సాక్షి, చెన్నై: సినిమాకు కోఆపరేషన్, ఆపరేషన్ రెండూ జరుగుతుంటాయి. కోఆపరేషన్ చేస్తే ప్రశంసలు, ఆపరేషన్ అయితే ఫిర్యాదులు, కేసులు ఉంటాయి. ఇందులో హీరోయిన్ రెజీనా మొదటి కోవకు చెంది ప్రశంసలను అందుకుంది. అయితే అదేమిటో చూద్దాం. హీరోయిన్ రెజీనా కోలీవుడ్‌లో అడపాదడపానే మెరుస్తోంది. ఎక్కువగా తెలుగు చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తుందని అపవాదు కోలీవుడ్ వర్గాల్లో ఉంది. ప్రస్తుతం రెజీనా మిస్టర్ చంద్రమౌళి అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.
ఈ సినిమాలో సీనియర్ నటుడు కర్తీక్, ఆయన కొడుకు గౌతమ్ కర్తీక్ కలిసి నటించడం విశేషం. ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పార్టు ప్రణాళిక వేగంగా జరుపుకుని గురువారంతో పూర్తి చేసుకుంది. ఈ సినిమాను సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత ధనుంజయన్ తెలిపారు. షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.
కేక్‌పై ‘థాంక్స్ రెజీ ఫర్ ది కోఆపరేషన్’ ఒన్ మోర్ డే ప్లీజ్ అంటూ పేర్కొనడం విశేషం. ఈ సందర్భంగా నిర్మాత ధనుంజయన్ మాట్లాడుతూ.. వృతిపై భక్తి కలిగిన నటి రెజీనా అని పేర్కొన్నారు. అంకితభావంలోనూ, నటనలనూ తనకు సాటి తనేనని పొగిడారు. ఈ చిత్రానికి ఆమె సహకారం చాలా ఉందని నిర్మాత చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment