Hero karthik
-
హీరోయిన్‌తో పెళ్లి రూమర్స్, కార్లిటీ ఇచ్చిన యంగ్ హీరో
కోలీవుడ్‌లో నవరస నాయకుడు ఎవరంటే టక్కున వచ్చే సమాధానం కార్తీక్. ఈయన వారసుడే గౌతమ్ కార్తీక్. తనూ హీరోగా మంచి పేరు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. అదే సమయంలో ఇటీవల ఈయన ప్రేమ వ్యవహారంపై వదంతులు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. నటి మంజిమా మోహన్‌తో ప్రేమ అంటూ త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం జోరందుకుంది. గౌతమ్ కార్తీక్ నటి మంజిమా మోహన్ దేవరాట్టం చిత్రంలో జంటగా నటించారు. వీరిద్దరూ చట్టపటాలు వేసుకుని షికారు చేస్తున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. అయితే ఈ విషయంపై ఇటు గౌతం కార్తీక్ గాని, అటు మంజిమా మోహన్ గాని స్పందించడంలేదు. చదవండి: కార్తికేయ 2 సక్సెస్‌పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ హీరోలకు చురక ఇలాంటి పరిస్థితుల్లో నటుడు గౌతమ్ కార్తీక్ ఒక భేటీలో తన వివాహం గురించి స్పష్టత ఇచ్చారు. ఈ ఏడాదిలోనే తాను వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపారు. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. అయితే తన గురించి జరుగుతున్న ప్రచారం గురించి గానీ, నటి మంజమా మోహన్ ప్రస్తావని గాని ఈయన ఎక్కడ తీసుకురాలేదు. తాను నటుడుగా సాధించాలని ఈ రంగంలోకి వచ్చానని, అయితే కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయని అన్నారు. ఇకపై కథల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ వహించి మంచి చిత్రాలను చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే తాను పెళ్లి చేసుకోబోయే వధువు ఎవరు అన్నది చెప్పకపోవడంతో ఆ వధువు ఎవరు చెప్పు నవరస నాయకుడి వారసుడా.. అంటూ నెట్టింట్లో అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: తొలి రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన ఆలియా.. -
కార్తీకి గాయం
కోలీవుడ్‌ను గాయాలు వెంటాడుతున్నట్టున్నాయి. ఇటీవలే ‘వలిమై’ చిత్రీకరణలో హీరో అజిత్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో గాయపడ్డారు. ఆ తర్వాత ‘ఇండియన్ 2’లో జరిగిన భారీ ప్రమాదం గురించి తెలిసిందే. తాజాగా హీరో కార్తీ కూడా గాయపడ్డారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో కార్తీ గాయపడ్డారని సమాచారం. రాజుల కాలం నాటి సినిమా కాబట్టి యుద్ధ సన్నివేశాలు, గుర్రపు స్వారీ సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉంటాయట. అలాంటి ఓ సన్నివేశం చిత్రీకరణలో గుర్రం మీద నుంచి అదుపు తప్పి కింద పడిపోయారట కార్తీ. పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదని టాక్. -
సిటీలో ‘చినబాబు’
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): నగరంలో చినబాబు చిత్ర యూనిట్ సందడి చేసింది. చినబాబు చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా ఆదివారం జగదాంబ థియేటర్లో హీరో కార్తి అభిమానులతో సరదగా మాట్లాడారు. కుటుంబ సమేతంగా చినబాబు చిత్రం చూడాలన్నారు. ఇటీవల వైజాగ్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు చినబాబు చిత్రం ఆడియో రిలీజ్ చేశారని, చిత్ర విజయోత్సవాన్ని కూడా వైజాగ్‌లోనే నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. గంటా మాట ప్రకారం చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. వైజాగ్‌లో మంచి కలెక్షన్స్‌తో చిత్రం ఆడుతోందని, ప్రతి థియేటర్లో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో చిత్రం నడుస్తోందన్నారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూస్తే మంచి అనుభూతి పొందుతారని, ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్‌లు లేవని, అసభ్య దృశ్యాలు లేకుండా చిన్నారుల నుంచి అవ్వలు వరకు ఆనందంగా చూడదగ్గ సినిమాగా పేర్కొన్నారు. ఇంతటి విజయాన్ని అందించిన వైజాగ్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో థియేటర్ ప్రతినిధులు జగదీష్, వాసు తదితరులు పాల్గొన్నారు. -
‘థాంక్స్ రెజీనా.. ఫర్ ది కోఆపరేషన్’
సాక్షి, చెన్నై: సినిమాకు కోఆపరేషన్, ఆపరేషన్ రెండూ జరుగుతుంటాయి. కోఆపరేషన్ చేస్తే ప్రశంసలు, ఆపరేషన్ అయితే ఫిర్యాదులు, కేసులు ఉంటాయి. ఇందులో హీరోయిన్ రెజీనా మొదటి కోవకు చెంది ప్రశంసలను అందుకుంది. అయితే అదేమిటో చూద్దాం. హీరోయిన్ రెజీనా కోలీవుడ్‌లో అడపాదడపానే మెరుస్తోంది. ఎక్కువగా తెలుగు చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తుందని అపవాదు కోలీవుడ్ వర్గాల్లో ఉంది. ప్రస్తుతం రెజీనా మిస్టర్ చంద్రమౌళి అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు కర్తీక్, ఆయన కొడుకు గౌతమ్ కర్తీక్ కలిసి నటించడం విశేషం. ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పార్టు ప్రణాళిక వేగంగా జరుపుకుని గురువారంతో పూర్తి చేసుకుంది. ఈ సినిమాను సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత ధనుంజయన్ తెలిపారు. షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. కేక్‌పై ‘థాంక్స్ రెజీ ఫర్ ది కోఆపరేషన్’ ఒన్ మోర్ డే ప్లీజ్ అంటూ పేర్కొనడం విశేషం. ఈ సందర్భంగా నిర్మాత ధనుంజయన్ మాట్లాడుతూ.. వృతిపై భక్తి కలిగిన నటి రెజీనా అని పేర్కొన్నారు. అంకితభావంలోనూ, నటనలనూ తనకు సాటి తనేనని పొగిడారు. ఈ చిత్రానికి ఆమె సహకారం చాలా ఉందని నిర్మాత చెప్పారు. -
డబుల్ ధమాకా
-
కోట్లాది రూపాయిల ఆస్తులు కోల్పోయిన హీరో
చెన్నై : సీనియర్ నటుడు, యువ నటుడు గౌతమ్ కార్తీక్ తండ్రి అయిన కార్తీక్ కోట్లాది రూపాయల పూర్వీకుల ఆస్తులను కోల్పోయారు. కుటుంబంతో నివశిస్తున్న ఇంటిని కూడా వదులుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకెళితే 1980-90 ప్రాంతంలో తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరో కార్తీక్. తెలుగులోను, అభినందన వంటి పలు హిట్ చిత్రాల్లో నటించి పేరుగాంచారు. కార్తీక్ తండ్రి ముత్తురామన్ మంచి నటుడే. ఈయనకు స్థానిక ఆల్వార్‌పేటలో పలు వాణిజ్య భవనాలు ఉన్నాయి. వీటి విలువ కోట్లాది రూపాయలు ఉంటుంది. ముత్తురామన్ పూర్వీకుల ఇంట్లోనే కార్తీక్ కుటుంబం నివశిస్తోంది. ముత్తురామన్‌కు కార్తీక్‌తోపాటు మరో కొడుకు, కూతుళ్లు ఉన్నారు. కార్తీక్ కుటుంబ సభ్యుల మధ్య ఇటీవల మనస్పర్థలు వచ్చారుు. గొడవల కారణంగా కార్తీక్ ఇల్లు వదిలి బయటకు పోవలసి వచ్చింది. తన తండ్రి ఆస్తిలో తనకు భాగం ఉందని కార్తీక్ వాదించినప్పటికీ ఫలితం లేకపోరుుంది. కుటుంబ సభ్యుల మోసానికి గురయ్యానని కార్తీక్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వెలిబుచ్చారు. తనకు జరిగిన మోసం గురించి ఆయన న్యాయవాదుల సలహా తీసుకునే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది.