
కోలీవుడ్‌ను గాయాలు వెంటాడుతున్నట్టున్నాయి. ఇటీవలే ‘వలిమై’ చిత్రీకరణలో హీరో అజిత్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో గాయపడ్డారు. ఆ తర్వాత ‘ఇండియన్ 2’లో జరిగిన భారీ ప్రమాదం గురించి తెలిసిందే. తాజాగా హీరో కార్తీ కూడా గాయపడ్డారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో కార్తీ గాయపడ్డారని సమాచారం. రాజుల కాలం నాటి సినిమా కాబట్టి యుద్ధ సన్నివేశాలు, గుర్రపు స్వారీ సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉంటాయట. అలాంటి ఓ సన్నివేశం చిత్రీకరణలో గుర్రం మీద నుంచి అదుపు తప్పి కింద పడిపోయారట కార్తీ. పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదని టాక్.
Comments
Please login to add a commentAdd a comment