కోట్లాది రూపాయిల ఆస్తులు కోల్పోయిన హీరో | Hero karthik loss crores of rupees property | Sakshi
Sakshi News home page

కోట్లాది రూపాయిల ఆస్తులు కోల్పోయిన హీరో

Published Thu, Aug 28 2014 8:59 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM

కోట్లాది రూపాయిల ఆస్తులు కోల్పోయిన హీరో

కోట్లాది రూపాయిల ఆస్తులు కోల్పోయిన హీరో

చెన్నై : సీనియర్ నటుడు, యువ నటుడు గౌతమ్ కార్తీక్ తండ్రి అయిన కార్తీక్ కోట్లాది రూపాయల పూర్వీకుల ఆస్తులను కోల్పోయారు. కుటుంబంతో నివశిస్తున్న ఇంటిని కూడా వదులుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకెళితే 1980-90 ప్రాంతంలో తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరో కార్తీక్. తెలుగులోను, అభినందన వంటి పలు హిట్ చిత్రాల్లో నటించి పేరుగాంచారు. కార్తీక్ తండ్రి ముత్తురామన్ మంచి నటుడే. ఈయనకు స్థానిక ఆల్వార్‌పేటలో పలు వాణిజ్య భవనాలు ఉన్నాయి. వీటి విలువ కోట్లాది రూపాయలు ఉంటుంది. ముత్తురామన్ పూర్వీకుల ఇంట్లోనే కార్తీక్ కుటుంబం నివశిస్తోంది.

ముత్తురామన్‌కు కార్తీక్‌తోపాటు మరో కొడుకు, కూతుళ్లు ఉన్నారు. కార్తీక్ కుటుంబ సభ్యుల మధ్య ఇటీవల మనస్పర్థలు వచ్చారుు. గొడవల కారణంగా కార్తీక్ ఇల్లు వదిలి బయటకు పోవలసి వచ్చింది. తన తండ్రి ఆస్తిలో తనకు భాగం ఉందని కార్తీక్ వాదించినప్పటికీ ఫలితం లేకపోరుుంది. కుటుంబ సభ్యుల మోసానికి గురయ్యానని కార్తీక్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వెలిబుచ్చారు. తనకు జరిగిన మోసం గురించి ఆయన న్యాయవాదుల సలహా తీసుకునే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement