
అభిమానులనుద్దేశించి మాట్లాడుతున్న కార్తి
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): నగరంలో చినబాబు చిత్ర యూనిట్ సందడి చేసింది. చినబాబు చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా ఆదివారం జగదాంబ థియేటర్లో హీరో కార్తి అభిమానులతో సరదగా మాట్లాడారు. కుటుంబ సమేతంగా చినబాబు చిత్రం చూడాలన్నారు. ఇటీవల వైజాగ్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు చినబాబు చిత్రం ఆడియో రిలీజ్ చేశారని, చిత్ర విజయోత్సవాన్ని కూడా వైజాగ్‌లోనే నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. గంటా మాట ప్రకారం చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుందన్నారు.
వైజాగ్‌లో మంచి కలెక్షన్స్‌తో చిత్రం ఆడుతోందని, ప్రతి థియేటర్లో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో చిత్రం నడుస్తోందన్నారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూస్తే మంచి అనుభూతి పొందుతారని, ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్‌లు లేవని, అసభ్య దృశ్యాలు లేకుండా చిన్నారుల నుంచి అవ్వలు వరకు ఆనందంగా చూడదగ్గ సినిమాగా పేర్కొన్నారు. ఇంతటి విజయాన్ని అందించిన వైజాగ్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో థియేటర్ ప్రతినిధులు జగదీష్, వాసు తదితరులు పాల్గొన్నారు.

థియేటర్లో కేరింతలు కొడుతున్న అభిమానులు
Comments
Please login to add a commentAdd a comment