సాధారణంగా మనం ఎప్పుడూ చూడని కొత్త జంతువులు ఎదురుగా కనిపిస్తే చూసి భయపడుతాం. పోలాండ్‌లో గుర్తించిన ఇలాంటి ఒక వింత జంతువు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. దానికి కాళ్లు, చేతులు, తల వంటి భాగాలు కూడా లేవు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను క్రాకో యానిమల్ వెల్ఫేర్ సొసైటీ ఫేస్‌బుక్ పేజీ ద్వారా వెల్లడించింది. ఈ సంస్థకు ఇటీవల ఒక మహిళ ఫోన్ చేసింది. తన ఇంటి దగ్గర ఒక వింత జంతువును చూసి చాలా మంది భయపడుతున్నారని, ఎక్కడ తమ ఇంట్లోకి వస్తుందని కిటికీలు కూడా తెరవట్లేదని ఆమె పేర్కొంది.
ఆ అధికారి ఆ వింత జీవి గురించి మరిన్ని వివరాలు అడిగారు. అది కదలడం లేదని ఆ మహిళ చెప్పినప్పుడు, అది అనారోగ్య పక్షి కావచ్చునని అతను తెలిపాడు. కానీ ఆమె ఆ విషయాన్ని ఖండించింది. ఆమె చెప్పిన వివరాలతో అది ఒక లెగ్వాన్ లేదా ఇగువానా (ఊసరవెల్లి వంటిది) కావచ్చని భావించారు. కానీ అవి చలి ప్రాంతంలో ఉండవని ఆడమ్‌కు అర్థమైంది. ఆ తర్వాత మహిళ చెప్పిన ప్రాంతానికి ఆడమ్ బృందం వెళ్లింది. అది గోధుమ రంగులో వింతగా ఒక కొమ్మపై నక్కి ఉంది. ఏమాత్రం కదలట్లేదు. దానికి కాళ్లు, తల వంటివి కూడా లేవు.
కానీ, చివరికి దాన్ని నిశితంగా పరిశీలిస్తే అది అసలు జంతువే కాదని తెలిసింది. ఆ దేశంలో లభించే క్రొసియెంట్ అనే ఒక రకమైన బ్రెడ్. దానిని అక్కడ పక్షులకు ఆహారం అందివ్వడానికి ఎవరో స్థానికులు చెట్టు మీద పెట్టి ఉండవచ్చు అని వారు భావించారు. దీంతో అక్కడ ఉన్న వారు ఒక్కసారిగా నవ్వారు. ఫేస్‌బుక్‌లో ఈ పోస్టును ఏడు వేల మంది వరకు లైక్ చేశారు. వందల మంది ఈ వింత జీవి ఫోటోకు ఫన్నీ కామెంట్లు పెడుతూ షేర్ చేస్తున్నారు. తాము కూడా ఇది ఉడత లాంటి జంతువు అని భావించినట్లు కామెంట్స్ పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment