ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ కారదర్శి గిరిధర్ లేకుండా ఏపీ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ఒప్పందం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం సింగపూర్ బృందం మాస్టర్ ప్లాన్ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందజేసింది. గిరిధర్ సమక్షంలో జరగాల్సిన ఈ ఒప్పందం ఆయన లేకుండానే చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు, ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణలతో గిరిధర్కు విబేధాల వల్లే ఆయన సెలవులో వెళ్లారని సమాచారం. ఈ నెల 11 నుంచి గిరిధర్ సెలవులో ఉన్నారు. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని గిరిధర్ వ్యతిరేకించారని తెలుస్తోంది. తనను పట్టణాభివృద్ధి శాఖ నుంచి బదిలీ చేయాలని గిరిధర్ కోరుతున్నట్టు సమాచారం. చంద్రబాబు ఇటీవలి జపాన్ పర్యటనకు కూడా ఆయన దూరంగా ఉన్నారు.
Published Mon, Jul 20 2015 7:14 PM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement