తిరువొత్తియూరు: కోవై కరుమత్తంపట్టి సమీపంలో లాటరీ టికెట్ విక్రయ వ్యాపారి ఇంటిలో రూ. 2. 25 కోట్లు నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. కోవై జిల్లాలో లాటరీ టికెట్లు విక్రయాలు జరపకుండా పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందం పోలీసులు బుధవారం జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు.
కరుమత్తం పట్టి సమీపంలో ద్విచక్ర వాహనంలో వచ్చిన వ్యక్తిపై సందేహంతో తనిఖీ చేయగా అందులో లాటరీ టికెట్లు, నగదు ఉంది. విచారణలో నిందితుడు కోవై సెంథిల్ నగర్‌కు చెందిన నాగరాజు (42)అని, కేరళ రాష్ట్రం సరిహద్దు ప్రాంతం నుంచి లాటరీ టికెట్లను తీసుకుని వచ్చి విక్రయిస్తున్నట్లు తెలిసింది. దీంతో సందేహ పడిన పోలీసులు అతని ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు. ఆ సమయంలో అక్కడున్న అట్ట పెట్టెలలో కట్టలు కట్టలుగా రూ 500, రూ 200, రూ. 50, రూ. 20 రూ.10, అని కరెన్సీ నోట్లు ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు.
దీంతో పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు దీనిపై కరుతంపట్టి డిప్యూటీ ఎస్పీ తంగ రామన్ అక్కడికి చేరుకుని నగదును లెక్కింపు పనిలో నిమగ్నమయ్యారు. తర్వాత మొత్తం రూ.2.25 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. అందులో 112 చల్లని 2000 రూపాయల నోట్లు ఉన్నట్లు వెల్లడించారు. తర్వాత నాగరాజును అరెస్టు చేసి అతని వద్ద నుంచి 1800 కేరళ లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment