
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో ఏళ్లతరబడి నుంచి పాతుకుపోయినా యాపిల్, శాంసంగ్ కంపెనీలకు వన్‌ప్లస్ గట్టి పోటీనే ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్ భారీ ఆదరణను నోచుకున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ను ఇట్టే కట్టిపడేశాయి. ఒకానొక సమయంలో వన్‌ప్లస్ యూజర్లు తీసిన ఫోటోలను కంపెనీ బిల్‌బోర్డ్స్‌గా కూడా వాడుకుంది. తాజాగా వన్‌ప్లస్ 9 ప్రొ స్మార్ట్‌ఫోన్‌తో ఏకంగా సినిమానే చిత్రించారు.
మొత్తం షూట్ వన్‌ప్లస్ 9ప్రోతోనే..!
విక్రమాదిత్య మోట్‌వానేకు చెందిన ఆందోళన్ ప్రొడక్షన్, బిగ్ బ్యాడ్ వోల్ఫ్ స్టూడియోస్, ఆడ్ అండ్ ఈవెన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా 2024 అనే ఫీచర్ ఫిల్మ్‌ను రూపొందించారు. 60 నిమిషాలపాటు సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ పూర్తిగా వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో 8కే రికార్డింగ్‌లో చిత్రించారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలైంది.ఈ సినిమాలోని విజువల్స్ ప్రొఫెషనల్ సినిమా కెమెరాతో తీసినట్లుగానే అద్భుతంగా వచ్చాయి.
చదవండి: కేవలం రూ.10 వేలకే..అదిరిపోయే ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్‌లు ఇవే
Comments
Please login to add a commentAdd a comment