రేణుకాస్వామి హత్య కేసు...
యశవంతపుర: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు కార్తీక్ పురోహిత్ అనే మరో నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని సోమవారం విచారించారు.
గత శనివారం కూడా నాలుగైదు గంటల పాటు ప్రశ్నించినట్లు తెలిసింది. ఓ ఎమ్మెల్యే కారు డ్రైవర్‌గా పని చేస్తున్న కార్తీక్ పురోహిత్, రేణుకాస్వామి మృతదేహాన్ని పారేసిన తరువాత నిందితుడు ప్రదోశ్‌ను అక్కడ నుంచి తీసుకెళ్లినట్లు విచారణలో బయట పడింది. తన కారులోనే ప్రదోశ్‌ను గిరినగరకు తీసుకెళ్లాడు. ఆ రోజు ఏమి జరిగిందనేది కార్తీక్ నుంచి పోలీసులు వివరాలను సేకరించారు.
పవిత్ర స్నేహితురాలు సమత విచారణ
పవిత్రగౌడ ఆప్త స్నేహితురాలు సమతను ఈ కేసులో పోలీసులు విచారించారు. నిందితుడు ధనరాజ్‌కు ఆమె రూ. 3 వేలు పంపిన అధారాలను సేకరించారు.
ఈ డబ్బులతో ధనరాజ్ ఎలక్ట్రిక్ షాక్ పరికరాన్ని కొన్నట్లు అనుమానిస్తున్నారు. బసవేశ్వరనగర ఠాణాలో సమతను ప్రశ్నించారు. మరోవైపు దర్శన్, పవిత్రతో పాటు 17 మంది నిందితులు జైళ్లలో కస్టడీలో ఉన్నారు. దర్శన్ బెయిలు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment