
తమిళ సినిమా: నటుడు శింబు అభిమానులకు ఈ పొంగల్ చాలా స్పెషల్ కానుంది. సుశీంద్రన్ దర్శకత్వంలో నటించిన ఈశ్వరన్ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈనెల 14వ తేదీన తెరపైకి రానుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన పక్కా కమర్షియల్ అంశాలతో కూడిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మానాడు చిత్ర షూటింగ్‌లో శింబు పాల్గొంటున్నారు. దీన్ని వీ హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత సురేష్ కామాక్షి నిర్మిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కథానాయికగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లు ఇదివరకే విడుదలై శింబు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. తాజాగా మానాడు చిత్ర మోషన్ పోస్టర్‌ను సంక్రాంతి రోజున విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు ఆదివారం వెల్లడించాయి. అదే రోజు శింబు నటించిన ఈశ్వరన్ చిత్రం విడుదల కానుండడంతో ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment