నెగెటివ్ పాత్రలు ఒకప్పుడు విలన్లు మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు హీరోలు కూడా తమలో నెగెటివ్ షేడ్స్ చూపిస్తున్నారు. హింస, రక్తపాతంతో చెలరేగుతున్నారు. ఇలాంటి పాత్రలను ప్రేక్షకులు సైతం ఇష్టపడుతున్నారు. యానిమల్‌లో రణ్‌బీర్ కపూర్ చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు. తన కుటుంబం కోసం ఎంతదూరమైనా వెళ్తాడు. అదే సమయంలో ప్రేమించిన భార్యకు నరకం చూపిస్తాడు. ఈ కథను జనాలు ఆదరించారు. బ్లాక్‌బస్టర్ చేశారు.
ఈ ధోరణిపై బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాల్లో కథ, పాత్రలను చూపిస్తారు. అంతేకానీ ఆ పాత్రలను ఆదర్శంగా తీసుకుని అలాగే మెసులుకోవాలని ఎవరూ చెప్పట్లేదు. రణ్‌బీర్ నటించిన యానిమల్ మూవీ నాకెంతో నచ్చింది. తన పర్ఫామెన్స్ చూస్తే దిమ్మ తిరిగిపోయింది. ఈ చిత్రాన్ని ఎందుకంతలా విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ సినిమా పేరేమీ ఆదర్శ పురుష్ కాదు యానిమల్. టైటిల్‌ను బట్టి మీరే అర్థం చేసుకోవాలి. డైరెక్టర్ ఇక్కడ ఒక మృగం లాంటి వ్యక్తి గురించి చెప్తున్నాడని గ్రహించాలి' అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment