'భోళా శంకర్'కి లైన్ క్లియర్.. ఆ సినిమా వాయిదా వల్ల! | Animal Movie Postponed Bhola Shankar Line Clear | Sakshi
Sakshi News home page

Bhola Shankar Movie: మెగాఫ్యాన్స్‌.. రచ‍్చకు రెడీ అయిపోండి!

Published Sun, Jul 2 2023 8:05 AM | Last Updated on Sun, Jul 2 2023 8:06 AM

Animal Movie Postponed Bhola Shankar Line Clear - Sakshi

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్! ఎందుకంటే కొన్నిరోజుల ముందు విడుదలైన 'భోళా శంకర్' టీజర్ అభిమానులకు నచ్చేసింది. దీంతో సినిమా రిలీజ్ కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 11న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇలాంటి టైంలో చిత్రబృందాన్ని సంతోషపరిచే ఓ వార్త ఇప్పుడు వినిపిస్తోంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. ఇంతకీ ఏంటది?

లైన్ క్లియర్
చిరు 'భోళా శంకర్' సినిమాను తొలుత ఈ ఏడాది ఏప్రిల్ లోనే రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ కుదర్లేదు. దీంతో ఆగస్టు 11న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. అదే తేదీన 'అర్జున్‌రెడ్డి' ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీసిన 'యానిమల్' విడుదల చేయాలని అనుకున్నారు. ఆగస్టు 10న సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్' సినిమా విడుదలని ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు పోటీ నుంచి 'యానిమల్' తప్పుకొన్నట్లు తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!)

'యానిమల్' ఎప్పుడు?
సినిమాకు సంబంధించిన కొన్ని వర్క్స్ ఇంకా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆగస్టు 11న 'యానిమల్'ని తీసుకురావడం కుదరదని తేలినట్లు తెలుస్తోంది. దీంతో సెప్టెంబరులో చేద్దామనుకున్నారు కానీ ఆ నెలలో షారుక్ 'జవాన్' ఉంది. దీంతో అన్నీ ఆలోచించి.. ఏకంగా 'యానిమల్'ని డిసెంబరులో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

'భోళా'కు ఇది ప్లస్
పోటీలో ఉన్న మూడు సినిమాల్లో ఒకటి తప్పుకోవడం 'భోళా శంకర్' కు తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోనూ కచ్చితంగా కలిసొస్తుందని చెప్పొచ్చు. రజినీకాంత్ 'జైలర్' సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ఒకవేళ ఏదైనా అద్భుతం చేస్తే తప్ప.. చిరంజీవి కొత్త చిత్రానికి కలెక్షన్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: హీరో ధనుష్‌కి రెడ్ కార్డ్.. అతడి సినిమాలపై నిషేధం?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement