
అంతరిక్షంలో సినిమా షూటింగ్ సక్సెస్
మాస్కో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 12 రోజుల పాటు సినిమా షూటింగ్ విజయవంతంగా ముగించుకుని రష్యా సినిమా బృందం తిరిగి భూమికి చేరుకుంది. ఒలెగ్ నోవిట్స్కీ, యులియా పెరెసిల్డ్, క్లిమ్ షిపెంకోలతో కూడిన సోయుజ్ అంతరిక్ష నౌక ఆదివారం కజఖ్‌స్తాన్‌లోని మైదాన ప్రాంతంలో దిగింది. ఆ వెంటనే యులియా, నోవిట్స్కీలు సీట్లలో ఉండగానే 10 నిమిషాలపాటు సినిమాలోని కొన్ని దృశ్యాలను చిత్రీకరించారు. అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఆ ముగ్గురూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని అధికారులు తెలిపారు. దర్శకుడు షిపెంకో చాలెంజ్ అనే సినిమా చిత్రీకరణ కోసం నటి యులియాతో కలిసి ఈ నెల 5వ తేదీన అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. సర్జన్ పాత్ర పోషిస్తున్న యులియా అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఓ వ్యోమగామికి అత్యవసర చికిత్స చేసే సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. అనారోగ్యం బారిన పడిన వ్యోమగామి పాత్రను ఇప్పటికే 6 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉన్న నోవిట్స్కీ పోషిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోందని, సినిమా రిలీజ్ ముహూర్తం ఖరారు కాలేదని సమాచారం. -
ఆన్లైన్ టికెట్ విధానంపై మంత్రి పేర్ని నాని సమీక్ష
విజయవాడ: ఆన్లైన్ పద్దతిలో సినిమా టికెక్టు అమ్మాలనే ప్రక్రియ 2002 నుంచి ఉందని సమాచారశాఖ మంత్రి పేర్నినాని అన్నారు. ఇందులో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల్ని ప్రభుత్వం నేడు చర్చకు పిలిచిందన్నారు. ఆన్లైన్ టికెట్ విధానంపై విజయవాడలో మంత్రి పేర్ని నాని సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతోపాటు దిల్ రాజు, డీఎన్వీ ప్రసాద్, ఆది శేషగిరి రావు, డీవీవీ దానయ్య హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఆన్లైన్ టికెట్ వ్యవస్థ, కరోనా వలన సిని పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఎగ్జిబిటర్ల సమస్యలు, నిర్మాతల సమస్యలు అన్నింటిని ప్రభుత్వం తరపున తాము నమోదు చేసుకున్నామని తెలిపారు. త్వరలోనే సినీ పరిశ్రమ సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించిన తర్వాత పరిష్కారం తీసుకుంటామన్నారు. ఆన్లైన్ టికెట్ వ్యవస్థ కు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధులు సానుకూలంగా ఉన్నారని, మళ్ళీ ఇంకోసారి సినిమా ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు సమావేశం అవుదామని తెలిపినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ ఎప్పుడు కూడా సాధారణ ప్రేక్షకులకు వినోదం అందుబాటులో ఉంచేలా చేస్తారని వెల్లడించారు. చదవండి: Youngest MPTC: చిన్న వయసులోనే.. ‘ఎంపీటీసీ’! -
సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వ నిర్ణయం భేష్
సాక్షి, అమరావతి/తెనాలి: మధ్య తరగతి ప్రజలకు సినిమా భారం కాకూడదని టికెట్ల ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శనివారం ఓ ప్రకటనలో అభినందించారు. దీన్ని రాజకీయ నిర్ణయంగా పరిగణించడం రాజకీయ నాయకుల అజ్ఞానానికి నిదర్శనమని తెలిపారు. ఆహ్వానించదగ్గ పరిణామం: దిలీప్‌రాజా థియేటర్లలో టికెట్ ధరలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఆహ్వానించదగిన పరిణామమని, ప్రేక్షకులకు ఎంతో ఊరటనిచ్చే అంశమని ‘మా’ ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్‌రాజా గుంటూరు జిల్లా పెదరావూరులో చెప్పారు. చదవండి: ప్రభుత్వ ధరలకే సినిమా టికెట్లు అమ్మాలి సినిమా: ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయాలు తగవు -
రికవరీ బాటలో మీడియా, వినోదం
సాక్షి, హైదరాబాద్ ,బిజినెస్ బ్యూరో: మీడియా, వినోద రంగం దేశంలో ఈ ఏడాది వృద్ధిని నమోదు చేస్తుందని ఫిక్కీ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్త నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2019తో పోలిస్తే పరిశ్రమ గతేడాది మహమ్మారి కారణంగా 24 శాతం తగ్గి రూ.1.38 లక్షల కోట్లు నమోదు చేసింది. 2017 స్థాయికి చేరింది. 2020 చివరి త్రైమాసికంలో చాలా విభాగాల్లో ఆదాయాల్లో రికవరీ నమోదైంది. 2021లో మీడియా, వినోద రంగం 25 శాతం వృద్ధి చెంది రూ.1.73 లక్షల కోట్లను తాకుతుంది. ఏటా సగటున 13.7 శాతం అధికమై 2023 నాటికి రూ.2.23 లక్షల కోట్లకు చేరుతుంది. 2025 నాటికి మీడియా, వినోద రంగం ఆదాయం రూ.2.68 లక్షల కోట్లకు చేరనుంది. జోరుగా ఓటీటీ.. పరిశ్రమలో టెలివిజన్ విభాగం అగ్రస్థానంలో కొనసాగుతోంది. గతేడాది 2.8 కోట్ల మంది కస్టమర్లు 5.3 కోట్ల ఓటీటీ చందాలను కట్టారు. దీంతో డిజిటల్ సబ్స్క్రిప్షన్ ఆదాయాలు 49 శాతం పెరిగాయి. 2019లో 1.05 కోట్ల కస్టమర్లు ఓటీటీ సబ్స్క్రిప్షన్లు చేశారు. ప్రధానంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మూలంగా గతేడాది వృద్ధికి తోడైంది. ఐపీఎల్ ప్రసార హక్కులు స్టార్ గ్రూప్‌నకు ఉన్న సంగతి తెలిసిందే. ఇక కంటెంట్ కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో పెట్టుబడులు పెద్ద ఎత్తున చేశాయి. ప్రాంతీయ భాషల్లో ఉత్పత్తులను తీసుకొచ్చాయి. డేటా ప్లాన్స్‌తో బండిల్‌గా రావడంతో 28.4 కోట్ల మంది కస్టమర్లు కంటెంట్‌ను ఆస్వాదించారు. ఆన్లైన్ గేమింగ్ ఇలా.. 2019లో మీడియా, వినోద రంగంలో 16 శాతం వాటా ఉన్న డిజిటల్, ఆన్లైన్ గేమింగ్ 2020లో 23 శాతానికి ఎగసింది. నాలుగేళ్లుగా ఆన్లైన్ గేమింగ్ విభాగం వేగంగా వృద్ధి సాధిస్తోంది. 2020లో ఈ విభాగం రూ.7,600 కోట్ల ఆదాయం నమోదు చేసింది. అంత క్రితం ఏడాది ఇది రూ.6,500 కోట్లుగా ఉంది. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం, ఆన్లైన్ తరగతులతో ఆన్లైన్ గేమింగ్ 18 శాతం వృద్ది సాధించింది. ఆన్లైన్ గేమర్స్ 20 శాతం అధికమై 36 కోట్లకు చేరారు. పలు రాష్ట్రాల్లో నియంత్రణలు ఉన్నప్పటికీ లావాదేవీల ఆధారిత గేమ్స్ ఆదాయం 21 శాతం అధికమైంది. సాధారణ గేమ్స్ ఆదాయం 7 శాతం పెరిగింది. థియేటర్ల ద్వారా ఆదాయం.. సినిమా, వీడియో ఆన్ డిమాండ్ 2019లో రూ.11,900 కోట్లు నమోదైంది. గతేడాది ఇది భారీగా తగ్గి రూ.7,200 కోట్లకు పరిమితమైంది. 2020లో థియేటర్ల ద్వారా ఆదాయం 2019తో పోలిస్తే పావు వంతులోపుకు పడిపోయింది. అయితే డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయం పెరగడం కాస్త ఊరటనిచ్చింది. డిజిటల్ రైట్స్ ఆదాయం దాదాపు రెండింతలై రూ.3,500 కోట్లు నమోదైంది. సినిమా నిర్మాణాలు ఆరు నెలలకుపైగా నిలిచిపోవడం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. టీవీ, సినిమా, సంగీతం రికవరీకి ఒకట్రెండేళ్లు పడుతుంది. చదవండి: ఆస్తి పన్ను వసూళ్లకు ప్రత్యేక వ్యూహం -
వకీల్‌సాబ్ కొత్త పాటకు డేట్ ఫిక్స్!
పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌కు ఇక పండగే.. అయితే పవర్‌స్టార్ ‘వకీల్‌సాబ్’ సినిమాతో త్వరలోనే ఫ్యాన్స్ ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే , ఈ చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసింది. మొదటిపాట ‘మగువ..మగువ’.. రెండోది ‘సత్యమేవ జయతే’. అయితే తొలిపాటను 2020 మహిళా దినోత్సవం సందర్భంగా విడుదలకాగా, రెండో పాటను సరిగ్గా ఏడాది తర్వాత 2021లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇవి రెండు కూడా ఇప్పటికే యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, తాజాగా ‘కంటిపాప..కంటిపాప’ అనే పాటను మార్చి 17వ తేదిన విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా, ఈ సినిమాను వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా, దిల్‌రాజు దీన్ని నిర్మిస్తున్నాడు. వకీల్‌సాబ్ సినిమాకు తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో పవన్‌కు జోడీగా లీడ్ పాత్రలో శ్రుతిహసన్ నటిస్తున్నారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల, లావణ్య త్రిపాఠిలు కూడా వేర్వేరు పాత్రలలో కనిపించనున్నారు. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తలైవి వచ్చేది అప్పుడే!
దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘తలైవి’. కాగా, ఈ సినిమాను ఏఎల్ విజయ్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటించారు. యంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి చేశారు. బుధవారం జయలలిత జయంతి సందర్భంగా ‘తలైవి’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న ‘తలైవి’ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రాన్నిఇప్పుడు మూడు భాషలలో విడుదల చేయనున్నారు. దీన్ని మొదటగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ‘తలైవి’ చిత్రానికి హిందీలో ‘జయ’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీనిలో జయలలితా రాజకీయ జీవితంలో ఎదురుకున్న సవాళ్ళను చూపేడుతున్నట్లు సినిమావర్గాలు తెలిపాయి. ప్రేక్షకులు, తమ అభిమాన నాయకురాలిని రాజకీయ ప్రస్థానాన్ని మరోసారి సినిమాతెరపై చూడటానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. -
శింబు అభిమానులకు పొంగల్ స్పెషల్
తమిళ సినిమా: నటుడు శింబు అభిమానులకు ఈ పొంగల్ చాలా స్పెషల్ కానుంది. సుశీంద్రన్ దర్శకత్వంలో నటించిన ఈశ్వరన్ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈనెల 14వ తేదీన తెరపైకి రానుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన పక్కా కమర్షియల్ అంశాలతో కూడిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మానాడు చిత్ర షూటింగ్లో శింబు పాల్గొంటున్నారు. దీన్ని వీ హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత సురేష్ కామాక్షి నిర్మిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కథానాయికగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లు ఇదివరకే విడుదలై శింబు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. తాజాగా మానాడు చిత్ర మోషన్ పోస్టర్‌ను సంక్రాంతి రోజున విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు ఆదివారం వెల్లడించాయి. అదే రోజు శింబు నటించిన ఈశ్వరన్ చిత్రం విడుదల కానుండడంతో ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
దర్శకుడిగా మారనున్న హీరో..
సాక్షి,ముంబై: ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం నటనకు స్వస్తి చెప్పినా.. త్వరలోనే దర్శకత్వంలోకి రాబోతున్నాడని ఒక ఇంటర్వ్యూలో అతని స్నేహితుడు అక్షయ్ ఒబెరాయ్ చెప్పారు. ఇమ్రాన్ 2008లో ‘జానే తు ... యా జానే నా’... చిత్రంతో మొదటిసారిగా హీరోగా నటించారు. అతని చివరి సినిమా ‘కట్టీ బట్టీ’ 2015లో విడుదలయ్యింది. ఇద్దరం కలిసి ఒకే దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నామని అక్షయ్ తెలిపారు. గుర్గావ్, కలకండి వంటి చిత్రాల్లో అక్షయ్ నటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘బాలీవుడ్లో నా బెస్ట్ ఫ్రెండ్ ఇమ్రాన్ ఖాన్. నాకు ప్రాణ స్నేహితుడు.. నేను అతనికి తెల్లవారుజామున 4 గంటలకు కాల్ చేయగలను. నేను,ఇమ్రాన్ దాదాపు 18 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాం. మేము అంధేరి వెస్ట్‌లోని కిషోర్ యాక్టింగ్ స్కూల్లో కలిసి యాక్టింగ్ నేర్చుకున్నాము.’ అని తెలిపారు. (చదవండి: ప్రేమ విషయాన్ని దాచలేదు: హీరో కూతురు) ‘‘ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతానికి నటనను విడిచిపెట్టారు. నాకు తెలిసినంతవరకు తనలో మంచి రచయిత, దర్శకుడు ఉన్నారు. ఆయన ఎప్పుడు డైరెక్షన్ చేస్తారో నాకు తెలియదు. కానీ ఓ స్నేహితుడిగా నేను ఎటువంటి ఒత్తిడి చేయను. ఆయన అద్భుతమైన చిత్రం చేస్తాడని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే సినిమాపై అతనికీ చాలా అవగాహన ఉంది” అని అక్షయ్ ఒబెరాయ్ తెలిపారు. -
ప్లాట్‌ఫారమ్‌కు ప్రేమలేఖ
రెండు ప్లాట్‌ఫారమ్‌లు కలవవు.రెండు పట్టాలు కలవవు.రెండు గమ్యాలు ఒకటి కావు.సమాంతర జీవితాలను సమంగా వేధించే అనుభూతి ఇది.కలవని వారిని ప్రేమించే అనురాగం ఇది.ఈ ప్రేమ ఒక జీవితకాలం లేటు. నగరపు ఒంటరి జీవితం.. అదీ కోల్కత్తా లోన్లీనెస్.. స్క్రీన్ మీద ‘‘యువర్స్ ట్రూలీ’’గా కనిపించింది. ‘ఆనీ జైదీ’ రాసిన ‘‘ది వన్ దట్ వజ్ అనౌన్స్డ్’’ అనే షార్ట్ స్టోరీ ఆ సినిమాకు ఆధారం. జీ ఫైవ్ స్ట్రీమ్ అవుతోంది. కథ.. మీథీ కుమార్(సోనీ రాజ్దాన్).. ప్రభుత్వ ఉద్యోగిని. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న అవివాహిత. ఆమెకు ఓ చెల్లెలు ..లాలి (ఆహనా కుమారా) బెంగళూరులో ఉద్యోగం చేస్తూంటుంది. కోల్‌కత్తాలో తాత,తండ్రి వారసత్వంగా వచ్చిన.. ఇచ్చిన ఇంటిలో ఓ పోర్షన్ అద్దెకు ఇచ్చి.. మీథీ కుమార్ ఒంటరిగా ఉంటూంటుంది. తల్లీతండ్రి చనిపోవడం, వయసులో తన కన్నా చాలా చిన్నదవడంతో చెల్లెలికి అక్కలాగా కాకుండా ఓ తల్లిలా వ్యవహరిస్తుంది మీథీ. మితభాషి. ఒటరితనం వల్లో.. స్వభావమే అంతో తెలియదు కాని.. కలివిడిగా ఉండదు. ఆఫీస్‌లో ఆమెకు ఒకే ఒక మహిళా సహోద్యోగి. మిగిలిన వాళ్లంతా మగవాళ్లే. పురుషాహంకారులే. దాంతో ఆ ఫీమేల్ కొలీగ్‌తో తప్ప ఇంకెవరితోనూ మాట కలపదు ఆమె. ఆ సహోద్యోగి ప్రెగ్నెంట్. డెలివరీకి లీవ్ మీద వెళ్లబోతూ మీథీ గురించి ఆందోళన పడుతుంది. తనులేక ఆఫీస్‌లో కూడా ఒంటరి అయిపోతుందేమోనని. కానిమీథీకి ఒంటరితనంతోనే చెలిమి ఎక్కువ. బద్దకంగానే రోజు మొదలవుతుంది ఆమెకు. అద్దెకు ఇచ్చిన పోర్షన్లో పక్షి ప్రేమికుడైన విజయ్ (పంకజ్ త్రిపాఠి) కుటుంబం ఉంటుంది. అతను మీథీతో స్నేహం చేయడానికి ఆసక్తి చూపిస్తూంటాడు. పెంపుడు చిలుకను పలకరించే మిషతో మీథీ కంట్లో పడడానికి, ఆమెతో మాటలు కదపడానికీ ప్రయత్నిస్తుంటాడు. మీథీ సేద తీరేది ఒకే ఒక్క చోట.. ప్రయాణంలో.. కొన్నేళ్లుగా! కోల్కత్తా ఈ కొస నుంచి ఆఫీస్ ఉన్న ఆ కొస వరకు ఆమెది సుదీర్ఘ ప్రయాణమే. తోపుడు బండితో మొదలై.. రిక్షాలో సాగి.. లోకల్ ట్రైన్‌తో గమ్యం చేరుకుంటుంది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచీ ఆ దారి సుపరిచితమే. అయినా ప్రతి రోజూ కొత్తగా చూస్తూంటుంది. సరికొత్త పరిచయం.. అలా ఒకసారి ఆ రైల్వేస్టేషన్.. ఆమెకు ఓ సరికొత్త కొంతును పరిచయం చేస్తుంది. రైల్వే మేల్ అనౌన్సర్ గొంతు (వినయ్ పాఠక్) అది. ఆ స్వరంతో స్నేహం చేస్తుంది. దగ్గరితనం పెంచుకుంటుంది. ఎంతలా అంటే... ఆ అనౌన్సర్ తనతోనే మాట్లాడుతున్నాడనే భ్రమను వాస్తవమని నమ్మేంతగా. ఆ స్టేషన్లో జనం రద్దీలో.. దారి దొరక్క ఇబ్బంది పడ్తూంటే.. తోటి ప్రయాణికులు తమ లగేజ్ చూడమనే పని అప్పగిస్తుంటే... వదిలించుకొని త్వరగా గమ్యాన్ని చేరుకో అంటూ ఆ అనౌన్సర్ గైడ్ చేసి.. తనకు తోవ చూపిస్తున్నట్టు.. కాస్త శ్రద్ధగా తయారైన రోజు.. ఆ అనౌన్సర్ తనకు కాంప్లిమెంట్ ఇస్తున్నట్టు.. మొత్తంగా ఆ స్వరం తనకోసం వేచి చూస్తున్నట్టు.. తనను ప్రేమిస్తున్నట్టూ ఊహించుకుంటుంది. ఆ గొంతుతో ప్రేమలో పడ్డప్పటి నుంచి ఆమెలో కొత్త ఉత్సాహం కనపడుతుంది. రోజూవారి ఆ సోలాంగ్ జర్నీ.. ఇంట్రస్టింగ్‌గా మారుతుంది. ఉత్సాహం పెరుగుతుంది. రైల్లో తోటి ప్రయాణికులను కుతూహ లంగా చూడ్డం ప్రారంభిస్తుంది. తన చుట్టూ సానుకూల వాతావరణం ఉన్నట్టు తోస్తుంది. ఎదురైన చావు ఊరేగింపు... అప్పుడే పెళ్లి చేసుకుని ట్రైన్ ఎక్కిన కొత్త జంట.. ఆ కొత్త పెళ్లికొడుకు పట్ల కొత్త పెళ్లికూతురు అనాసక్తంగా ఉండడం.. అంతలోకే ఆ ట్రైన్‌లోకి వచ్చిన ఓ యువకుడిని చూసి కొత్త పెళ్లికూతురు మొహం విప్పారడం.. అతను ఆమెను తీసుకొని వెళ్లిపోవడం.. కొత్త పెళ్లికొడుకు ఖంగు తినడం.. వంటి తనకు ఎదురైన సంఘటనలను ఆ రైల్వే అనౌన్సర్కు ఉత్తరాలుగా రాస్తుంది. మొత్తానికి తనలోని భావోద్వేగాల ఉనికిని కనిపెడుతుంది. వాటన్నిటినీ లేఖల్లో ఆ అనౌన్సర్తో పంచుకుంటుంది. అలా కొన్నేళ్లు గడిచిపోతాయి. రిటైర్మెంట్ దగ్గర పడ్తుంది. రిటైర్ అయితే.. ప్రయాణం ఆగిపోతుంది. ఆ అనౌన్సర్ గొంతూ దూరమవుతుంది.. అన్న ఆలోచన రాగానే నెమ్మదిగా ఆమెలో దిగులు మొదలవుతుంది. ఇన్ని ఉత్తరాలు రాస్తున్నా.. ఒక్కదానికీ జవాబివ్వడేంటీ అన్న బాధ మనసును మెలిపెడుతూంటుంది. చూడాలి.. కలవాలి.. అడగాలి అసలు తన జాబులు అందుతున్నాయా? లేదా? చదువుతున్నాడా?చించేస్తున్నాడా? అనే సందేహం.. సంఘర్షణ, అంతర్మథనం ఆమెను నిద్రపోనివ్వవు. ఏది ఏమైనా అతనిని చూడాలి.. కలిసి మాట్లాడాలి.. తన ఉత్తరాల గురించి అడగాలి అని ఒకరోజు ఆ స్టేషన్‌లోని అనౌన్స్మెంట్ గదికి వెళ్తుంది. అక్కడ ఎవరూ ఉండరు. మళ్లీ తెల్లవారి.. అతను తనను కలవలేకపోయినందుకు నొచ్చుకున్నట్టు.. ‘‘ఇన్నేళ్లు ఎప్పుడూ నన్ను చూడాలనిపించలేదా? లేక లేక నేను లీవ్ పెట్టిన రోజే నన్ను కలవాలనిపించిందా’’ అని నిష్టూరమాడినట్టు.. సారీ చెప్పినట్టూ భ్రమ పడ్తుంది. అతనిని క్షమించేస్తుంది. కాని మనసులో మాత్రం ఇదేదో తేల్చుకోవాలనే నిశ్చయించుకుంటుంది. దీపావళి.. చెల్లెలు లాలి తీరు.. అక్క మీథీ మనస్తత్వానికి పూర్తిగా విరుద్ధం. గలగల మాట్లాడుతూ.. సరదాగా.. ఉంటుంది లాలీ. దీపావళి పండక్కి అక్కతో గడపడానికి ఊరొస్తుంది. అప్పుడు మీథీలోని అక్క బయటపడ్తుంది. చెల్లితో సరదాగా ఉంటుంది. మొదటిసారిగా అమ్మలా కాకుండా.. అక్కలాగా.. ఓ స్నేహితురాలిగా లాలీతో గడుపుతుంది. చెల్లెలి బాయ్‌ఫ్రెండ్ గురించి డిస్కస్ చేస్తుంది. అనౌన్సర్తో తన ప్రేమ వ్యవహారం చెప్తుంది. ఏదో ఒకటి తేల్చుకోమ్మని చెల్లెలూ సలహా ఇస్తుంది మీథీకి. కుదరకపోతే.. ఆ ఇల్లు అమ్మేసి.. తనతోపాటే బెంగళూరు వచ్చేయమని ఒత్తిడి తెస్తుంది. చెల్లెలు వెళ్లిపోయాక.. ఆ విషయాలన్నిటితో ఆ అనౌన్సర్కు ఉత్తరం రాస్తుంది. ఆ ఇంటికి, తనకు ఉన్న అనుబంధాన్ని, సెంటిమెంట్‌ను వివరిస్తుంది. ఇంటిని అమ్మలేని.. ఆ ఊరి వదిలి వెళ్లిపోలేని నిస్సహాయతను తెలుపుతుంది. అతని నుంచి జవాబు రాకపోతే చెల్లెలు ఇచ్చిన సలహానే పాటించాల్సి వస్తుందేమోననే భయాన్నీ వ్యక్తపరుస్తుంది. అయినా ఉత్తరం రాదు. చెల్లెలు వెళ్లిపోయాక ఒంటరితనం భరంగా అనిపించి.. ఓ కుక్కపిల్లను తెచ్చుకుంటుంది. తనతోపాటే దాన్ని ఆఫీస్‌కి తీసుకెళ్తుంది. ఆ రోజు.. స్టేషన్లో అనౌన్సర్ సంభాషణ వినిపించదు. అన్యమనస్కంగా ఉంటుంది మీథికి. కుక్కపిల్లను దువ్వుతూ ప్లాట్‌ఫారమ్ మీద కూర్చుంటుంది. అవతల ప్లాట్‌ఫారమ్ బెంచ్ మీద ఓ వ్యక్తి కనిపిస్తాడు. బ్యాగ్‌లోంచి ఏవో తీస్తూ. శ్రద్ధగా పరికిస్తుంది. ఎన్వలప్‌లు. ఉలిక్కిపడ్తుంది. అడ్రస్ కింద ఉన్న రంగురంగు పూల డిజైన్లను చూసి. తను వేసినవే.. ఒక్కసారిగా ఆనందం ఆమెలో. అంటే.. తన ఉత్తరాలందుతున్నాయి. చదువుకుంటున్నాడు. మనసు ఉప్పొంగుతుంది. వెళ్లి అతణ్ణి కలవాలని ఉద్యుక్తమవుతుండగానే.. ఇద్దరికీ మధ్య ఉన్న ట్రాక్ మీదకు ట్రైన్ వస్తుంది.. పోతుంది. అవతలి ప్లాట్‌ఫారమ్ మీద అతనుండడు. ఆ ట్రైన్లో వెళ్లిపోయాడని అనుకుంటుంది. తెల్లవారి కలవొచ్చు.. కలుస్తాడనే భరోసాతో మీథీ కుమారీ ఇంటికి బయలుదేరుతుంది. ప్లాట్‌ఫారమ్ మీద ఉత్తరాలు చదువుకుంటున్న వ్యక్తి పాత్రలో మహేష్ భట్ కనిపిస్తాడు. ఇదీ.. యువర్స్ ట్రూలీ కథ. దర్శకుడు సన్జోయ్ నాగ్. లంచ్‌బాక్స్, అపర్ణా సేన్ ‘36 చౌరంఘీ లేన్’ సినిమాలను పోలినట్టు కనిపించినా.. వాటికి భిన్నమైందే. మీథీ కుమార్ పాత్రలో సోనీ రాజ్దాన్ ఒదిగిపోయిందని చెప్పొచ్చు. – సరస్వతి రమ -
సిటీలో ‘చినబాబు’
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): నగరంలో చినబాబు చిత్ర యూనిట్ సందడి చేసింది. చినబాబు చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా ఆదివారం జగదాంబ థియేటర్లో హీరో కార్తి అభిమానులతో సరదగా మాట్లాడారు. కుటుంబ సమేతంగా చినబాబు చిత్రం చూడాలన్నారు. ఇటీవల వైజాగ్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు చినబాబు చిత్రం ఆడియో రిలీజ్ చేశారని, చిత్ర విజయోత్సవాన్ని కూడా వైజాగ్‌లోనే నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. గంటా మాట ప్రకారం చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. వైజాగ్‌లో మంచి కలెక్షన్స్‌తో చిత్రం ఆడుతోందని, ప్రతి థియేటర్లో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో చిత్రం నడుస్తోందన్నారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూస్తే మంచి అనుభూతి పొందుతారని, ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్‌లు లేవని, అసభ్య దృశ్యాలు లేకుండా చిన్నారుల నుంచి అవ్వలు వరకు ఆనందంగా చూడదగ్గ సినిమాగా పేర్కొన్నారు. ఇంతటి విజయాన్ని అందించిన వైజాగ్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో థియేటర్ ప్రతినిధులు జగదీష్, వాసు తదితరులు పాల్గొన్నారు. -
సినిమా చూస్తుండగా చెలరేగిన మంటలు
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్: షార్ట్ సర్క్యూట్‌తో స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని మహాలక్ష్మీ, లక్ష్మీ థియేటర్ కాంప్లెక్స్‌లో శుక్రవారం రాత్రి 9.30 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. కళ్లప్పగించి సినిమా సూస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన ప్రేక్షకులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. వివరాలిలా ఉన్నాయి. ఘన్‌పూర్‌లోని లక్ష్మీ థియేటర్ సాంకేతిక లోపంతో దాదాపు పది రోజుల నుంచి పనిచేయడం లేదు. దీంతో పక్కనే ఉన్నమహాలక్ష్మీ థియేటర్‌ను మాత్రం నడిపిస్తున్నారు. అయితే దీనిలో రెండు రోజుల క్రితం విడుదలైన ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా నడుస్తోంది. ఇందులో భాగంలో థియేటర్లో సినిమా చూసేందుకు సెకండ్ షోకు పెద్దసంఖ్యలో ప్రేక్షకులు వచ్చారు. ఈ క్రమంలో సినిమా నడుస్తుండగా మహాలక్ష్మీ థియేటర్‌కు ఆనుకుని ఉన్న లక్ష్మీ థియేటర్లో ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకుని పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. గమనించిన థియేటర్ సిబ్బంది, ప్రేక్షకులు హాల్ నుంచి పరుగెత్తుకుంటూ బయటికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే థియేటర్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ప్రేక్షకులందరినీ బయటికి పంపించారు. అయితే సినిమా థియేటర్లో అగ్ని ప్రమాదం జరిగితే మంటలు ఆర్పే కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందికరంగా మారిం దని ప్రేక్షకులు ఆరోపించారు. కాగా, ప్రమాదం జరిగిన గంట సేపటి తర్వాత ఫైర్ ఇంజన్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు. అప్పటికే లక్ష్మీ థియేటర్లోని ఫర్నిచర్, పరికరాలు పూర్తిస్థాయిలో దహనమయ్యాయి. అయితే ప్రమాదానికి పూర్తి కారణాలు, నష్టం అం చనాలు తెలియాల్సి ఉంది. సినిమా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు మండిపడ్డారు. ఈ ప్రమాదంలో కేవలం ఆస్థి నష్టమే జరుగగా ప్రేక్షకులకు ఎవరికి ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
ఈజీ మనీ కోసం..
ఆలీరజా, మధుమిత కృష్ణ, ఐశ్వర్య అడ్డాల ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘నా రూటే సెపరేటు’. గిరిధర్ దర్శకత్వంలో భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై ఎమ్.సుబ్బలక్ష్మి (శ్రీదేవి) నిర్మించారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఈజీ మనీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. నేటితరం యువత ఈజీగా డబ్బు సంపాదించేందుకు ఎటువంటి మార్గం ఎన్నుకుంటున్నారు? దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? తమ తప్పు తెలుసుకుని ఏ విధంగా జీవితాన్ని చక్కబెట్టుకుంటున్నారు? అనే విషయాలను మా సినిమాలో చూపిస్తున్నాం. త్వరలో పాటలను, అక్టోబర్‌లో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘గతంలో ‘లజ్జ' సినిమాలో నటించా. ఆ సినిమా తర్వాత నటనకు ఆస్కారం ఉన్న పాత్రను ‘నా రూటే సెపరేటు’ సినిమాలో చేశా. ఈ చిత్రంతో ఓ మెట్టు ఎదుగుతాననే నమ్మకం ఉంది’’ అన్నారు మధుమిత కృష్ణ. -
చికుబుకు చికుబుకు రైలే..
-
కలర్ఫుల్గా ఇజం మూవీ ఆడియో రిలీజ్
-
హైదరాబాద్‌లో హీరో కార్తీ సందడి
-
రిషికపూర్ బర్త్‌డే స్పెషల్
-
చిత్రం...స్వరం...సాహిత్యం
-
స్క్రీన్ ప్లే 18th August 2016
-
స్క్రీన్ ప్లే 16th Aug 2016
-
శ్రీరస్తు శుభమస్తు సక్సెస్ మీట్
-
పెళ్ళిచూపులు సక్సెస్ మీట్
-
తిక్క సినిమాలో 15 నిమిషాలు కట్
-
స్క్రీన్ ప్లే 15th August 2016
-
స్క్రీన్ ప్లే 12th August 2016
-
స్క్రీన్ ప్లే 11th August 2016
-
స్ర్కీన్ ప్లే 10th Aug 2016
-
నిజజీవితంలో నేను హీరోను కాదు
న్యూఢిల్లీ: 'నేను సినిమాల్లోనే హీరోను నిజ జీవితంలోకాదు' అని బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ (50) అన్నారు. నేను విలన్ గా మారాలని అనుకోవడంలేదని, ప్రేక్షకులు తనను ఎప్పటికీ గుర్తుంచుకునే సినిమా హీరోగా మాత్రమే ఉండాలని అనుకుంటున్నానని అన్నారు. యువతకు స్ఫూర్తినిచ్చే, వారు యోధునిల్లాగా మారే సినిమాలు చేస్తానని అన్నారు. గతంలో తాను నటించిన 'సుల్తాన్' సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ సినిమా షూటింగ్ పూర్తయి విడుదలకు ముందు తన పరిస్థితి రేప్ కు గురైన మహిళగా ఉందని అనడంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. -
వడివేలును బెదిరిస్తే తీవ్ర పరిణామాలు : సీమాన్
చెన్నై: ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేలును బెదిరిస్తే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సినీ దర్శకుడు, నామ్ తమిళర్ నేత సీమాన్ హెచ్చరించారు. హాస్యనటుడు వడివేలు తాజా చిత్రం తెనాలిరామన్లో హీరోగా నటించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం పలు విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ సినిమాలో వడివేలు శ్రీకష్ణదేవరాయలుగా, తెనాలి రామకృష్ణగా ద్విపాత్రాభినయం చేశారు. శ్రీకష్ణదేవరాయల పాత్రను కించపరిచేలా చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ తమిళనాడులోని పలు తెలుగు సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నేతృత్వంలో పలువురు తెలుగు సంఘాల నేతలు ఇప్పటికే ఈ విషయాన్ని సెన్సార్ బోర్డు అధికారి, రాష్ట్ర గవర్నర్ దష్టికి తీసుకెళ్లారు. నటుడు వడివేలు ఇంటిని చుట్టుముట్టి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలుగు సంఘాల చర్యలను ఖండిస్తూ నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వడివేలు నటించిన తెనాలి రామన్ చిత్రంలో శ్రీకష్ణదేవరాయలను కించపరిచే విధంగా చిత్రీకరించినట్లు కొన్ని సంఘాలు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. చిత్రం నుంచి ఆ సన్నివేశాలను తొలగించాలని బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. చిత్రం చూడకుండా శ్రీకష్ణదేవరాయల్ని కించపరిచే సన్నివేశాలున్నట్లు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. పూర్తి వివరాలు తెలియకుండా ఇలాంటి చర్యలకు పాల్పడడం భావ్యం కాదని పేర్కొన్నారు. శ్రీకష్ణదేవరాయల పాత్ర గురించి ఆవేదన చెందేవారి మనోభావాలను తాము అర్థం చేసుకుంటామని వెల్లడించారు. నిజంగానే శ్రీకష్ణదేవరాయల పాత్రను కించపరిచే విధంగా చిత్రీకరిస్తే ఈ వ్యవహారంపై పోరాడేవారికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. చిత్రంలో అసలు శ్రీకష్ణదేవరాయల పాత్రను తీసుకోలేదని చిత్ర నిర్మాతలు చెబుతున్నారని, దీన్ని పట్టించుకోకుండా వడివేలుపై దండెత్తడం ఒక కళాకారుడిని అవమానించడమేనని పేర్కొన్నారు. ఆంధ్రలోను, కర్ణాటకలోను తమిళులకు వ్యతిరేకంగా చిత్రించే చర్యలను అక్కడ జీవించే తమిళులు ఖండించగలుగుతున్నారా? అంటూ ప్రశ్నించారు. తమిళనాడుకు ఘనత చేకూర్చిన నటుడు వడివేలుకు ఎలాంటి సమస్య తలెత్తకుండా చూసుకోవడం ఒక తమిళయన్గా తమ బాధ్యతని తెలిపారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో వడివేలుకు సహకరించేవారెవరూ లేరని, కొన్ని సంఘాలు బెదిరించే కార్యక్రమాలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి వారందరూ తమిళ సముదాయం అంతా వడివేలు వెనుక ఉందనే విషయాన్ని గ్రహించాలన్నారు. వడివేలుపై బెదిరింపులకు దిగితే నామ్ తమిళర్ పార్టీ వారికి తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. -
ఆ గోల్డెన్ ఛాన్స్ తమన్నాకా? సమంతకా?
సినిమా రంగం అంటేనే అదో వింతైన పోటీ ప్రపంచం. హీరోయిన్లుగా ఓ వెలుగు వెలగాలంటే అందం, అభినయం ముఖ్యం. ఈ రెండే కాకుండా అదృష్టం కూడా కలసి రావాలని చాలామంది భావిస్తుంటారు. హీరోలకంటే హీరోయిన్లు అధికంగా ఉండే ఈ రంగంలో వారిమధ్యనే పోటీ తీవ్రంగా ఉంటుంది. ఇటువంటి పోటీ ఇప్పుడు తమన్నా, సమంత మధ్య నెలకొంది. ఈ పోటీలో ఎవరు నెగ్గుతారా అని చిత్రపరిశ్రమలో పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల చిత్రాలలో నటిస్తూ తమన్నా మంచి ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో ఆగడు, బాహుబలి, హిందీలో ఇట్స్ ఎంటర్టైన్మెంట్, హమ్ షకల్స్, నో ఎంట్రీ మై ఎంట్రీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా బిజీగా ఉన్న ఈ పాలపిల్లకు మళయాళం, కన్నడంలో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఏ మాయ చేశావె చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సమంత తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు,అత్తారింటికి దారేది, రామయ్యావస్తావయ్యా వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో నటించింది. తమిళంలో కూడా అదే రేంజ్ చిత్రాలలో నటించింది. ఇంతకీ అసలు కథేంటంటే సూపర్ స్టార్ అజిత్‌తో కలసి నటించాలని చాలామంది హీరోయిన్లు ఆశపడుతుంటారు. అజిత్‌తో కలిసి నటించే హీరోయిన్‌కి కోలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం అజిత్ శివ అనే కొత్త డైరెక్టర్ నిర్మించే చిత్రంలో నటించడానికి అంగీకరించాడు. అయితే ఈ చిత్రంలో అజిత్‌కు జంటగా నటించే హీరోయిన్ను ఇంకా ఎంపిక చేయలేదు. ఎవరిని ఎంపిక చేయాలా? అని ఆ చిత్ర నిర్మాతలు, దర్శకుడు, హీరో అందరూ తెగ ఆలోచిస్తున్నారు. వీరం సినిమాలో అందాల ముద్దుగుమ్మ తమన్నా అజిత్‌తో జతకట్టి హిట్ కొట్టింది. దాంతో కొందరి చూపు ఆమెపై పడింది. తమన్నా అయితే బెటర్ అని భావిస్తున్నారు. ఈ చిత్రం హీరోయిన్ ఎంపిక విషయంలో తమన్నాకు పోటీగా సమంత నిలిచింది. టాలీవుడ్లో వరుస హిట్లతో దూసుకుపోతోన్న ఈ బ్యూటీకి కోలీవుడ్‌లో కూడా ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే సమంతను ఓకే చేస్తే ఎలా ఉంటుందా? అన్న ఆలోచనలో ఆ చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. మరి వీరిద్దరిలో ఆ గోల్డెన్ ఛాన్స్ ఎవరు కొట్టేస్తారో వేచిచూడాలి. ఇప్పటికే ఒకసారి తమన్నా అజిత్‌తో నటించినందున, ఈసారి సమంతకే అవకాశం దక్కుతుందని కోలివుడ్లో పలువురు భావిస్తున్నారు.