tamailanadu
-
లాటరీ టికెట్ల వ్యాపారి ఇంట్లో రూ.2.25 కోట్ల సీజ్
తిరువొత్తియూరు: కోవై కరుమత్తంపట్టి సమీపంలో లాటరీ టికెట్ విక్రయ వ్యాపారి ఇంటిలో రూ. 2. 25 కోట్లు నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. కోవై జిల్లాలో లాటరీ టికెట్లు విక్రయాలు జరపకుండా పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందం పోలీసులు బుధవారం జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. కరుమత్తం పట్టి సమీపంలో ద్విచక్ర వాహనంలో వచ్చిన వ్యక్తిపై సందేహంతో తనిఖీ చేయగా అందులో లాటరీ టికెట్లు, నగదు ఉంది. విచారణలో నిందితుడు కోవై సెంథిల్ నగర్‌కు చెందిన నాగరాజు (42)అని, కేరళ రాష్ట్రం సరిహద్దు ప్రాంతం నుంచి లాటరీ టికెట్లను తీసుకుని వచ్చి విక్రయిస్తున్నట్లు తెలిసింది. దీంతో సందేహ పడిన పోలీసులు అతని ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు. ఆ సమయంలో అక్కడున్న అట్ట పెట్టెలలో కట్టలు కట్టలుగా రూ 500, రూ 200, రూ. 50, రూ. 20 రూ.10, అని కరెన్సీ నోట్లు ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. దీంతో పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు దీనిపై కరుతంపట్టి డిప్యూటీ ఎస్పీ తంగ రామన్ అక్కడికి చేరుకుని నగదును లెక్కింపు పనిలో నిమగ్నమయ్యారు. తర్వాత మొత్తం రూ.2.25 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. అందులో 112 చల్లని 2000 రూపాయల నోట్లు ఉన్నట్లు వెల్లడించారు. తర్వాత నాగరాజును అరెస్టు చేసి అతని వద్ద నుంచి 1800 కేరళ లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
మదురై అసిస్టెంట్ జైలర్ వేధింపులు..
అన్నానగర్: అసిస్టెంట్ జైలర్ వేధింపులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మదురై అరసరడిలోని సెంట్రల్ జైలులో బాలగురుసామి అనే వ్యక్తి అసిస్టెంట్ జైలర్‌గా పనిచేసేవాడు. కొన్నాళ్ల కిందట సెంట్రల్ జైలులో ఉన్న ఓ ఖైదీని కలవడానికి అతని భార్య పిటిషన్ దాఖలు చేసింది. ఆమెను పరిచయం చేసుకున్న అసిస్టెంట్ జైలర్ ఆమెతో పాటు వచ్చిన యువతిని లైంగికంగా వేధించాడు. ఆ మహిళ మదురై మహిళా పోలీస్ స్టేషన్లో ఈ విషయమై ఫిర్యాదు చేసింది.విచారణ నిమిత్తం తల్లి, కూతుళ్లు అసిస్టెంట్ జైలర్‌పై దాడికి పాల్పడిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై శాఖాపరమైన విచారణలు జరిపారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ జైలర్ బాలగురుస్వామిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో బాలగురుసామిని సస్పెండ్ చేస్తూ మదురై జైళ్ల శాఖ డీఐజీ పళని ఆదేశాలు జారీ చేశారు. బాలగురుసామిని విచారించగా పలు రకాల సమాచారం బయటకు వచ్చింది. దీంతో అతడిని మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. అమ్మాయిలను టార్గెట్ చేసి సాన్నిహిత్యం ప్రదర్శించి పలువురు మహిళలను అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. அவரு ஆபீசரா இருக்கலாம்.. அதுக்காக மகளை கேட்பாரா..? மத்திய சிறை உதவி ஜெயிலர் பாலகுருசாமி மீது வழக்குப்பதிவு pic.twitter.com/YMRXLMv97a— Mahalingam Ponnusamy (@mahajournalist) December 22, 2024 -
సీఏఏ చట్టం.. దళపతి విజయ్ ఏమన్నారంటే?
2019లో ఆమోదం పొందిన సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ) అమలుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. అయితే, సీఏఏ చట్టంపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పలువరు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ప్రముఖ హీరో, దళపతి విజయ్ తన పార్టీ ‘తమిళగ వెట్రి కగళం’ తరుపున స్పందించారు. ఎక్స్.కామ్ పోస్ట్‌లో సీఏఏపై కేంద్రం నిర్ణయం ఆమోద యోగ్యం కాదని ప్రకటన చేశారు. ‘దేశంలోని పౌరులందరూ సామాజిక సామరస్యంతో జీవించే వాతావరణంలో భారత పౌరసత్వ సవరణ చట్టం 2019 (CAA) వంటి ఏ చట్టాన్ని అమలు చేయడం ఆమోదయోగ్యం కాదు’ అని దళపతి విజయ్ తమిళంలో చేసిన ప్రకటనలో ఉంది. #CitizenshipAmendmentAct pic.twitter.com/4iO2VqQnv4 — TVK Vijay (@tvkvijayhq) March 11, 2024 అంతేకాదు తమిళనాడులో ఈ చట్టం అమలుకు నోచుకోకుండా నాయకులు చూసుకోవాలని కోరారు. విజయ్‌తో పాటు, ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా పౌరసత్వ (సవరణ) చట్టంపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. -
శింబు అభిమానులకు పొంగల్ స్పెషల్
తమిళ సినిమా: నటుడు శింబు అభిమానులకు ఈ పొంగల్ చాలా స్పెషల్ కానుంది. సుశీంద్రన్ దర్శకత్వంలో నటించిన ఈశ్వరన్ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈనెల 14వ తేదీన తెరపైకి రానుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన పక్కా కమర్షియల్ అంశాలతో కూడిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మానాడు చిత్ర షూటింగ్లో శింబు పాల్గొంటున్నారు. దీన్ని వీ హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత సురేష్ కామాక్షి నిర్మిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కథానాయికగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లు ఇదివరకే విడుదలై శింబు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. తాజాగా మానాడు చిత్ర మోషన్ పోస్టర్‌ను సంక్రాంతి రోజున విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు ఆదివారం వెల్లడించాయి. అదే రోజు శింబు నటించిన ఈశ్వరన్ చిత్రం విడుదల కానుండడంతో ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ఉదయం పెళ్లి.. రాత్రి జైలుకు
సాక్షి ప్రతినిధి, చెన్నై: పెళ్లంటే నూరేళ్ల పంట. స్త్రీ, పురుషులు ఒకరి కోసం ఒకరుగా కలిసిమెలసి పండించుకోవాల్సిన నిండైన జీవితం. కొందరు యువతుల జీవితాల్లో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. భార్యల కాళ్లపారాణి ఆరకముందే వారి భర్తలు కటకటాల వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇదేం చోద్యమని సాక్షాత్తు న్యాయమూర్తులే ఆశ్చర్యం వ్యక్తంచేశారు. విచారణ జరపాలని జాతీయ మహి ళా కమిషన్‌ను ఆదేశించారు. యావజ్జీవ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న తన భర్త కు పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ ఒక యువతి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు ఎన్ కృపాకరన్, వీఎం వేలుమణి విచారించారు. పెళ్లి చేసుకునేటప్పు తన భర్త ఒక యావజ్జీవ ఖైదీ అనే విషయం తెలియదని ఆమె చెప్పింది. ఒక హత్య కేసులో కింది కోర్టు భర్తకు యావజ్జీవ శిక్ష విధించడాన్ని హైకోర్టులో సవాలు చేసి జామీనుపై బయటకు వచ్చిన సమయంలో తనను పెళ్లిచేసుకున్నాడని పేర్కొంది. దీంతో న్యాయమూర్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇలాంటి కేసులు మరికొన్ని దాఖలయ్యాయి. గతంలో అస్లాం అనే ఖైదీకి 30 రోజుల పెరోల్ మంజూరు చేసేలా జైళ్ల శాఖను ఆదేశించాలని కోరుతూ అతడి భార్య అడ్‌కొనర్వ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మహిళ తన భర్త ఒక యావజ్జీవ ఖైదీ అని తెలిసే పెళ్లి చేసుకుంది. 20 ఏళ్లుగా జైల్లో ఉంటున్న భర్తను పెరోల్‌పై విడుదల చేయాల్సిందిగా కోరింది. పదేళ్లకు ముందు ఒక్కరోజు పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చినపుడు పెళ్లి చేసుకున్నాడని, అదే రోజు రాత్రి జైలుకు వెళ్లిపోవడంతో అత్తగారితోపాటూ ఉంటు న్నట్లు తెలిపింది. దీనిపై న్యాయమూర్తులు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో పెళ్లి చేసుకునే వారు అనేక వివరాలను సేకరిస్తున్నారని, ఒక ఖైదీని, అందునా యావజ్జీవ ఖైదీని వివాహమాడేందుకు ఏ యువతీ అంగీకరించదన్నారు. యువతుల అభీష్టం మేరకు పెళ్లిళ్లు జరుగుతున్నాయా? లేక బలవంతంగా చేస్తున్నారా అన్న దానిపై విచారణ చేసి బదులు పిటిషన్ వేయాలని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్, మహిళా శిశు సంక్షేమం, అభివృద్ధి శాఖలను ఆదేశిస్తున్నట్టు ప్రకటించారు. కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు. -
ఎన్‌కౌంటర్‌పై భగ్గుమన్న తమిళ పార్టీలు
చెన్నై : ఎర్ర చందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్‌ను తమిళనాడులోని రాజకీయ పార్టీలు తప్పబట్టాయి. ఎన్‌కౌంటర్‌పై సమగ్ర దర్యాప్తుకు ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోతో పాటు తమిళ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పోలీసులే ఏకపక్షంగా కాల్పులు జరిపారని వైగో ఆరోపించారు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మంగళవారం చిత్తూరు ఎన్‌కౌంటర్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎర్రచందనం కూలీల వివరాల కోసం తమిళనాడు పోలీసులు ..తిరుపతి రానున్నారు. కాగా చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమైన విషయం తెలిసిందే. వీరంతా తమిళనాడుకు చెందిన కూలీలు. మరోవైపు పరారీలో ఉన్న మిగతా స్మగ్లర్ల కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు, అటవీశాఖ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. మరోవైపు ఈ ఎన్ కౌంటర్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య దూరాన్ని పెంచినట్లు అయింది. దీనిపై తమిళనాడు కాంగ్రెస్ నేత ఇళంగోవన్ తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధించారు. పేదలకు సరైన పునరావాసం, ఉపాధి కల్పించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఆంధ్రాహోటళ్లు, బ్యాంకులు, ఆస్తులపై దాడులపై చేస్తామన్నారు.