
ఆలీరజా, మధుమిత కృష్ణ, ఐశ్వర్య అడ్డాల ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘నా రూటే సెపరేటు’. గిరిధర్ దర్శకత్వంలో భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై ఎమ్.సుబ్బలక్ష్మి (శ్రీదేవి) నిర్మించారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఈజీ మనీ నేపథ్యంలో సాగే సినిమా ఇది.
నేటితరం యువత ఈజీగా డబ్బు సంపాదించేందుకు ఎటువంటి మార్గం ఎన్నుకుంటున్నారు? దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? తమ తప్పు తెలుసుకుని ఏ విధంగా జీవితాన్ని చక్కబెట్టుకుంటున్నారు? అనే విషయాలను మా సినిమాలో చూపిస్తున్నాం.
త్వరలో పాటలను, అక్టోబర్‌లో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘గతంలో ‘లజ్జ' సినిమాలో నటించా. ఆ సినిమా తర్వాత నటనకు ఆస్కారం ఉన్న పాత్రను ‘నా రూటే సెపరేటు’ సినిమాలో చేశా. ఈ చిత్రంతో ఓ మెట్టు ఎదుగుతాననే నమ్మకం ఉంది’’ అన్నారు మధుమిత కృష్ణ.