సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (నవంబర్ 27) హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.ఈ ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా విచ్చేసారు.
ఈ సందర్బంగా దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఎంతోమంది కొత్త కొత్త డైరెక్టర్లు వస్తారు. హిట్‌లు, సూపర్ హిట్ సినిమాలు తీస్తారు. చాలా పెద్ద పేరు కూడా సంపాదిస్తారు. అవి మనం తరచుగా చూస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడో ఓ సారి మాత్రమే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ మొతాన్ని షేక్ చేసే డైరెక్టర్ వస్తాడు.
అతడు సినిమా అంటే ఇలాగే తీయాలన్న ఫార్ములాను కూడా షేక్ చేస్తాడు. అలాంటి డైరెక్టర్ నాకు తెలిసి నా తరంలో రాంగోపాల్ వర్మ. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా అలాంటి డైరెక్టర్. సినిమా ఇలాగే తీయాలన్న రూల్ పక్కన పెట్టి.. నేను ఇలాగే సినిమా తీస్తా అనే డైరెక్టర్ అతడు. నిన్ను చూసి చాలా గర్విస్తున్నా" అని సందీప్ ను ఉద్దేశించి రాజమౌళి అనడం విశేషం.
యానిమల్ చిత్ర టీజర్ చూడగానే ఈ సినిమా నేను చూడాలని వెంటనే అనిపించింది. రాబోయే మూడు సంవత్సరాల్లో కూడా టీజర్ చూడగానే మొదటి రోజే చూడాలనిపించిన చిత్రం యానిమల్ అంటూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై దర్శక ధీరుడు ప్రశంసలు కురిపించాడు.
నా ఫేవరేట్ యాక్టర్ రణ్‌బీర్ కపూర్: రాజమౌళి
బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్‌బీర్ కపూర్ గురించి రాజమౌళి మాట్లాడుతూ.. నా ఫేవరేట్ బాలీవుడ్ యాక్టర్ ఎవరు అంటూ నన్ను చాలా మంది అడిగితే ఏ మాత్రం ఆలోచించకుండ రణ్‌బీర్ కపూర్ అని చెప్తాను. నేను చూసిన తన సినిమాలు తక్కువే కానీ చాలా ఇంటెన్సిటీ ఉన్న నటుడు. తన 15 ఏళ్ల కెరీర్‌లో తన టాలెంట్ చూపించుకునేలాంటి చిత్రాలు చాలా తక్కువ వచ్చాయి. యానిమల్‌తో తనకు ఆ లోటు తీరుతుంది. రణ్‌బీర్ కపూర్ ఇండస్ట్రీలోనే టాప్‌లో ఉంటాడని జక్కన్న అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment