![Tollywood Director Giridhar Passed Away - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/2/giri.jpg.webp?itok=MXdZlApy)
టాలీవుడ్‌దర్శకుడు,నటుడు ఇరుగు గిరిధర్(64)కన్నుమూశారు. ఆరేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గిరిధర్ అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు. ఆదివారం తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
చిత్తూరు జిల్లా పాకాల మండలం ఇరంగారిపల్లెలో 1957 మే 21న ఆయన జన్మించాడు. 1982లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. టాలీవుడ్ సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి, గుణశేఖర్, ఈవీవీ సత్యనారాయణ వంటివారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా గిరిధర్ పనిచేశారు.
గుడుంబా శంకర్, అన్నవరం, వన్, సుప్రీమ్, వరుడు వంటి సినిమాలకు కోడైరెక్టర్‌గానూ పనిచేశారు. చంద్రమోహన్, ఆమని, ఇంద్రజ, వినోద్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన శుభముహూర్తం సినిమాకు దర్శకత్వం వహించి, తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. అలాగే, ఎక్స్‌ప్రెస్ రాజా, 100 పర్సంట్ లవ్, సర్దార్ గబ్బర్ సింగ్, శ్రీమంతుడు తదితర 20 సినిమాల్లో నటించారు. గిరిధర్ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment