విజేత గిరిధర్‌ – షాన్‌ రెడ్డి జంట | Giridhar, Shan Reddy Pair got audi quattro golf Title | Sakshi
Sakshi News home page

విజేత గిరిధర్‌ – షాన్‌ రెడ్డి జంట

Published Tue, Jul 3 2018 10:22 AM | Last Updated on Tue, Jul 3 2018 10:22 AM

Giridhar, Shan Reddy Pair got audi quattro golf Title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆడి’ క్వాట్రో కప్‌ ఇండియా ఫైనల్స్‌ టోర్నీలో ‘ఆడి హైదరాబాద్‌’ శాఖ గోల్ఫర్లు గిరిధర్‌ తోట – షాన్‌ రెడ్డి విజేతలుగా నిలిచారు. థాయ్‌లాండ్‌లోని బన్యన్‌ గోల్ఫ్‌ క్లబ్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో వీరిద్దరూ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ‘గ్రీన్‌సమ్‌ స్టేబుల్‌ఫోర్డ్‌’ ఫార్మాట్‌లో జరిగిన ఈ పోటీల్లో 800 మంది గోల్ఫర్లు తలపడగా... హైదరాబాద్‌కు చెందిన ఈ జంట 45 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.

‘ఆడి కోల్‌కతా’కు ప్రాతినిధ్యం వహించిన అతుల్‌ అల్మాల్‌ – రోహన్‌ ష్రాఫ్‌ ద్వయం 38 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. 37 పాయింట్లు సాధించిన ‘ఆడి గుర్గావ్‌’ జోడీ వివేక్‌ భరద్వాజ్‌ – సిద్ధాంత్‌ ఖోస్లా మూడో స్థానాన్ని దక్కించుకుంది. సెప్టెంబర్‌ 23 నుంచి 27 వరకు ఆస్ట్రియా వేదికగా ‘ఆడి క్వాట్రో కప్‌ వరల్డ్‌ ఫైనల్స్‌’ టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీలో 47 దేశాలకు చెందిన గోల్ఫర్లు తలపడతారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement