Giridhar
-
‘ఓటుకు కోట్లు 2.0’ ప్రకంపనలు
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు చేసిన ఓటుకు కోట్లు 2.0 కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది. తననూ టీడీపీ నేతలు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని సోమవారం గుంటూరు (పశ్చిమ) ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ కూడా వెల్లడించడం సంచలనం సృష్టించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలని.. టీడీపీ అగ్రనేతతో మాట్లాడిస్తామంటూ స్థానిక నేతలు తనను సంప్రదించారని మద్దాళి గిరిధర్ చెప్పారు. స్థానిక నేతలకు తాను స్పందించకపోవడంతో మాజీ ఎమ్మెల్సీ, చంద్రబాబు సన్నిహితుడు టీడీ జనార్దన్ ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించారని.. కానీ, తాను ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. కుట్రలు, కుతంత్రాలు, విలువల్లేని రాజకీయాలు చేసే చంద్రబాబు వైఖరి నచ్చక.. సీఎం వైఎస్ జగన్ సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన చూసి టీడీపీ వీడానని ఆయన స్పష్టంచేశారు. టీడీపీ అగ్రనేతల నుంచి తనకు వచ్చిన ఫోన్‌కాల్ లిస్ట్‌ను ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ బహిర్గతం చేయడంతో టీడీపీ ప్రలోభాల పర్వం మరోసారి బట్టబయలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే రూ.పది కోట్లు ఇస్తామంటూ తనను ప్రలోభపెట్టేందుకు ఉండి ఎమ్మెల్యే రామరాజు ప్రయత్నించారని ఎమ్మెల్యే రాపాక ఇప్పటికే వెల్లడించడం.. ఓటును అమ్ముకుంటే వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్లేనని భావించి ఆ ప్రతిపాదనను తిరస్కరించానని స్పష్టంచేసిన విషయం విదితమే. టీడీపీ ప్రలోభాలకు లొంగే ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు టీడీపీ అభ్యర్థికి క్రాస్ ఓటు చేశారన్నది స్పష్టమవుతోంది. గెలిచే బలం లేకున్నప్పటికీ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించడాన్ని బట్టి చూస్తుంటే.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే ఓటుకు రూ.కోట్లు ఎరవేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి చంద్రబాబు వ్యూహం రచించారని ఆదిలోనే వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ నేతలు చెప్పారు. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు రావడాన్ని బట్టి చూస్తే.. ఆ పార్టీకి ఉన్న 19 మంది ఎమ్మెల్యేల కంటే అదనంగా నలుగురు ఓట్లేసినట్లు స్పష్టమవుతోంది. ఆ నలుగురికి ఒక్కొక్కరికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసినట్లు సజ్జల ఇప్పటికే స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రలోభాల పర్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రలోభాలు, కుట్రలు, కుతంత్రాలు బాబు నైజం.. ప్రజలకు మంచి చేసి.. వారి ఆశీస్సులతో అధికారంలోకి రావాలని చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించరని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రలోభాల పర్వాన్నే ఆయన ఎంచుకున్నారని గుర్తుచేస్తున్నారు. కుట్రలు, కుతంత్రాల ద్వారానే అధికారంలోకి రావడంపైనే చంద్రబాబు ఆలోచన చేస్తారని వారు స్పష్టంచేస్తున్నారు. తెలంగాణలో 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఎరవేసి ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ.. ఆడియో వీడియో టేపులతో ఆ రాష్ట్ర ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చంద్రబాబు దొరికిపోవడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. -
టాలీవుడ్ దర్శకుడు, నటుడు గిరిధర్ కన్నుమూత
టాలీవుడ్దర్శకుడు,నటుడు ఇరుగు గిరిధర్(64)కన్నుమూశారు. ఆరేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గిరిధర్ అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు. ఆదివారం తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం ఇరంగారిపల్లెలో 1957 మే 21న ఆయన జన్మించాడు. 1982లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. టాలీవుడ్ సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి, గుణశేఖర్, ఈవీవీ సత్యనారాయణ వంటివారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా గిరిధర్ పనిచేశారు. గుడుంబా శంకర్, అన్నవరం, వన్, సుప్రీమ్, వరుడు వంటి సినిమాలకు కోడైరెక్టర్‌గానూ పనిచేశారు. చంద్రమోహన్, ఆమని, ఇంద్రజ, వినోద్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన శుభముహూర్తం సినిమాకు దర్శకత్వం వహించి, తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. అలాగే, ఎక్స్‌ప్రెస్ రాజా, 100 పర్సంట్ లవ్, సర్దార్ గబ్బర్ సింగ్, శ్రీమంతుడు తదితర 20 సినిమాల్లో నటించారు. గిరిధర్ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
ఓటే వజ్రాయుధం... భవితకు సోపానం...
విజయనగరం గంటస్తంభం: బంగారు భవితకు ఓటే వజ్రాయుధం వంటిదనీ, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని ఎన్నికల్లో వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ అన్నారు. మహారాజా అటానమస్ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసి న ఓటర్ల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ డబ్బు, మద్యం, మతం, కులం పే రుతో ఓటర్లను ప్రలోభపెట్టడం నేరమని, డబ్బు, మద్యం ఇచ్చినవారు, తీసుకున్నవారు శిక్షార్హులే న ని అన్నారు. ఎన్నికల్లో మంచి నాయకుడిని ఎన్నుకోవాలని, పోటీ చేసే వారు ఎవరూ నచ్చకపోతే నోటా ఆప్షన్ ఉపయోగించుకోవాలని సూచించా రు. ఎన్నికలలో కొందరు పోటీ చేసేవారు లక్షలు, కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి గెలిచి మరలా అక్రమార్జన ద్వారా సంపాదిస్తున్నారని, అటువంటి వారికి ఓట్లు వేయకూడదని సూచించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటుకు అత్యంత ప్రాధాన్యం ఉందని, ఎవరి ప్రలోభాలకూ లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయాలన్నారు. ఓటు హక్కు పొందిన అందరూ తమ ఓటును వినియోగించుకోవాలని, ఓటర్ల నమోదుపై అవగాహన కలిగించాలన్నారు. నిబద్ధత కలిగిన, నిస్వార్ధమైన, నిజాయితీగల నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. ర్యాలీతో ప్రారంభం అంతకుముందు ఉత్సవాలు ర్యాలీతో ప్రారంభమయ్యాయి. కోట జంక్షన్ వద్ద ఏర్పాటుచేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఓటుకు సంబంధించిన నినాదాలతో ఎం ఆర్ కళాశాల వరకు ర్యాలీ కొనసాగింది. గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి, విగ్రహం చుట్టూ మానవహారంగా ఏర్పడ్డారు. కార్యక్రమంలో ఎన్నికల విధుల్లో ఉత్తమ సేవలు అందించిన ఈఆర్ఓలు, ఏపీఆర్ఓ లు, బీఎల్వోలకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందించారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు, టూకే రన్ లో విజేతలైన వారికి బహుమతులను అందజేశారు. కొత్ట ఓటర్లకు ఓటుహక్కు కార్డులను అందజేశారు. వృద్ధ, థర్డ్‌జెండర్, నూతన ఓటర్లను సత్కరించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, జేసీ–2 జె.సీతారామారావు, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, పీటీసీ ప్రిన్సిపల్ మెహర్ బాబు, అధికారులు, సిబ్బంది, పలువురు ఓటర్లు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
అదే స్వర్గం అదే మోక్షం
ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా కనుగొనలేని, వివరించలేని ఆ అనంతశక్తి లేదా ఆత్మ ఒక మహా ఆశ్చర్యకరమైన వస్తువనీ, ఇంద్రియానుభవ రహితమైనదని, మానసికానుభవమని నాటి ఋషులుగా చెప్పబడే ఆధ్యాత్మిక పరిశోధకులు వేల ఏళ్లక్రితం ఉపనిషత్తుల్లో ఘోషించడం ఎంతో ఆశ్చర్యకరం. ఉపనిషత్తులు ఆ ఆత్మ గురించి పరిపరి విధాల వర్ణిస్తూ, ప్రతి ఒక్కరినీ మానవత్వం నిండిన విశ్వనరునిగా జీవించమంటూ, బతికినంతకాలం జ్ఞానపీఠికపై కర్మయోగిగా, చిత్జడ గ్రంథిని చిదిమివేసి మోక్షాన్ని అనుభవించాలని ఉపదేశిస్తాయి. ప్రాణసహితంగా ఉన్నా, ప్రాణరహితంగా ఉన్నా ‘నీవే ఆ అనంతశక్తిగా అనుభూతి చెందాలి’ అని చెప్తాయి. అనుభూతి అనేది మనసు చేసే మథనం. ఇదే విషయాన్ని ‘ముండకోపనిషత్తు’ ‘ఆ ఆత్మ కళ్ళతోనో, ఇతర ఇంద్రియాలతోనో తెలుసుకోబడదు. తపస్సు వలననో, కర్మలచేతనో లభించదు. సాధకుని మనస్సు విశుద్ధమైనదై ఉండి, నిరంతరం ఆ ఆత్మతో తాదాత్మ్యత పొందడం వలననే దాని సాక్షాత్కారం పొందడం సాధ్యమౌతుంద‘ని తెలుపుతోంది. అంతేకాకుండా నయమాత్మా’ బలహీనేన లభ్యో...’ అంటూ ‘ఆత్మను బలహీనులైన వారు పొందలేరు. అజాగ్రత్త వలన, నిర్దిష్టమైన తపస్సు లేని యెడల ఆత్మసాక్షాత్కారం జరుగదు. శారీరక, మానసిక దృఢత్వం వలన వచ్చే మనోస్థైర్యం కలిగిన సాధకులు మాత్రమే బ్రహ్మస్థితిని అనగా ఆత్మసాక్షాత్కారం పొందగలర‘ని నిర్ధారిస్తోంది. మనసుకున్న గొప్పలక్షణాల వల్ల ఆత్మ అటువంటి శక్తిని గ్రహించగలుగుతుంది. మనసు ఎంతో బలమైనదై, నిశ్చలమైనదై ఉండాలి. దృఢమైనది ఎందుకంటే ఆత్మతో ఏకత్వాన్ని అనుభవించినపుడు కలిగే ఆనందాన్ని భరించగలిగినదై ఉండాలి. నిశ్చలమైనదై ఎందుకుండాలంటే, మనసు నిశ్చలంగా ఉంటేనే పదార్థ లక్షణాలేవీ లేని శక్తిపట్ల తాదాత్మ్యత పొందగలుగుతుంది. నీటి ప్రవాహంలో గాలి బుడగలు ఉద్భవించి, కొంతదూరం ప్రయాణించి, పగిలిన తర్వాత తిరిగి నీటిలో కలిసి పోయినట్లే ఈ చరాచర ప్రపంచం ఆ అనంతశక్తిలో ప్రవర్తిస్తుంది. ఈ విషయాన్ని ఏకాగ్రచిత్తంతో గమనిస్తూ ఉంటే అర్థమవుతుంది. ఈ విధమైన ఏకాగ్రత మనలో ఎనలేని మార్పును తీసుకొస్తుంది. ఏ పదార్థంపైనా, జీవిపైనా వ్యామోహంగానీ, విరక్తి గానీ కలుగదు. మంచి–చెడు,సుఖం–దుఃఖం లాంటి ద్వైదీభావనలు కలుగవు. కామ, క్రోధాది అరిషడ్వర్గాలకు అసలు స్థానమే ఉండదు. నిర్వికార, నిశ్చలమనస్సు ఏర్పడి ప్రతిపనిలో, ప్రతివాక్కులో, ప్రతిరూపంలో, సర్వత్రా ఏకాత్మను గ్రహిస్తూ ఉంటుంది. అదో అద్భుత ఆనందానుభూతి. ఈ దృశ్యమాన ప్రపంచాన్ని, దానికి హేతువైన ఆత్మను గెలిచి, ఒడిసిపట్టుకున్న ఆనందం. అంతకుమించిన విజయమేముంటుంది మనిషికి? జీవరాశుల్లో అన్నిట్లో మేధావి ఐన మనిషికి భౌతిక ప్రపంచంలో తాను ఆశించిందాన్ని గెలుపొందడమే గొప్ప విజయంగా భావిస్తాడు. అలాంటిది ఈ సృష్టి మొత్తానికి హేతువైన అనంతశక్తిని మన మనసులో ఒడిసి పట్టుకోవడం ఎంతటి విజయమో మనం ఊహించలేం. ఆ విజయానందం అనిర్వచనీయం. సాధకుడు ఆ జీవితాన్ని అనుభవించాల్సిందే. అప్పుడు సాధకుని మనస్సు అనిర్వచనీయమైన, అవధుల్లేని ఆనందడోలికల్లో తేలిపోతూ ఉంటుంది. ఈ ప్రపంచం, దాని పరిణామాలన్నీ ఆల్పమైపోతాయి. అసలు వీటిమీద ఏ చింతా కలగదు. భగవంతుని చూడాలనుకునే ప్రతి ఒక్కరూ భగవంతుడు అని చెప్పబడే ఆ ఆత్మను సాకారం చేసుకోలేరు. మనసులో ఆత్మను నిరంతర సంయోగం చేయగలవారే ఆత్మ లేక భగవత్సాక్షాత్కారం పొందగలరు. అలా పొందిన వారు అద్వైతచిత్తులై, కుల, మత, లింగ, భాష, ప్రాంత, జైవికాది భేదాలకు అతీతులై, ఉన్నత మానసిక స్థితిలో ఓలలాడుతూ ఉంటారు. అదే స్వర్గం. అదే మోక్షం. – గిరిధర్ రావుల -
చింతన చేసి చూడవే ఓ మనసా!
మనలో, మన చుట్టూ ఆత్మ లేక అనంతశక్తి అంతటా వ్యాపించి ఉంది. కాని, మనలో చైతన్యం ఆత్మ కాదు. ఆత్మ వలన జనించిన ప్రాణమది. ఈ ప్రాణానికి శరీరం ఆధారం.ఈ ప్రాణం లేక చైతన్యం మన శరీరంలో ఆహారం వలన నిలబెట్టబడుతుంది. మనలో ఈ చైతన్యాన్ని నిలిపే ఏదేని ప్రధాన అవయవం నశిస్తే మనలో ప్రాణం లేక చైతన్యం నిలిచిపోతుంది. అదే ప్రాణం పోవడం. అంతేగాని, మనకో ప్రత్యేక ఆత్మ అనేది లేదు, ఉండదు. ఆత్మ మరో జన్మకోసం విశ్వంలో తిరగడమంటూ ఉండదు. ఆ అనంతమైన ఆత్మ తనలోనే, తనకు తానుగనే బహురూపాలలో తిరిగి తిరిగి పుడుతోంది, కాని ఫలానా ఆత్మ అంటూ ప్రత్యేకంగా ఒకటుండదు. పంచభూతాలలో నుండి వచ్చిన శరీరం విఘటనం చెంది పంచభూతాలలోకే ప్రయాణం సాగిస్తుంది. ఈ పంచభూతాలు ఎక్కడివో కావు, అనంతశక్తిలో నుండే ఉద్భవించిన అంశాలే. ఈ విషయాన్ని గుర్తెరిగి, సర్వత్రా వ్యాపించి ఉన్నది ఒకే ఒక ఆత్మ అనే సత్యం మన ఆలోచనల్లో నిండిపోతే, మన మనసుల్లో అరిషడ్వర్గాలకు స్థానం ఉండదు. భేదభావాలకు అతీతంగా మన ఆలోచనలు, కర్మలు శాంతి దిశగా సాగుతాయి. కులమతాలు, లింగభేదాలు మనలను ఆవహించవు. విశ్వనరులమై, ప్రకృతితో మమేకమై శాంతియుతంగా ఆనందకరమైన జీవితాన్ని జీవించగలుగుతాం తద్వారా గీతలో చెప్పబడినట్లుగా కర్మయోగులమై విశిష్ట ఉన్నతిని పొందగలుగుతాం. ఇదే విషయాన్ని ఈశావాస్యోపనిషత్తు ఎంత సుళువుగా చెప్పిందో చూడండి. వాయురనిలమమృతమథేదం భస్మాన్తగ్‌ం శరీరమ్! ఓం క్రతో స్మర కృతగ్‌ం స్మర క్రతో స్మర కృతగ్‌ం స్మర!! ఈ శరీరం కాలి బూడిదైపోతుంది. ఇందులోని ప్రాణం మరణం లేని ప్రాణం(అనంతశక్తి)లో కలిసిపోతుంది. ఓ మనసా! చేసిన వాటిని చింతన చేసి చూడు..... మానవ వికాస తొలినాళ్లలో ఎంత అద్భుత ఆలోచన! నేటి సైంటిస్టులూ తేల్చుకోలేని విషయాన్ని రెండుపాదాల శ్లోకంలో గుదిగుచ్చడమెంత విచిత్రం! మనమూ అజ్ఞానంతో పునర్జన్మ, గతజన్మ అంటూ ఊహించుకోవడమెంత గమ్మత్తు! ధర్మబద్ధకర్మ మన కర్తవ్యం. ఆ ధర్మబద్ధ కర్తవ్యం మనమే చేసినా, దాని పలితం మనమే అనుభవించినా దానిని అంటుకోని నిష్కామ స్థితే మోక్షస్థితి. అష్టావక్ర, శివగీతల్లో చిత్జడ గ్రంథి నశించడమే మోక్షం అని చెప్పడమైంది. అంటే ఏదేని విషయవాసన లేని మానసిక స్థితే మోక్షం. ఈ మోక్షస్థితి లోనే ఎనలేని ఆనందం అనుభవించగలుగుతాం. ఏ కర్మైనా మనకు సమానమే. ఏ ఫలితమైనా తృణప్రాయమే. – రావుల గిరిధర్ -
అనంతం నుంచి అనంతానికి...
సత్యంగా చెప్పబడే అనంతశక్తి సకల చరాచర సృష్టికి హేతువని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జ్ఞానం. ఒకే ఒక సత్యాన్ని కొందరు బ్రహ్మగా, మరికొందరు ఆత్మగా, మరి కొందరు ఈశ్వరునిగా గుర్తిస్తూ ఉండగా, సైంటిస్టులు విశ్వశక్తిగా లేక అనంతశక్తిగా నిర్ధరిస్తున్నారు.ఆ అనంతశక్తిని చూద్దామంటే చూడలేము. స్పృశిద్దామంటే స్పృశించలేము. అంతులేనిది, కాలాతీతమైనది. నిశ్చలంగా ఉండగలిగేది. ఖాళీ లేనంతగా వ్యాపితమైంది , రూపంలేనిది. అదే సమయంలో అన్ని ఖగోళరూపాలుగా మారగలిగేది. కాంతిగా, శబ్దంగా, ఉష్ణంగా, జీవంగా, నిర్జీవంగా, ఏ పదార్థంగానైనా మారగలిగేది. కొలమానాలకు అతీతమైనది. దానిని అర్థం చేసుకోవడమే సాధ్యమవుతుంది. అటువంటి మహాశక్తి గురించి ఉపనిషత్తులు బ్రహ్మమని, సర్వత్రా వ్యాపించి ఉన్నది కాబట్టి ఆత్మ అనీ విశ్లేషణలు చేశాయి. వేల సంవత్సరాల క్రితమే మహర్షులు ఆ అనంత శక్తిని ఏ విధంగా ఊహించగలిగారోనన్నది ఆశ్చర్యకరమైన విషయం. ఆత్మ అనంతము, సర్వరూపధారి, నిష్క్రియత్వమైనదని శ్వేతాశ్వతరోపనిషత్ చెప్పగా, అది సత్యం, అదే ఆత్మ అంటూ ఛాందోగ్యోపనిషత్ అంటుండగా, అందరిలో ఉండే నీ ఆత్మయే అతడు అంటూ బృహదారణ్యకోపనిషత్ తేటతెల్లం చేస్తోంది. ఆత్మ సర్వాంతర్యామి కాబట్టి, మనలో కూడా ఆ అనంత శక్తే నిండి ఉన్నదనేది తెలుసుకోవాలి. భౌతిక రూపాలు వేరు కాబట్టి లక్షణాలు మాత్రమే భిన్నంగా కనిపిస్తున్నాయి. ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రకారం జీవుల పుట్టుకకు కారణం సూర్యరశ్మి, భూమి, జలం, వాయువు అని తెలుస్తోంది. ఆధ్యాత్మికత ఒక అడుగు ముందుకువేసి ఈ నాలుగు శక్తులకు ఆకాశాన్ని జోడించి పంచభూతాలుగా పేర్కొన్నది. విజ్ఞానశాస్త్ర పరంగా ఆలోచిస్తే భూమి తదితర గ్రహాలు సూర్యుని నుండి పుట్టినవి. ఈ సూర్యునిలో ఉన్నవి హైడ్రోజన్, హీలియం వాయువులు. ఈ వాయువుల్లో ఉండే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు అత్యల్ప ప్రమాణాల్లోనే ఉన్నవి. కేంద్రక సంలీనం ప్రక్రియ వలననే ఈ సౌరశక్తి జనిస్తుంది! ఈ అత్యల్ప ప్రమాణాల ఎలక్టాన్ర్, ప్రోటాన్, న్యూట్రాన్లు క్వార్కు లాంటి అత్యంత సూక్ష్మకణాలనుండి ఉద్భవించినవని, ఈ క్వార్కులు అనంతశక్తి నుండి రూపాంతరం చెందినవే. అంటే ఆధ్యాత్మికంగా ఆత్మగా చెప్పబడే అనంతమైన శక్తి నుండి ఉద్భవించినవేనని ఆధునిక విజ్ఞాన శాస్త్రం తెలుపుతోంది. అనంతశక్తిలోనే ఉద్భవించి, చరించి, కాలప్రమాణం ముగిసిన అనంతరం తిరిగి ఈ భౌతిక రూపాలన్నీ శక్తి రూపాన్ని పొందుతూ వస్తున్నాయి. మరోవిధంగా చెప్పుకుంటే జీవి తన ప్రాణం కోల్పోయిన తర్వాత దహించ బడితే, ఆ శరీరం కొంత ఉష్ణం, కొంత వాయువు, కొంత నీటి ఆవిరి, కొంత బూడిద, కొంత కాంతిశక్తిగా విఘటనం చెందుతుంది. అవే పంచభూతాలని మనకు తెలుసు. – గిరిధర్ రావుల -
విజేత గిరిధర్ – షాన్ రెడ్డి జంట
సాక్షి, హైదరాబాద్: ‘ఆడి’ క్వాట్రో కప్ ఇండియా ఫైనల్స్ టోర్నీలో ‘ఆడి హైదరాబాద్’ శాఖ గోల్ఫర్లు గిరిధర్ తోట – షాన్ రెడ్డి విజేతలుగా నిలిచారు. థాయ్‌లాండ్‌లోని బన్యన్ గోల్ఫ్ క్లబ్లో జరిగిన ఈ టోర్నమెంట్లో వీరిద్దరూ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ‘గ్రీన్సమ్ స్టేబుల్‌ఫోర్డ్’ ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో 800 మంది గోల్ఫర్లు తలపడగా... హైదరాబాద్‌కు చెందిన ఈ జంట 45 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ‘ఆడి కోల్‌కతా’కు ప్రాతినిధ్యం వహించిన అతుల్ అల్మాల్ – రోహన్ ష్రాఫ్ ద్వయం 38 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. 37 పాయింట్లు సాధించిన ‘ఆడి గుర్గావ్’ జోడీ వివేక్ భరద్వాజ్ – సిద్ధాంత్ ఖోస్లా మూడో స్థానాన్ని దక్కించుకుంది. సెప్టెంబర్ 23 నుంచి 27 వరకు ఆస్ట్రియా వేదికగా ‘ఆడి క్వాట్రో కప్ వరల్డ్ ఫైనల్స్’ టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీలో 47 దేశాలకు చెందిన గోల్ఫర్లు తలపడతారు. -
ఈజీ మనీ కోసం..
ఆలీరజా, మధుమిత కృష్ణ, ఐశ్వర్య అడ్డాల ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘నా రూటే సెపరేటు’. గిరిధర్ దర్శకత్వంలో భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై ఎమ్.సుబ్బలక్ష్మి (శ్రీదేవి) నిర్మించారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఈజీ మనీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. నేటితరం యువత ఈజీగా డబ్బు సంపాదించేందుకు ఎటువంటి మార్గం ఎన్నుకుంటున్నారు? దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? తమ తప్పు తెలుసుకుని ఏ విధంగా జీవితాన్ని చక్కబెట్టుకుంటున్నారు? అనే విషయాలను మా సినిమాలో చూపిస్తున్నాం. త్వరలో పాటలను, అక్టోబర్‌లో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘గతంలో ‘లజ్జ' సినిమాలో నటించా. ఆ సినిమా తర్వాత నటనకు ఆస్కారం ఉన్న పాత్రను ‘నా రూటే సెపరేటు’ సినిమాలో చేశా. ఈ చిత్రంతో ఓ మెట్టు ఎదుగుతాననే నమ్మకం ఉంది’’ అన్నారు మధుమిత కృష్ణ. -
ఏసీబీ వలలో ఇద్దరు ఇరిగేషన్ ఎఈలు
–రూ.48వేలు లంచం తీసుకొంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత నెల్లూరు(క్రైమ్): నీరు-చెట్టు పనుల్లో కాంట్రాక్టర్ వద్ద నుంచి లంచం తీసుకొంటుండగా ఇద్దరు ఇరిగేషన్ ఏఈలను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. అధికారుల సమాచారం మేరకు.. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలానికి చెందిన శాకమూరి సుందరనాయుడు క్లాస్–3 కాంట్రాక్టర్. 2016 ఆగస్టులో నీరు-చెట్టు పథకం కింద కొన్ని చెరువుల మరమ్మత్తులు, కోర్‌వెల్ నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. సుందరనాయుడు మావూరమ్మ చెరువుకట్టపనికి రూ. 26,25,368తో, వెంకటగిరి ట్యాంకు కోర్‌వెల్ నిర్మాణానికి రూ.32,83,922తో టెండర్లు వేసి పనులు దక్కించుకొన్నాడు. వాటి నిర్మాణ పనులను తన బంధువు అయిన శ్రీరామచౌదరికి అప్పగించి ఈ ఏడాది ఏప్రిల్ 2017 నాటికి పూర్తిచేయించాడు. ఈ క్రమంలో ఈ పనులకు సంబంధించిన ఎం బుక్‌లు ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ ఏఈలు చంద్రమౌళి, గిరిధర్ల వద్దకు వచ్చాయి. దీంతో శ్రీరామచౌదరి ఈ నెల 12వ తేదిన ఏఈ గిరిధర్‌రాజుకు ఫోన్ చేయగా మంగళవారం నెల్లూరుకు వచ్చి తనతో, చంద్రమౌళితో మాట్లాడాలని సూచించారు. దీంతో జరిగిన విషయాన్ని శ్రీరామచౌదరి కాంట్రాక్టర్ సుందరనాయుడుకు చెప్పడంతో ఆయన మంగళవారం నెల్లూరుకు వచ్చి ఏఈలను కలిశారు. ఈ సందర్భంగా ఎఈలు ఎం బుక్స్‌ను పరిశీలించి పంపాలంటే రూ.30వేలు, గిరిధర్ వద్ద ఉండే బుక్స్ పంపాలంటే రూ. 18వేలు ఇవ్వాలని లేదంటే బుక్స్ అధికారులకు పంపేది లేదని తేల్చిచెప్పారు. వారికి లంచం ఇవ్వడం ఇష్టంలేని సుందరనాయుడు అదేరోజు జరిగిన విషయాన్ని ఏసీబీ డీఎస్పీ పి.పరమేశ్వర్‌రెడ్డికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి నెల్లూరు ఇరిగేషన్ కార్యాలయంలో బాధితుడు రూ.48వేలు నగదును ఏఈలకు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ తన సిబ్బందితో నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. దాడుల్లో సీఐలు శివకుమార్‌రెడ్డి, శ్రీహరిరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర సర్వీసులకు గిరిధర్, లవ్ అగర్వాల్
-కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్లో సంయుక్త కార్యదర్శిగా గిరిధర్ నియామకం -రిలీవ్ చేయమని సీఎస్‌కు గిరిధర్ దరఖాస్తు సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర సర్వీసు నుంచి ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు కేంద్ర సర్వీసుకు వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం రాష్ర్ట పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శిగా పనిచేస్తున్న 1988 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఎ. గిరిధర్‌ను కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్లో సంయుక్త కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీంతో రాష్ట్ర సర్వీసు నుంచి రిలీవ్ అయ్యి కేంద్ర సర్వీసుకు వెళ్లిపోవాలని గిరిధర్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర సర్వీసు నుంచి రిలీవ్ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సోమవారం గిరిధర్ దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో గిరిధర్ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అయితే రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరిక మేరకు కేంద్ర సర్వీసు నుంచి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసేందుకు రాష్ట్ర సర్వీసుకు గిరిధర్ వచ్చారు. విభజన క్లిష్ట సమయంలో గిరిధర్ ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా కీలక బాధ్యతలను నిర్వహించారు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పనిచేశారు. అయితే చెప్పుడు మాటలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గిరిధర్‌ను మున్సిపల్ శాఖకు బదిలీ చేశారు. మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శిగా కూడా గిరిధర్ సింగపూర్ ప్రభుత్వం, అక్కడ కంపెనీలతో రాజధాని మాస్టర్ ప్రణాళిక రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. అయితే సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు చెప్పినట్లు చేసేందుకు, ముఖ్యంగా మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పినట్లు చేసేందుకు గిరిధర్ అంగీకరించలేదు. ఇక మున్సిపల్ శాఖలో పనిచేసే వాతావరణం లేదని గిరిధర్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శిగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గిరిధర్ కేంద్ర సర్వీసుకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మార్గం సుగమమైంది. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి 1996 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన లవ్ అగర్వాల్ కూడా కేంద్ర సర్వీసుకు వెళ్లిపోతున్నారు. అగర్వాల్ ప్రస్తుతం విపత్తుల శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇంతకు ముందు అగర్వాల్ గృహ నిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ప్రభుత్వం ఇటీవల ఆయనను విపత్తుల శాఖ కమిషనర్‌గా బదిలీ చేసింది. లవ్ అగర్వాల్‌ను కేంద్ర ప్రభుత్వం వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శిగా నియమించింది. దీంతో అగర్వాల్ కూడా రాష్ట్ర సర్వీసు నుంచి కేంద్ర సర్వీసుకు వెళ్లిపోనున్నారు. -
ఏపీపీఎస్సీ కార్యదర్శిగా గిరిధర్!
* ఈ నెల 1 నుంచి సెలవులో ఉన్న గిరిధర్ * రాజధాని పనుల్లో ప్రభుత్వ విధానాలు నచ్చక కినుక సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎ. గిరిధర్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా గిరిధర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అనుసరిస్తున్న విధానాలు, తీరు నచ్చక గిరిధర్ ఈ నెల 1 నుంచి సెలవులో ఉన్నారు. తనను మున్సిపల్ శాఖ బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా ఆయనే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖలో కీలక పోస్టులో ఉన్న గిరిధర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కార్యాలయ ముఖ్యకార్యదర్శిగా తొలుత నియమించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తొలి రోజుల్లో సీఎం కార్యాలయం ముఖ్యకార్యదర్శిగా గిరిధర్ అలుపెరగక రాత్రింబగళ్లు పనిచేశారు. కష్టపడి పనిచేసినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత మంది వందిమాగధుల చెప్పుడు మాటలను విని గిరిధర్‌ను సీఎం కార్యాలయం నుంచి మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు. కొత్త రాజధాని నిర్మాణం, సింగపూర్ కంపెనీలతో మాస్టర్ ప్రణాళిక రూపకల్పన అంశాల్లో గిరిధర్ కీలక భూమిక పోషించారు. మాస్టర్ ప్రణాళికలోని అంశాలపైన, మాస్టర్ డెవలపర్ ఎంపిక, స్విస్ చాలెంజ్‌పై ప్రభుత్వ విధానాలు గిరిధర్‌కు ఏ మాత్రం నచ్చలేదు. దీంతో ఆయన ఈ నెల 1 నుంచే సెలవులో ఉన్నారు. గిరిధర్‌ను బదిలీ చేసినప్పటికీ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శిగా ఎవరినీ నియమించలేదు. ప్రస్తుతం ఆ బాధ్యతలను మున్సిపల్ శాఖ కార్యదర్శి జయలక్ష్మి చూస్తున్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా కరికాల వలవన్ యువజన సర్వీసుల ముఖ్యకార్యదర్శిగా పని చేస్తున్న కరికాల వలవన్‌ను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్‌గా కూడా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇదివరకు పౌరసరఫరాల కమిషనర్‌గా ఉన్న బి.రాజశేఖర్ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితమే పి.ఎస్. గిరీష్‌ను అనంతపురం జిల్లా పెనుకొండ సబ్ కలెక్టర్‌గా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించి ఆయనకు నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్‌గా నియమిం చింది.డిప్యుటేషన్‌పై వచ్చిన ఐఆర్ఎస్ అధికారి గోపీనాధ్‌ను రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వుల జారీ చేశారు. -
కీలక అధికారి లేకుండానే.. మాస్టర్ ప్లాన్ ఒప్పందం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ కారదర్శి గిరిధర్ లేకుండా ఏపీ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ఒప్పందం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం సింగపూర్ బృందం మాస్టర్ ప్లాన్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందజేసింది. గిరిధర్ సమక్షంలో జరగాల్సిన ఈ ఒప్పందం ఆయన లేకుండానే చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు, ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణలతో గిరిధర్‌కు విబేధాల వల్లే ఆయన సెలవులో వెళ్లారని సమాచారం. ఈ నెల 11 నుంచి గిరిధర్ సెలవులో ఉన్నారు. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని గిరిధర్ వ్యతిరేకించారని తెలుస్తోంది. తనను పట్టణాభివృద్ధి శాఖ నుంచి బదిలీ చేయాలని గిరిధర్ కోరుతున్నట్టు సమాచారం. చంద్రబాబు ఇటీవలి జపాన్ పర్యటనకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. -
కీలక అధికారి లేకుండానే.. మాస్టర్ ప్లాన్ ఒప్పందం
-
నిఘా నేత్రం
కుంటాల/భైంసా రూరల్ : భైంసా పట్టణంలో ప్రతిష్టించిన వినాయకులకు తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజలు జరిపిన పట్టణవాసులు శనివారం నిమజ్జనం చేయనున్నారు. పట్టణ సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులో నిమజ్జనం కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద ప్రత్యేకంగా భారీకేడ్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్రెయిన్ తీసుకొచ్చి భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఉత్సవాలపై నిఘా భైంసా పట్టణంలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు ఉత్సవాలపై ప్రత్యేక దృష్టిసారించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పికెటింగ్‌లు వేశారు. పెట్రోలింగ్ నిర్వహిస్తు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శోభాయాత్ర నిర్వహించే ప్రధాన రహదారుల్లోని విద్యుత్ తీగలను, కేబుల్ తీగలతో ప్రమాదం లేకుండా జాగ్రత్త చర్యలు పాటించాలని ట్రాన్స్‌కో సిబ్బందికి ఇప్పటికే అధికారులు సూచించారు. భారీ బందోబస్తు శనివారం భైంసా పట్టణంలో నిమజ్జనోత్స వం సందర్భంగా భైంసా డీఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలు శాంతియుతంగా నిమజ్జనోత్సవాలను జరుపుకోవాలని పేర్కొన్నారు. ఇందుకోసం డీఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లోని, పట్టణంలోని బెల్టుషాపులు, మద్యం దుకాణాలు మూసివేయించారు. సమావేశాలతో.. ఇప్పటికే పట్టణంలో శాంతి, ఉత్సవ కమిటీ, గణేశ్ మండలీలు, యువజన సంఘాలవారితో పోలీసులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలని నిమజ్జనోత్సవ శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని విన్నవించారు. నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రత్యేక బృందాలను మండపాల వద్ద ఏర్పాటు చేసి సమాచారాన్ని తెలుకుంటూ ఉన్నత అధికారులకు చేరవేస్తున్నారు. ఏర్పాట్లలో.. నిమజ్జనోత్సవం కోసం పట్టణంలో మున్సిపల్ వైఎస్ చైర్మన్ జాబిర్‌అహ్మద్, మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్‌లు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. రోడ్లపై మొరం వేసినా అధికారులు గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద ప్రత్యేక బారికేడ్లను కట్టారు. క్రేన్ ద్వారా ప్రాజెక్టులో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గణేశ్ మండళ్ల సభ్యులు నిమజ్జనోత్సవ శోభాయాత్ర కోసం ట్రాక్టర్లను సిద్ధం చేసుకుంటున్నారు. మండళ్ల సభ్యులు ప్రత్యేక జనరేటర్లను తెప్పించుకున్నారు. గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా పట్టణానికి ఇప్పటికే ప్రత్యేక బ్యాండ్ మేళాలు చేరుకున్నాయి. భజన మండళ్ల సభ్యులు, కోలాటాలు వేసేవారు నిమజ్జనోత్సవ శోభాయాత్రకు సిద్ధమవుతున్నారు. శోభాయాత్ర భైంసా పట్టణంలో ఎప్పటిలాగే మొదట గోపాలకృష్ణ మందిరంలోని సార్వజనిక్ గణేశ్ వద్ద, గణేశ్‌నగర్‌లోని మున్నూరుకాపు సంఘ భవనంలో ప్రతిష్టించే వినాయకుని వద్ద జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభిస్తారు. అనంతరం పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభిస్తారు. శోభయాత్ర గణేశ్నగర్మీదుగా కోర్వగల్లి, పంజేషాచౌక్ మీదుగా వస్తాయి. నిర్మల్ చౌరస్తాలో ప్రతిష్టించిన వినాయకులు బస్టాండ్ మీదుగా మున్సిపల్ కార్యాలయం నుంచి పంజేషాచౌక్ చేరుకుంటాయి. పంజేషాచౌక్ చేరుకున్న వినాయక నిమజ్జన శోభాయాత్ర కిసాన్‌గల్లి చేరుకుంటుంది. కిసాన్గల్లిలో ప్రతిష్టించిన వినాయకులను పురాణాబజార్ మీదుగా టీటీడీ కల్యాణ మండపం, కుభీర్ రోడ్డుగుండా తీసుకెళ్లి గడ్డెన్నవాగు ప్రాజెక్టులో నిమజ్జనం చేస్తారు.